Najmul Hossain Shanto | వరల్డ్ కప్‌లో ఆడాలని ఉంది.. బంగ్లా ప్లేయర్ శాంటో సంచలనం..
Najmul Hossain Shanto | భారత్, శ్రీలంక వేదికలుగా జరగనున్న 2026 టీ20 వరల్డ్‌కప్‌లో బంగ్లాదేశ్ పాల్గొంటుందా లేదా అన్న అంశంపై కొనసాగుతున్న అనిశ్చితి నడుమ, బంగ్లాదేశ్ స్టార్ బ్యాటర్ నజ్ముల్ హుస్సేన్ శాంటో కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆటగాళ్లంతా ఐసీసీ టోర్నీలో ఆడాలని కోరుకుంటున్నారని స్పష్టం చేశాడు.
Najmul Hossain Shanto | భారత్, శ్రీలంక వేదికలుగా జరగనున్న 2026 టీ20 వరల్డ్‌కప్‌లో బంగ్లాదేశ్ పాల్గొంటుందా లేదా అన్న అంశంపై కొనసాగుతున్న అనిశ్చితి నడుమ, బంగ్లాదేశ్ స్టార్ బ్యాటర్ నజ్ముల్ హుస్సేన్ శాంటో కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆటగాళ్లంతా ఐసీసీ టోర్నీలో ఆడాలని కోరుకుంటున్నారని స్పష్టం చేశాడు. బుధవారం బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) తన తుది నిర్ణయాన్ని ప్రకటించనున్న నేపథ్యంలో, మంగళవారం మీడియాతో మాట్లాడిన శాంటో ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. క్రికెట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ బంగ్లాదేశ్ (CWAB) తరఫున ఈ విషయంపై అధికారికంగా ఎలాంటి చర్చ జరగలేదని శాంటో వెల్లడించాడు. అయినప్పటికీ, బోర్డులో అంతర్గతంగా ఏం జరుగుతుందో పూర్తిగా తెలియకపోయినా, ఆటగాళ్లు మాత్రం వరల్డ్‌కప్‌లో ఆడాలనే ఉద్దేశంతోనే ఉన్నారని పేర్కొన్నాడు. ఇటీవల జరిగిన కొన్ని పరిణామాల వల్ల ఆటగాళ్లు మానసికంగా కష్టకాలాన్ని ఎదుర్కొన్నారని కూడా అన్నాడు.
వరల్డ్ కప్‌లో ఆడాలని ఉంది: శాంటో
ఈ అంశంపై మాట్లాడుకునే అవకాశం పెద్దగా రాలేదు. మేమంతా మ్యాచ్‌లతో బిజీగా ఉన్నాం. ఇటీవలి ఘటనలు ఆటగాళ్లపై మానసిక ప్రభావం చూపాయి. అది చాలా కఠినమైన సమయం, అని శాంటో తెలిపాడు. వరల్డ్‌కప్ ప్రాధాన్యతను వివరిస్తూ, ఇలాంటి అవకాశాలు తరచుగా రావని శాంటో అన్నారు. క్రికెటర్లమన్నాక ఎప్పుడూ ఆడాలనే ఉంటుంది. అది వరల్డ్‌కప్ లాంటి పెద్ద టోర్నీ అయితే మరింతగా. ఇవి అరుదుగా వస్తాయి. ముఖ్యంగా వన్డే వరల్డ్‌కప్ నాలుగేళ్లకోసారి మాత్రమే వస్తుంది. మంచి క్రికెట్ ఆడేందుకు ఇది మాకు గొప్ప అవకాశం, అని పేర్కొన్నాడు. బోర్డు లోపల జరుగుతున్న విషయాలపై తనకు పూర్తి సమాచారం లేదని అంగీకరించిన శాంటో, అయినప్పటికీ ఆటగాళ్ల అభిప్రాయం మాత్రం మారలేదని స్పష్టం చేశాడు. అంతర్గతంగా ఏం జరుగుతుందో నాకు తెలియదు. కానీ ఆటగాళ్లుగా మాత్రం మేము కచ్చితంగా వరల్డ్‌కప్‌లో ఆడాలనుకుంటున్నాం, అని అన్నాడు.
బోర్డు మాతో సంప్రదింపులు జరపలేదు: లిటన్ దాస్
అయితే తుది నిర్ణయం మాత్రం బీసీబీ చేతుల్లోనే ఉందని శాంటో గుర్తు చేశాడు. చాలా అంశాలు ఇందులో ఉన్నాయి. అన్నీ నాకు తెలియకపోయినా, సమస్యలు పరిష్కారమై అవకాశం లభిస్తే, ఆటగాళ్లకు వరల్డ్‌కప్‌లో పాల్గొనడం చాలా మంచిదే, అని ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా బంగ్లాదేశ్ టీ20 కెప్టెన్ లిటన్ దాస్ కూడా ఈ అంశంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ సందర్భంగా మాట్లాడిన అతను, వరల్డ్‌కప్‌లో పాల్గొనాలా వద్దా అనే విషయంలో ఆటగాళ్లతో బోర్డు ఎలాంటి సంప్రదింపులు జరపలేదని తెలిపారు. మా అనుమతి తీసుకోలేదు. నాకు కూడా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. జీవితంలో అన్నీ మనకు అనుకూలంగా ఉండవు, పరిస్థితులకు అనుగుణంగా అంగీకరించాల్సిందే, అని లిటన్ దాస్ వ్యాఖ్యానించాడు.
బీసీబీని ప్లేయర్లు బహిష్కరిస్తారా..?
బంగ్లాదేశ్ ప్లేయర్లు బహిరంగంగానే ఈ వ్యాఖ్యలు చేస్తుండడంతో వారు తమ బోర్డు వైఖరిని తప్పుబడుతున్నట్లు స్పష్టమవుతోంది. ద్వైపాక్షిక సిరీస్ అంటే ఇరు దేశాల మధ్య ఆడాల్సిన మ్యాచ్‌లు కాబట్టి వాటిని రద్దు చేసుకున్నా, వాయిదా వేసుకున్నా ఒక లెక్క ఉంటుంది. కానీ వరల్డ్ కప్ అలాంటి అంతర్జాతీయ టోర్నీలలో పాల్గొనే అవకాశం చాలా తక్కువ సార్లు వస్తుంది. జట్లన్నీ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చూస్తాయి. బంగ్లా ప్లేయర్లు కూడా అదే చెప్పారు. ఈ క్రమంలో వారు తమ సొంత బోర్డుతో విభేదిస్తున్నట్లు స్పష్టమవుతోంది. అయితే వారికి వ్యతిరేకంగా బీసీబీ నిర్ణయం తీసుకుంటే వారు తమ బోర్డును బహిష్కరించి బయటకు వస్తారా.. అన్న చర్చ కూడా కొనసాగుతోంది. మొత్తానికి ఐపీఎల్ నుంచి ముస్తాఫిజుర్ తొలగింపు ఆ తరువాత అనేక నాటకీయ పరిణామాలకు దారి తీసిందని చెప్పవచ్చు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






