త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

IPL 2026 | కేకేఆర్ విజ‌యం సాధించేనా..? టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కేకేఆర్‌

IPL 2026 | ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌, రాజ‌స్థాన్ రాయ‌ల్స్ మ‌ధ్య మ‌రికొద్ది సేప‌ట్లో మ్యాచ్ జ‌రుగ‌నున్న‌ది. టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

P

Sports | Published On Apr 19, 2026, 3.14 pm IST

IPL 2026 | కేకేఆర్ విజ‌యం సాధించేనా..? టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కేకేఆర్‌
Advertisement

IPL 2026 | ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌, రాజ‌స్థాన్ రాయ‌ల్స్ మ‌ధ్య మ‌రికొద్ది సేప‌ట్లో మ్యాచ్ జ‌రుగ‌నున్న‌ది. టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. వికెట్ పొడిగా క‌నిపిస్తోంద‌ని, కొంత ట‌ర్న్ వ‌స్తుంద‌ని ఆశిస్తున్న‌ట్లు తెలిపాడు. హిట్మెయిర్ తిరిగి జ‌ట్టులోకి వ‌చ్చాడ‌ని, లూండ్రే ప్రిటోరియ‌స్ నుంచి త‌ప్పించిన‌ట్లు తెలిపాడు. తుషార్ దేశ్‌పాండే స్థానంలో బ్రిజేష్ శ‌ర్మ‌ను జ‌ట్టులోకి తీసుకున్న‌ట్లు తెలిపాడు.

రాజస్థాన్ రాయల్స్ జ‌ట్టు : యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధృవ్ జురెల్ (వికెట్ కీప‌ర్‌), రియాన్ పరాగ్ (కెప్టెన్), షిమ్రాన్ హెట్మెయర్, డోనోవన్ ఫెరీరా, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, రవి బిష్ణోయ్, బ్రిజేష్ శ‌ర్మ‌,
ఇంపాక్ట్ స‌బ్స్ : సందీప్ శర్మ, శుభమ్ దూబే, లువాన్ డ్రే ప్రిటోరియస్, రవి సింగ్, యష్ పుంజా.

కేకేఆర్ జ‌ట్టు : అజింక్యా రహానే (కెప్టెన్), టిమ్ సీఫెర్ట్ (వికెట్ కీప‌ర్‌), కెమరూన్ గ్రీన్, రోవ్‌మన్ పావెల్, రింకు సింగ్, అనుకుల్ రాయ్, రమణదీప్ సింగ్, సునీల్ నరైన్, కార్తీక్ త్యాగి, వరుణ్ చక్రవర్తి, వైభ‌వ్ అరోరా.
ఇంపాక్ట్ స‌బ్స్ : మనీష్ పాండే, ఫిన్ అలెన్, అంగ్క్రిష్ రఘువంశీ, తేజస్వి సింగ్, నవదీప్ సైనీ.

విజ‌యంపై రాజ‌స్థాన్ క‌న్ను..

ఫుల్ ఫామ్‌లో ఉన్న రాజ‌స్థాన్ రాయ‌ల్స్ గ‌త మ్యాచ్‌లో ఎదురైన ఓట‌మి నుంచి బ‌య‌ట‌ప‌డి మ‌ళ్లీ విజ‌యాల‌బాట ప‌ట్టాల‌ని భావిస్తోంది. కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌పై జ‌రిగే పోరులో ఆ జ‌ట్టును విజ‌యం సాధించాల‌నే త‌హ‌త‌హ‌లాడుతున్న‌ది. ఈ సీజ‌న్‌లో తొలి నాలుగు మ్యాచుల్లో రాజస్థాన్ జట్టు వరుసగా నాలుగు విజయాలు నమోదు చేసింది. చివ‌రి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓటమి చవిచూసింది. మరోవైపు కేకేఆర్ మాత్రం ఆరు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించలేక అప‌సోపాలు ప‌డుతోంది.

అజింక్య రహానే నాయకత్వంలో కేకేఆర్ పలుమార్లు గెలుపు దిశగా వెళ్లి చివర్లో ఓటమి పాలవడం జట్టు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్ వ‌ర్షార్ప‌ణం కావ‌డంతో ఆ జ‌ట్టు ఖాతాలో కేవ‌లం ఒకే ఒక్క పాయింట్ మాత్ర‌మే చేరింది. అయితే, జ‌ట్టు వ్యూహాల‌పై ప‌లు సందేహాలు త‌లెత్తుతున్నాయి. ఫాస్ట్ బౌల‌ర్లు హర్షిత్ రాణా, ఆకాశ్ దీప్ గాయాల‌తో దూర‌మ‌య్యారు. మతీషా పతిరాణా ఇంకా జ‌ట్టుతో చేరకపోవడం కేకేఆర్‌కు ఇబ్బందికరంగా మారింది. కెప్టెన్ రహానే, హెడ్ కోచ్ అభిషేక్ నాయర్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు వివాదాస్పదంగా మారాయి. జట్టు కూర్పుపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. మ‌రి ఈ మ్యాచ్‌లోనైనా నెగ్గి విమ‌ర్శ‌ల‌కు చెక్ ప‌డుతుందా?.. ఓట‌ముల‌ను కొన‌సాగిస్తుందా? అన్న‌ది వేచి చూడాల్సిందే.

Advertisement
Advertisement