Union Cabinet | 2030-31 వరకు అటల్ పెన్షన్ యోజన.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..!
Union Cabinet | కేంద్ర కేబినెట్ బుధవారం రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో బుధవారం కేబినెట్ సమావేశమైంది. ఈ సందర్భంగా ప్రజల సామాజిక భద్రతను బలోపేతం చేసేందుకు తీసుకువచ్చిన అటల్ పెన్షన్ యోజన (APY) స్కీమ్‌ను 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
Union Cabinet | కేంద్ర కేబినెట్ బుధవారం రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో బుధవారం కేబినెట్ సమావేశమైంది. ఈ సందర్భంగా ప్రజల సామాజిక భద్రతను బలోపేతం చేసేందుకు తీసుకువచ్చిన అటల్ పెన్షన్ యోజన (APY) స్కీమ్‌ను 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఉపాధి కల్పన, చిన్న తరహా పరిశ్రమలను (MSMEs) ప్రోత్సహించేందుకు స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SIDBI)లో రూ.వేలకోట్ల మూలధన పెట్టుబడికి ఆమోదం తెలిపింది.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అటల్ పెన్షన్ యోజన పథకాన్ని 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు కొనసాగించేందుకు మంత్రివర్గం సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. ఈ పథకాన్ని మోదీ ప్రభుత్వం 2015 మే 9న ప్రారంభించింది. అసంఘటిత రంగంలోని కార్మికులకు వృద్ధాప్యంలో ఆదాయ భద్రతను అందించడమే లక్ష్యంగా తీసుకువచ్చింది. 2026 జనవరి 19 నాటికి 8.66కోట్ల మందికిపైగా ఈ పథకంలో చేరారు. ఈ పథకంలో చేరిన వారికి 60 సంవత్సరాల వయస్సు తర్వాత నెలకు రూ.వెయ్యి నుంచి రూ.5వేల వరకు కనీస పెన్షన్ లభిస్తుంది.
చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (MSMEs) ఉపశమనం కల్పిస్తూ కేంద్రం ఎస్ఐడీబీఐకి రూ.5వేలకోట్ల ఈక్విటీ సపోర్ట్‌ను అందించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మూలధనాన్ని ఆర్థిక సేవల విభాగం (DFS) మూడు వాయిదాల్లో అందిస్తారు. కేంద్రం 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.3వేలకోట్లు, 2026-27, 2027-28 ఆర్థిక సంవత్సరాల్లో ఒక్కోదాంట్లో రూ.వెయ్యికోట్ల పెట్టుబడి పెడుతుంది. అదనపు మూలధనం ఎస్ఐడీబీఐకి సహేతుకమైన వడ్డీ రేట్లకు వనరులను సమీకరించేందుకు వీలు కలుగుతుంది. ఈ నిర్ణయంతో ఉపాధి రంగానికి ఊతంగా నిలుస్తుందని కేంద్రం భావిస్తున్నది. ఈ పెట్టుబడి ద్వారా 11.2 మిలియన్ల ఉద్యోగాలు సృష్టించబడుతాయని అంచనా వేస్తున్నది.
2025 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 76.26 లక్షల ఎంఎస్‌ఎంఈలు ఆర్థిక సహాయం పొందుతున్నారు. 2028 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఈ సంఖ్య 102 లక్షలకు పెరుగుతుందని అంచనా. ఈ నిర్ణయం ద్వారా సుమారు 25.74 లక్షల మంది కొత్త ఎంఎస్‌ఎంఈ లబ్ధిదారులు చేరుతారని, తద్వారా క్షేత్ర స్థాయిలో ఆర్థిక కార్యకలాపాలు కొత్త ఊపునిస్తుంది. కేంద్రం నిర్ణయాలు సామాజిక భద్రత, ఆర్థిక వృద్ధి అనే రెండు కీలక జెండాలపై ప్రభుత్వ దృష్టిని సూచిస్తున్నాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. అటల్ పెన్షన్ యోజన బలహీన వర్గాలకు భద్రతనిస్తే.. ఎస్ఐబీడీఐతో చిన్న పరిశ్రమలు విస్తరించడానికి, కొత్త ఉద్యోగాలను సృష్టించేందుకు సహాయపడుతుందని తెలిపాయి.
తాజావార్తలు
- ●Cheruvugattu | చెరువుగట్టులో భారీ అగ్నిప్రమాదం.. 15 దుకాణాలు అగ్నికి ఆహుతి
- ●Vemulawada Rajanna Temple | ఎములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి మరో 99.40 కోట్లు విడుదల
- ●Harish Rao | ప్రజల్లో మార్పు తీసుకురావడమే నిజమైన రాజకీయం: హరీశ్ రావు
- ●Horoscope | జూలై 26 రాశి ఫలాలు.. కొన్ని ఆకస్మిక మార్పులు ఉండవచ్చు!
- ●Healthcare in Germany | భర్తకు కంటి ఇన్ఫెక్షన్.. వారం తర్వాత అపాయింట్మెంట్: జర్మనీ హెల్త్‌కేర్‌పై భారతీయ మహిళ ఆవేదన
- ●Vande Mataram 150 | 150 మంది దివ్యాంగులతో అక్షర అద్భుతం: రవీంద్రభారతిలో రోమాలు నిక్కబొడుచుకునే 'వందేమాతరం' ప్రదర్శన!

Cheruvugattu | చెరువుగట్టులో భారీ అగ్నిప్రమాదం.. 15 దుకాణాలు అగ్నికి ఆహుతి

Vemulawada Rajanna Temple | ఎములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి మరో 99.40 కోట్లు విడుదల

Harish Rao | ప్రజల్లో మార్పు తీసుకురావడమే నిజమైన రాజకీయం: హరీశ్ రావు

Horoscope | జూలై 26 రాశి ఫలాలు.. కొన్ని ఆకస్మిక మార్పులు ఉండవచ్చు!






