త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ishan Kishan | కొలంబోలో చరిత్ర సృష్టించిన ఇషాన్‌ కిషన్‌.. మూడు రికార్డులు నెలకొల్పిన డ్యాషింగ్‌ బ్యాట్స్‌మెన్‌..!

Ishan Kishan | టీమిండియా యువ ఓపెనర్ ఇషాన్ కిషన్ అరుదైన ఘనత సాధించాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2007 ఫైనల్ అనంతరం పాకిస్తాన్‌పై అర్ధ శతకం చేసిన తొలి ఓపెనర్‌గా రికార్డు నెలకొల్పాడు. కొలంబో వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్లో ఇషాన్‌ కిషన్‌ కేవలం 40 బంతుల్లోనే 77 పరుగులు చేసి ఈ మైలురాయిని చేరాడు. బ్యాటింగ్‌కు అనుకూలంగా లేని వికెట్‌పై సైతం ఇషాన్‌ కిషన్‌ దూకుడుగా ఆడుతూ పరుగులు రాబట్టాడు.

P

Sports | Published On Feb 16, 2026, 9.45 am IST

Ishan Kishan | కొలంబోలో చరిత్ర సృష్టించిన ఇషాన్‌ కిషన్‌.. మూడు రికార్డులు నెలకొల్పిన డ్యాషింగ్‌ బ్యాట్స్‌మెన్‌..!
Advertisement

Ishan Kishan | టీమిండియా యువ ఓపెనర్ ఇషాన్ కిషన్ అరుదైన ఘనత సాధించాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2007 ఫైనల్ అనంతరం పాకిస్తాన్‌పై అర్ధ శతకం చేసిన తొలి ఓపెనర్‌గా రికార్డు నెలకొల్పాడు. కొలంబో వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్లో ఇషాన్‌ కిషన్‌ కేవలం 40 బంతుల్లోనే 77 పరుగులు చేసి ఈ మైలురాయిని చేరాడు. బ్యాటింగ్‌కు అనుకూలంగా లేని వికెట్‌పై సైతం ఇషాన్‌ కిషన్‌ దూకుడుగా ఆడుతూ పరుగులు రాబట్టాడు. కేవలం 27 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ చేశాడు. క్రీజులో ఉన్నంత సేపు దాయాది బౌలర్లపై విరుచుకుపడ్డాడు. క్రమం తప్పకుండా ఫోర్లు, సిక్సర్లు బాదుతూ పాక్‌ బౌలర్లపై ఒత్తిడి పెంచాడు. అయితే, చివరిసారిగా 2007 టీ20 ప్రపంచకప్ ఫైనల్‌ మ్యాచ్‌లో పాక్‌పై గౌతమ్ గంభీర్ (75 పరుగులు) హాఫ్‌ సెంచరీ చేశాడు.

అప్పటి నుంచి రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌, కేఎల్‌ రాహుల్‌ వంటి ఓపెనర్లు పాకిస్తాన్‌పై 50 పరుగులు చేయలేకపోయారు. ఇదిలా ఉండగా.. ఈ మ్యాచ్‌లో మరో డ్యాషింగ్‌ ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ డకౌట్‌గా వెనుదిరగడంతో ఇషాన్‌ కిషన్‌ బాధ్యతాయుతంగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. తిలక్‌ వర్మతో కలిసి రెండో వికెట్‌కు 87 పరుగులు జోడించాడు. 87 పరుగుల్లో 77 పరుగులు ఇషాన్‌ చేయడం గమనార్హం. ఇషాన్‌ అవుట్‌ అయ్యాక టీమిండియా స్కోర్‌ నెమ్మదించింది. ఒక దశలో 200 పరుగులు చేస్తారనుకున్నా టీమిండియా 175 పరుగులు చేయగలిగింది. గౌతమ్‌ గంభీర్‌ తర్వాత ఇషాన్‌ కిషన్‌ ఈ రికార్డును సాధించడంపై సోషల్‌ మీడియా వేదికగా పలువురు ప్రశంసించారు. ఇషాన్‌ దూకుడుతో పాక్‌ బౌలర్లు తడబడ్డారని నెటిజన్స్‌ కామెంట్‌ చేశారు.

అలాగే, ఇషాన్‌ కిషన్‌ మరో రెండు రికార్డులు తన ఖాతాలో వేసుకున్నారు. పాకిస్థాన్‌పై టీ20 ప్రపంచకప్‌లో మూడో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ సాధించిన ప్లేయర్‌గా నిలిచాడు. ఈ ఫార్మాట్‌లో పాకిస్థాన్‌పై భారత తరఫున అత్యధిక స్కోర్ల రికార్డు మాత్రం విరాట్ కోహ్లీ పేరిటే ఉంది. 2022లో 82 నాటౌట్, 2012లో 78 నాటౌట్ ఇన్నింగ్స్‌లతో కోహ్లీ తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాడు. తాజాగా ఇషాన్‌ 77 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు. భారత్–పాక్ టీ20 అంతర్జాతీయాల్లో బంతుల పరంగా అత్యంత వేగంగా అర్ధశతకం సాధించిన ఆటగాళ్ల జాబితాలో ఇషాన్ కిషన్ మూడో స్థానానికి ఎగబాకాడు. అతను కేవలం 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఈ జాబితాలో తొలి స్థానంలో పాకిస్థాన్ మాజీ కెప్టెన్ మహ్మద్‌ హఫీజ్‌ ముందున్నాడు. 2012లో అహ్మదాబాద్‌లో భారత్‌పై 23 బంతుల్లో అర్ధశతకం బాదాడు. రెండో స్థానంలో అభిషేక్‌ శర్మ నిలిచాడు. 2025లో దుబాయిలో జరిగిన మ్యాచ్‌లో అతను 24 బంతుల్లో 50 పరుగులు సాధించాడు. ఇషాన్ తర్వాతి స్థానంలో భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్‌ సింగ్‌ ఉన్నాడు. 2012లో అహ్మదాబాద్‌లో పాక్‌పై 29 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.

భారత్-పాక్ టీ20ల్లో వేగవంతమైన హాఫ్ సెంచరీలు (బంతుల పరంగా)..

23 – మొహమ్మద్ హఫీజ్, అహ్మదాబాద్ 2012
24 – అభిషేక్ శర్మ, దుబాయ్ 2025
27 – ఇషాన్ కిషన్, కొలంబో RPS 2026
29 – యువరాజ్ సింగ్, అహ్మదాబాద్ 2012

భారత్-పాక్ టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్స్‌..

82* – విరాట్ కోహ్లీ, మెల్బోర్న్ 2022
79* – మొహమ్మద్ రిజ్వాన్, దుబాయ్ 2021
78* – విరాట్ కోహ్లీ, కొలంబో RPS 2012
77 – ఇషాన్ కిషన్, కొలంబో RPS 2026

Advertisement
Advertisement