త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

IPL 2026 | సీఎస్‌కే అభిమానుల‌కు గుడ్‌న్యూస్‌.. మ‌ళ్లీ మైదానంలోకి త‌లా..!

IPL 2026 | చెన్నై సూపర్ కింగ్స్ (CSK) అభిమానుల‌కు గుడ్‌న్యూస్ చెప్పింది. లెజెండరీ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్ 2026 సీజ‌న్ ఆడుతాడ‌ని సీఈవో కాశీ విశ్వనాథన్ ప్ర‌క‌టించారు. గ‌త కొన్ని రోజులుగా ధోనీ ఐపీఎల్ ఆడే విష‌యంలో ఊహాగానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

P

Sports | Published On Feb 22, 2026, 7.43 pm IST

IPL 2026 | సీఎస్‌కే అభిమానుల‌కు గుడ్‌న్యూస్‌.. మ‌ళ్లీ మైదానంలోకి త‌లా..!
Advertisement

IPL 2026 | చెన్నై సూపర్ కింగ్స్ (CSK) అభిమానుల‌కు గుడ్‌న్యూస్ చెప్పింది. లెజెండరీ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్ 2026 సీజ‌న్ ఆడుతాడ‌ని సీఈవో కాశీ విశ్వనాథన్ ప్ర‌క‌టించారు. గ‌త కొన్ని రోజులుగా ధోనీ ఐపీఎల్ ఆడే విష‌యంలో ఊహాగానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఐపీఎల్ 2026 ప్రారంభానికి నెల‌రోజుల స‌మ‌యం మిగిలి ఉంది. ధోనీ ఆడ‌తాడా? లేదా? అన్న సందేహాలు వ్య‌క్త‌మ‌య్యాయి. సీఈవో ప్ర‌క‌ట‌న‌తో ఈ వార్త‌ల‌కు ఫుల్‌స్టాప్ ప‌డిన‌ట్ల‌య్యింది. మ‌హేంద్రుడు ఆడుతాడ‌ని.. ఈ సీజ‌న్‌లో త‌ప్ప‌కుండా జ‌ట్టుతో ఉంటార‌న్నారు.

ఈ వ్యాఖ్య‌ల‌తో యెల్లో ఆర్మీలో ఉత్సాహాలు వెల్లువెత్తాయి. ధోనీ 2008 నుంచి సీఎస్‌కే త‌ర‌ఫు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. మధ్యలో రెండు సంవత్సరాలు సీఎస్‌కేపై స‌స్పెన్ష‌న్ విధించిన స‌మ‌యంలో రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ తరఫున బ‌రిలోకి దిగాడు. ఐదుసార్లు సీఎస్‌కేని ఛాంపియన్‌గా నిలబెట్టిన ఘనత ధోనీదే. 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినా, ఐపీఎల్‌లో ధోనీ క్రేజ్ మాత్రం త‌గ్గ‌డం లేదు. మార్చి చివ‌రి నుంచి ఐపీఎల్ ప్రారంభం కానున్న‌ది. ఐపీఎల్‌లో మ‌రోసారి త‌లాను చేసేందుకు అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

Advertisement
Advertisement