త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

IPL 2026 | స‌న్‌రైజ‌ర్స్‌కు గుడ్‌న్యూస్‌.. రెగ్యుల‌ర్ కెప్టెన్ క‌మిన్స్ వ‌చ్చేస్తున్నాడు..!

IPL 2026 | స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌కు ఊరటనిచ్చే వార్త. ఆ జట్టు కెప్టెన్ ప్యాట్‌ కమిన్స్‌ ఏప్రిల్‌ 17న మళ్లీ జట్టుతో చేరే అవకాశముందని సమాచారం. శనివారం హైదరాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగే మ్యాచ్‌కు ముందురోజు జ‌ట్టుతో చేర‌బోతున్నాడు.

P

Sports | Published On Apr 15, 2026, 7.00 am IST

IPL 2026 | స‌న్‌రైజ‌ర్స్‌కు గుడ్‌న్యూస్‌.. రెగ్యుల‌ర్ కెప్టెన్ క‌మిన్స్ వ‌చ్చేస్తున్నాడు..!
Advertisement

IPL 2026 | స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌కు ఊరటనిచ్చే వార్త. ఆ జట్టు కెప్టెన్ ప్యాట్‌ కమిన్స్‌ ఏప్రిల్‌ 17న మళ్లీ జట్టుతో చేరే అవకాశముందని సమాచారం. శనివారం హైదరాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగే మ్యాచ్‌కు ముందురోజు జ‌ట్టుతో చేర‌బోతున్నాడు. ఓ క్రికెట్ నివేదిక ప్ర‌కారం.. క‌మిన్స్ బుధ‌వారం ఆస్ట్రేలియాలో ఫిట్‌నెస్‌ పరీక్షకు హాజరుకానున్నాడు. ఆ పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తే, క్రికెట్‌ ఆస్ట్రేలియా నుంచి అనుమతి (ఎన్‌ఓసీ) పొందిన వెంటనే జట్టుతో చేరి మిగ‌తా మ్యాచ్‌ల్లో ఆడే అవకాశం ఉంది. ఫ్రాంచైజీ వర్గాలు ఆయన ఫిట్‌నెస్‌పై ఆశాభావంతో ఉన్న‌ట్లు తెలుస్తోంది.

ఇంగ్లండ్‌తో స్వ‌దేశంలో జ‌రిగిన యాషెస్ సిరీస్ త‌ర్వాత క‌మిన్స్ ఒక్క మ్యాచ్ కూడా ఆడ‌లేదు. ఇటీవల ముగిసిన ఐసీసీ టీ20 ప్రపంచకప్ కూడాలో పాల్గొనలేదు. ఆ టోర్నీలో ఆస్ట్రేలియా జట్టు తొలిసారి గ్రూప్‌ దశలోనే నిష్క్రమించింది. సీజన్‌ ప్రారంభానికి ముందు భారత్‌కు వచ్చిన కమిన్స్‌, ఒక్క మ్యాచ్‌లో కూడా పాల్గొనకుండానే తిరిగి ఆస్ట్రేలియాకు వెళ్లిపోయాడు. ఏప్రిల్‌ 2న కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై సన్‌రైజర్స్‌ సాధించిన విజయం అనంతరం వెన్నునొప్పి స్కాన్‌ కోసం ఆయన బయలుదేరారు.

కమిన్స్‌ గైర్హాజరీలో ఇషాన్‌ కిషన్‌ జట్టును నడిపిస్తున్నారు. ఆయన సారథ్యంలో ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు సాధించిన హైదరాబాద్‌ జట్టు, నాలుగు పాయింట్లు మరియు 0.576 నెట్‌ రన్‌రేట్‌తో పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. ఇటీవల సోమవారం జరిగిన మ్యాచ్‌లో పట్టికలో అగ్రస్థానంలో ఉన్న రాజస్థాన్‌ రాయల్స్‌పై సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ విజయం సాధించింది. డెబ్యూ ఆటగాళ్లు ప్రఫుల్‌ హింగే, సాకిబ్‌ హుస్సేన్‌ తలా నాలుగు వికెట్లు తీసి రాణించడంతో, 217 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన రాజస్థాన్‌ జట్టు 19 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌట్‌ అయి 57 పరుగుల తేడాతో ఓడిపోయింది.

Advertisement
Advertisement