త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Udhayanidhi | ఉద‌య‌నిధి వ్యాఖ్య‌లు విద్వేష‌పూరిత‌మే..!

Udhayanidhi | స‌నాత‌న ధ‌ర్మాన్ని నిర్మూలించాల‌ని పిలుపునిచ్చిన త‌మిళ‌నాడు ఉప ముఖ్య‌మంత్రి ఉద‌య‌నిధి స్టాలిన్‌ చేసిన వ్యాఖ్య‌ల‌పై మ‌ద్రాస్ హైకోర్టు మ‌ధురై బెంచ్ తీవ్ర వ్యాఖ్య‌లు చేసింది. ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు విద్వేష‌పూరితంగా ఉన్నాయ‌ని పేర్కొంది. బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల‌వ్య‌పై న‌మోదైన ఎఫ్ఐఆర్‌ను ర‌ద్దు చేస్తూ ఊర‌ట‌నిచ్చింది.

P

National | Published On Jan 21, 2026, 4.21 pm IST

Udhayanidhi | ఉద‌య‌నిధి వ్యాఖ్య‌లు విద్వేష‌పూరిత‌మే..!
Advertisement
  • విద్వేష వ్యాఖ్య‌లు చేసిన వారు బాగానే ఉంటున్నారు
  • స్పందించిన వారిపైనే పోలీస్ కేసులు..
  • మ‌ద్రాస్ హైకోర్టు మ‌దురై తీవ్ర వ్యాఖ్య‌లు..
  • బీజేపీ నేత‌పై ఎఫ్ఐఆర్ కొట్టివేసిన మ‌దురై బెంచ్‌

Udhayanidhi | స‌నాత‌న ధ‌ర్మాన్ని నిర్మూలించాల‌ని పిలుపునిచ్చిన త‌మిళ‌నాడు ఉప ముఖ్య‌మంత్రి ఉద‌య‌నిధి స్టాలిన్‌ చేసిన వ్యాఖ్య‌ల‌పై మ‌ద్రాస్ హైకోర్టు మ‌ధురై బెంచ్ తీవ్ర వ్యాఖ్య‌లు చేసింది. ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు విద్వేష‌పూరితంగా ఉన్నాయ‌ని పేర్కొంది. బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల‌వీయపై న‌మోదైన ఎఫ్ఐఆర్‌ను ర‌ద్దు చేస్తూ ఊర‌ట‌నిచ్చింది. ఈ సంద‌ర్భంగా మ‌దురై బెంచ్ న్యాయ‌మూర్తి జ‌స్టిస్ శ్రీ‌మ‌తి మాట్లాడుతూ ఉద‌య‌నిధి వ్యాఖ్య‌ల‌పై మాల‌వీయ చేసిన పోస్టు నేరం కింద‌కు రాద‌న్న కోర్టు.. సనాతన ధర్మాన్ని అనుసరించే వారే లక్ష్యంగా చేసిన రెచ్చగొట్టే ప్రసంగానికి స్పంద‌న మాత్ర‌మేన‌ని అభిప్రాయం వ్య‌క్తం చేసింది. ఉదయనిధి వ్యాఖ్య‌ల‌ను కోర్టు త‌ప్పుప‌ట్టింది. డిప్యూటీ సీఎం చేసిన వ్యాఖ్య‌లు విద్వేష‌పూరిత ప్ర‌సంగం కింద‌కే వ‌స్తుంద‌ని.. అయినా రాష్ట్రంలో ఎక్క‌డా ఎలాంటి కేసులు న‌మోద‌వ‌లేద‌ని తెలిపింది.

డిప్యూటీ సీఎంపై కేసులు న‌మోదు కాలేద‌న్న కోర్టు..

2023 సెప్టెంబ‌ర్‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ఉద‌యనిధి సనాతన ధర్మానికి వ్యతిరేకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విష‌యం తెలిసిందే. డెంగ్యూ, మలేరియా, కరోనావైరస్ మహమ్మారులతో సనాతన ధర్మాన్ని పోల్చిన ఉదయనిధి.. ఇలాంటి వాటిని కేవలం నివారించడమే కాకుండా నిర్మూలించాలంటూ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న వ్యాఖ్య‌ల‌పై దేశ‌వ్యాప్తంగా అభ్యంత‌రాలు వ్య‌క్త‌మైన విష‌యం తెలిసిందే. విచార‌ణ సంద‌ర్భంగా కోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. విద్వేష వ్యాఖ్య‌లు చేసిన వారు బాగానే ఉంటున్నార‌ని, వాటిపై స్పందించిన వారే చ‌ట్ట‌ప‌ర‌మైన ఇబ్బందులు ప‌డుతున్నార‌ని గుర్తు చేసింది. విద్వేష‌పూరిత వ్యాఖ్య‌లు చేసిన డిప్యూటీ సీఎంపై రాష్ట్రంలో కేసులు న‌మోదు కాలేద‌ని గుర్తు చేసిన కోర్టు.. గ‌తంలో ఇలాంటి వ్యాఖ్య‌ల‌పై ఇత‌ర రాష్ట్రాల్లో కేసులు న‌మోద‌య్యాయ‌ని తెలిపింది.

ఆ వ్యాఖ్య‌లు జాతి నిర్మూల‌న‌ను సూచిస్తాయి..

ఉద‌య‌నిధి ఉప‌యోగించిన ప‌ద‌జాలం వాస్త‌వానికి ఏదో రూపంలో జాతి నిర్మూల‌న‌ను సూచిస్తాయ‌ని.. ద్వేషపూరిత ప్రసంగానికి సమానమని కోర్టు స్ప‌ష్టం చేసింది. సనాతన ఒజిప్పు అనే తమిళ పదబంధం స్పష్టంగా జాతి నిర్మూలన, సంస్కృతి హత్య అని అర్థ‌మ‌ని తెలిపింది. 'సనాతన ధర్మం ఉండకూడదంటే.. సనాతన ధర్మాన్ని విశ్వసించే ప్రజలు ఇక్కడ ఉండకూడదని అర్థం' అని బెంచ్ పేర్కొంది. అమిత్ మాలవ్య తన పోస్ట్‌లో హింసకు, ఆందోళనకు పిలుపునివ్వలేదని న్యాయ‌మూర్తి పేర్కొన్నారు. ఇదిలా ఉండ‌గా.. తాను చేసిన వ్యాఖ్య‌ల‌ను ఉద‌య‌నిధి ఇప్ప‌టికే స‌మ‌ర్థించుకున్నారు. త‌న వ్యాఖ్య‌ల‌కు క‌ట్టుబ‌డి ఉన్నాన‌న్నారు. త‌న వ్యాఖ్య‌లు సనాతన ధర్మాన్ని అనుసరించే వ్యక్తుల మారణహోమానికి పిలుపునివ్వ‌డం కాద‌న్నారు.

పోలీసుల ఎఫ్ఐఆర్‌ను స‌వాల్ చేసిన బీజేపీ నేత‌

ఉద‌య‌నిధి వ్యాఖ్య‌ల‌పై సోష‌ల్ మీడియా వేదిక‌గా బీజేపీ నేత అయిన అమిత్ మాల‌వీయ ప్ర‌శ్నించారు. ఈ మేర‌కు సోష‌ల్ మీడియాలో వీడియోను పోస్ట్ చేశారు. భార‌త‌దేశ జ‌నాభాలో 80శాతం ప్ర‌జ‌ల‌ను ఊచ‌కోత కోయాలంటున్నారా? అంటూ ఆయ‌న ప్ర‌శ్నించారు. ఈ పోస్ట్‌పై తమిళనాడు పోలీసులు అమిత్ మాల‌వీయ‌పై ఎఫ్ఐఆర్ న‌మోదు చేశారు. ఉద‌య‌నిధి వ్యాఖ్య‌ల‌ను వ‌క్రీక‌రించి.. వ‌ర్గాల మ‌ధ్య శ‌త్రుత్వాన్ని రెచ్చ‌గొట్టార‌ని ఆరోపించారు. మాల‌వీయ ఈ ఆరోప‌ణ‌ల‌పై కోర్టును ఆశ్ర‌యించారు. ఈ మేర‌కు కోర్టు తీర్పును వెలువ‌రించింది.

Advertisement

తాజావార్తలు

Advertisement