త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Matheesha Pathirana | టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో శ్రీ‌లంక‌కు షాక్‌.. బౌల‌ర్ మ‌తీష ప‌తిరాణా టోర్నీ నుంచి అవుట్‌..!

Matheesha Pathirana | టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో శ్రీ‌లంక జ‌ట్టుకు మ‌రో ఎదురుదెబ్బ త‌గిలింది. సీమ‌ర్ మ‌తీష ప‌తిరాణా టోర్నీ నుంచి వైదొలిగాడు. అత‌ని ప్లేస్‌లో పేస‌ర్ దిల్షాన్ మ‌ధుశంక‌ను తీసుకునేందుకు ఐసీసీ ఈవెంట్ టెక్నిక‌ల్ క‌మిటీ అనుమ‌తిచ్చింది.

P

Sports | Published On Feb 18, 2026, 7.33 pm IST

Matheesha Pathirana | టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో శ్రీ‌లంక‌కు షాక్‌.. బౌల‌ర్ మ‌తీష ప‌తిరాణా టోర్నీ నుంచి అవుట్‌..!
Advertisement

Matheesha Pathirana | టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో శ్రీ‌లంక జ‌ట్టుకు మ‌రో ఎదురుదెబ్బ త‌గిలింది. సీమ‌ర్ మ‌తీష ప‌తిరాణా టోర్నీ నుంచి వైదొలిగాడు. అత‌ని ప్లేస్‌లో పేస‌ర్ దిల్షాన్ మ‌ధుశంక‌ను తీసుకునేందుకు ఐసీసీ ఈవెంట్ టెక్నిక‌ల్ క‌మిటీ అనుమ‌తిచ్చింది. సోమవారం పల్లెకెలెలో ఆస్ట్రేలియాతో జరిగిన గ్రూప్ బీ మ్యాచ్‌లో పతిరానా తన తొలి ఓవ‌ర్ వేస్తున్న స‌మ‌యంలోనే ఎడ‌మ‌కాలికి గాయ‌మైంది. దాంతో మైదానం వీడాడు. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను శ్రీ‌లంక ఎనిమిది వికెట‌ల్ తేడాతో ఓడించింది. ప‌తిరానా ఎడమ కాలి కండరాల నొప్పితో బాధ‌ప‌డుతున్న‌ట్లుగా ఐసీసీ నిర్ధారించింది.

దాంతో టోర్నమెంట్ నుంచి తక్షణమే తప్పుకున్నాడు. ఐర్లాండ్‌తో జరిగిన టోర్నమెంట్ మ్యాచ్‌లో స్పిన్ ఆల్ రౌండర్ వ‌నిందు హసరంగా తొడ కండరాల గాయంతో దూర‌మైన విష‌యం తెలిసిందే. ఎడమచేతి వాటం సీమర్ మధుశంక చివరిసారిగా 2025 ఆగస్టులో జింబాబ్వే పర్యటన సందర్భంగా వన్డే సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు ఆడాడు. అప్పటి నుంచి గాయంతో ఇబ్బందిప‌డుతున్నాడు. ఈ నెల ప్రారంభంలో ఒమన్‌తో జరిగిన టీ20 ప్రపంచ కప్ వార్మప్ మ్యాచ్‌లో శ్రీలంక-ఏ తరపున ఆడాడు. మూడు ఓవ‌ర్లు వేసినా ఒక్క వికెట్ తీయ‌లేక‌పోయాడు. మధుశంక 15 టీ20లు ఆడ‌గా.. 9.75 ఎకాన‌మీతో 21వికెట్లు తీశాడు. ఇదిలా ఉండ‌గా.. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో శ్రీ‌లంక చివ‌రి మ్యాచ్‌ని జింబాబ్వేతో కొలంబోలో ఆడుతుంది. ఆ త‌ర్వాత ఆదివారం పల్లెకెలెలో ఇంగ్లండ్‌తో తొలి సూప‌ర్ ఎయిట్ మ్యాచ్ ఆడుతుంది.

Advertisement
Advertisement