MS Dhoni | బ్యాట్ పట్టిన మహేంద్రుడు.. పంజాబ్‌తో మ్యాచ్‌లో ఆడేనా?
MS Dhoni | ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో గాయం కారణంగా తొలి మ్యాచ్‌లో విరామం తీసుకున్న సీఎస్‌కే మాజీ సారధి మహేంద్ర సింగ్ ధోనీ మళ్లీ బ్యాట్ పట్టుకున్నాడు. 44 ఏళ్ల ధోని రెండు వారాల వరకు జట్టుకు దూరమవుతాడని ఫ్రాంచైజీ ముందుగా ప్రకటించిన విషయం తెలిసిందే.
MS Dhoni | ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో గాయం కారణంగా తొలి మ్యాచ్‌లో విరామం తీసుకున్న సీఎస్‌కే మాజీ సారధి మహేంద్ర సింగ్ ధోనీ మళ్లీ బ్యాట్ పట్టుకున్నాడు. 44 ఏళ్ల ధోని రెండు వారాల వరకు జట్టుకు దూరమవుతాడని ఫ్రాంచైజీ ముందుగా ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ధోనీ నెట్స్‌లో కనిపించడం ఆసక్తిని కలిగిస్తోంది. పంజాబ్ కింగ్స్‌తో జరగనున్న మ్యాచ్‌కు ముందు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ధోని తేలికపాటి ఫిట్‌నెస్ సెషన్‌లో పాల్గొన్నాడు. అయితే, జట్టుతో పూర్తిస్థాయి ప్రాక్టీస్ చేయలేకపోయాడు. కొద్దిసేపు బ్యాట్ పట్టుకున్నా కీపింగ్ జోలికి వెళ్లలేదు. ఈ నేపథ్యంలో ఆయన గాయం నుంచి కోలుకునే దశలో ఉన్నప్పటికీ, మ్యాచ్‌కు పూర్తిగా సిద్ధంగా లేడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇక ప్రాక్టీస్ సమయంలో సంజు శాంసన్ వికెట్ కీపింగ్ చేస్తూ కనిపించాడు. జట్టులో అతను ప్రత్యామ్నాయంగా అందుబాటులో ఉండటం సీఎస్‌కేకు ఊరటనిస్తోంది. మరోవైపు సీఎస్‌కే ఆటగాడు డెవాల్డ్ బ్రేవిస్ కూడా శిక్షణలో పాల్గొన్నాడు. తేలికపాటి రన్నింగ్ డ్రిల్స్ మాత్రమే చేసి, జట్టు ఫిజియోతో చర్చలు జరిపాడు. ధోని నెట్స్‌లోకి వచ్చినప్పటికీ పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ఆడతాడా లేదా అన్న విషయంలో స్పష్టత రాలేదు. సుదీర్ఘ సమయం టోర్నీ కొనసాగేందుకు అవకాశం ఉండడంతో ఈ విషయంలో తొందరపడి నిర్ణయం తీసుకునేందుకు జట్టు మేనేజ్‌మెంట్ ఆసక్తి చూపించడం లేదు. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓటమి పాలైన సీఎస్‌కే, పంజాబ్‌పై గెలిచి.. ఖాతా తెరవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 10వ స్థానంలో ఉన్న సీఎస్‌కే.. ఈ సీజన్‌లో తొలిసారి సొంత మైదానంలో ఆడనుంది.
He's a silent guardian.
A watchful protector! 💛✨#WhistlePodu #Yellove pic.twitter.com/Uax3cshu56— Chennai Super Kings (@ChennaiIPL) April 2, 2026
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






