IND Vs Pak | పాకిస్తాన్ ద్వంద్వ వైఖరి.. భారత్‌తో టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌కి నో.. ఆసియా కప్‌లో సై..!
IND Vs Pak | టీ20 ప్రపంచకప్‌కి ముందు పాకిస్తాన్ వివాదానికి తెరలేపింది. ఫిబ్రవరి 15న భారత్‌తో జరగాల్సిన మ్యాచ్ ఆడకూడదని నిర్ణయించింది. కొలంబో వేదికగా ఈ మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే, కీలక టోర్నీకి ముందు పాక్ ద్వంద్వ వైఖరి వెలుగు చూసింది.
IND Vs Pak | టీ20 ప్రపంచకప్‌కి ముందు పాకిస్తాన్ వివాదానికి తెరలేపింది. ఫిబ్రవరి 15న భారత్‌తో జరగాల్సిన మ్యాచ్ ఆడకూడదని నిర్ణయించింది. కొలంబో వేదికగా ఈ మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే, కీలక టోర్నీకి ముందు పాక్ ద్వంద్వ వైఖరి వెలుగు చూసింది. వాస్తవానికి, భారత్‌తో మ్యాచ్‌లో ఓటమి తప్పదని గ్రహించిన ప్రభుత్వం.. మ్యాచ్ ఆడకుండా అడ్డుకుంటున్నట్లుగా విమర్శలున్నాయి. అయితే, అదే రోజున వుమెన్స్ టీమ్ ఆసియా కప్‌లో భారత జట్టుతో మ్యాచ్‌లో తలపడనున్నది. షెడ్యూల్ ప్రకారం భారత్-పాకిస్తాన్ మధ్య 15న రెండు మ్యాచులు జరగాల్సిన ఉన్నాయి. టీ20 ప్రపంచ కప్, వుమెన్స్ రైజింగ్ స్టార్ ఆసియా కప్ టీ20 టోర్నీలో రెండుదేశాలు ఆడాల్సి ఉంది.
టీ20 ప్రపంచకప్ ఈ నెల 7న ప్రారంభం కానున్నది. భారత్-శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న వరల్డ్ కప్‌లో 20 జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు. టోర్నీలో సెమీ ఫైనల్, ఫైనల్‌తో సహా మొత్తం 55 మ్యాచులుంటాయి. షెడ్యూల్ ప్రకారం 15న భారత్‌తో పాక్ తలపడాల్సి ఉంది. కానీ, పాక్ ప్రభుత్వం మ్యాచ్ ఆడబోమని ప్రకటన విడుదల చేసింది. ఇందుకు మాత్రం కారణాలు చెప్పలేదు. వాస్తవానికి గతంలో బంగ్లాదేశ్‌కు మద్దతుగా టోర్నీని బహిష్కరిస్తామని బెదిరించింది. ఆ తర్వాత నష్టానికి జడిసి ఆడుతామంటూ దారికొచ్చింది. తాజాగా భారత్‌ను మ్యాచ్‌ను ఆడబోమంటూ సరికొత్త నాటకం ఆడుతోంది. మ్యాచ్ ఆడకపోతే జరిగే నష్టాన్ని పీసీబీ భరించాల్సి ఉంటుందని.. ఆంక్షలు సైతం ఎదుర్కోవాల్సి ఉంటుందని ఐసీసీ గట్టి హెచ్చరికలు చేసింది. దాంతో దాయాది దేశం ప్రస్తుతం సందిగ్ధంలో పడింది. ఈ క్రమంలో ముందు నుయ్యి.. వెనక గొయ్యి అన్నట్లుగా పీసీబీ పరిస్థితి తయారైంది. ఈ నేపథ్యంలో పాక్ చివరి నిమిషంలో తన నిర్ణయం మార్చుకొని చివరకు మైదానంలోకి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
గతంలో పురుషుల రైజింగ్ స్టార్స్ టోర్నీ జరిగింది. తొలిసారిగా వుమెన్స్ రైజింగ్ స్టార్స్ టోర్నీ జరుగుతోంది. షెడ్యూల్‌ను ఇటీవల ప్రకటించారు. ఆసియా కప్ టీ20 టోర్నమెంట్ థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్ వేదికగా జరుగుతుంది. ఫిబ్రవరి 15న ఇండియా ఏ, పాకిస్థాన్ ఏ జట్లు తలపడతాయి. టీ20 ప్రపంచకప్ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7 గంటలకు మొదలుకానుండగా.. ఆసియా కప్ మ్యాచ్ మధ్యాహ్నం 12.30 గంటలకు మొదలుకానున్నది. పీసీబీ ఫిబ్రవరి 1న మహిళల ఏ జట్టును ప్రకటించింది. ఈ మ్యాచ్ విషయంలో ఇప్పటి వరకు పాక్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.
ఈ టోర్నీ నిర్వహించే బాధ్యత ఆసియా క్రికెట్ కౌన్సిల్‌ది కావడం విశేషం. ఏసీసీకి ట్రోఫీ చోర్ మొహ్సిన్ నఖ్వీ చైర్మన్‌గా ఉండడం విశేషం. నఖ్వీ పాక్ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతున్నారు. భారత్‌తో టీ20 ప్రపంచ కప్ మ్యాచ్‌ను బహిష్కరించాలనే నిర్ణయంలో మొహ్సిన్ నఖ్వీ కీలక పాత్ర పోషించారని ప్రచారం జరుగుతున్నది. అయితే, ఈ విషయంపై పీసీబీ ఇప్పటి వరకు స్పందించలేదు. రెండు మ్యాచుల్లో ఆడుతుందా? లేదా అన్నది త్వరలోనే తేలనున్నది.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






