త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

IPL 2026 | ఢిల్లీ క్యాపిట‌ల్స్‌కు ఊర‌ట‌.. జ‌ట్టుతో చేరిన మిచేల్ స్టార్క్‌

IPL 2026 | గాయాల నుంచి కోలుకున్న మిచెల్ స్టార్క్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో చేరాడు. త్వరలోనే మ్యాచ్‌లకు సిద్ధమయ్యే అవకాశం ఉండగా, అత‌ని రాక‌తో ఢిల్లీ జ‌ట్టుకు మ‌రింత ప‌టిష్టం కానుంది.

P

Sports | Published On Apr 25, 2026, 5.15 pm IST

IPL 2026 | ఢిల్లీ క్యాపిట‌ల్స్‌కు ఊర‌ట‌.. జ‌ట్టుతో చేరిన మిచేల్ స్టార్క్‌
Advertisement

IPL 2026 | ఐపీఎల్ 2026లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఊర‌ట‌క‌లిగింది. ఆస్ట్రేలియా స్టార్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ గాయాల నుంచి కోలుకుని జ‌ట్టుతో చేరాడు. ఈ విష‌యాన్ని ఢిల్లీ క్యాపిట‌ల్స్ సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌క‌టించ‌డంతో అభిమానుల్లో ఉత్సాహం నెల‌కొన్న‌ది. భుజం, మోచేతి గాయాల బారిన‌ప‌డిన స్టార్క్ కొంత‌కాలంగా క్రికెట్‌కు దూర‌మ‌య్యాడు. యాషెస్ సిరీస్‌లో ఐదు టెస్టుల్లో 150కుపైగా ఓవర్లు బౌలింగ్ చేసి 31 వికెట్లు తీసి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచాడు. ఆ త‌ర్వాత ఈ గాయాలు తీవ్రతరమయ్యాయి. అనంతరం బిగ్ బ్యాష్ లీగ్‌లో క్యాచ్ అందుకునే ప్ర‌య‌త్నంలో ప‌డిపోవ‌డంతో స‌మ‌స్య మ‌రింత పెరిగింది. ప్రస్తుతం జట్టులో చేరిన స్టార్క్ వెంటనే మైదానంలోకి దిగే అవ‌కాశం లేన‌ట్లుగానే తెలుస్తోంది.

పూర్తి ఫిట్‌నెస్ సాధించేందుకు కొంత సమయం ఇవ్వాలని జట్టు యాజమాన్యం భావిస్తోంది. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌కు దూరంగా ఉంచింది. మే 1న రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌లో స్టార్క్ తిరిగి బరిలోకి దిగే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. అలా జరిగితే ఢిల్లీ జట్టుకు అది పెద్ద బలం కానుంది. ఇప్పటివరకు బౌలింగ్ విభాగంలో ఆశించిన స్థాయిలో ప్రదర్శన లేకపోవడంతో స్టార్క్ రాకతో జట్టుకు కొత్త ఊపు వచ్చే అవ‌కాశం ఉంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌కు వరుస విజయాలు అవసరం. స్టార్క్ వంటి అనుభవజ్ఞుడైన బౌలర్ జట్టులో చేరడం విశ్వాసాన్ని పెంచనుంది. అతని వేగం, స్వింగ్ ప్రత్యర్థి బ్యాటర్లకు సవాలుగా మారే అవకాశాలున్నాయి. స్టార్క్ రీ-ఎంట్రీ జట్టుకు టర్నింగ్ పాయింట్‌గా మారి ప్లేఆఫ్ ఆశలను స‌జీవంగా ఉంచే అవ‌కాశాలున్నాయి.

Advertisement
Advertisement