IPL Team Bus’s | ఐపీఎల్ టీమ్ బస్సులు.. కదిలే ఫైవ్ స్టార్ హోటల్స్..!
IPL Team Bus's | ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్ అట్టహాసంగా కొనసాగుతుంది. అభిమానుల నుంచి పొట్టి క్రికెట్‌కు ఆదరణ లభిస్తోంది. సీజన్‌లో ఇప్పటికే 24 మ్యాచులు ముగిశాయి. అయితే, అందరి అదృష్టి క్రికెటర్లను తరలించే బస్సులపై పడింది.
IPL Team Bus's | ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్ అట్టహాసంగా కొనసాగుతుంది. అభిమానుల నుంచి పొట్టి క్రికెట్‌కు ఆదరణ లభిస్తోంది. సీజన్‌లో ఇప్పటికే 24 మ్యాచులు ముగిశాయి. అయితే, అందరి అదృష్టి క్రికెటర్లను తరలించే బస్సులపై పడింది. కేవలంలో ఆటగాళ్లను తరలించేందుకు మాత్రమే ఉపయోగిస్తారా? స్పెషల్‌గా ఏమైనా ఏర్పాట్లు ఉంటాయా? అనుకుంటుంటారు. అయితే, కేవలం ఆటగాళ్లను తరలించే వాహనాలని మాత్రం అనుకుంటే పొరపాటే. ఈ బస్సులు కదిలే ఫైవ్ స్టార్స్ హోటల్స్ లాంటివే. ఆటగాళ్ల సౌకర్యం, భద్రత, విశ్రాంతిని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా రూపొందించిన ఈ బస్సుల్లో లగ్జరీ లాంజ్ స్థాయి సదుపాయాలు అందుబాటులో ఉంటాయి.
ఒక బస్సు ధర ఎంత?

సాధారణ బస్సులతో పోలిస్తే ఐపీఎల్ టీమ్ బస్సుల ఖర్చు ఎక్కువ. ప్రతి ఫ్రాంచైజీ తమ అవసరాలు, కస్టమైజేషన్, బ్రాండింగ్, టెక్నాలజీ ఆధారంగా రూ.70 లక్షల నుంచి రూ.1.5 కోట్ల వరకు ఖర్చు చేస్తుంది. సగటున ఒక బస్సు ధర సుమారు రూ.కోటి వరకు ఉంటుంది. లగ్జరీ, హైటెక్ సౌకర్యాలు పెరిగే కొద్దీ ఖర్చు కూడా పెరుగుతుంది. ఈ బస్సులు సాధారణ కమర్షియల్ కోచ్‌లలా ఉండవు. పూర్తిగా మార్పులు చేసి ప్రత్యేకంగా తయారు చేస్తారు. ఆటగాళ్లు ప్రయాణంలో సౌకర్యంగా, విశ్రాంతిగా ఉండేలా ప్రీమియం బస్సు తయారీ సంస్థలతో కలిసి డిజైన్ చేస్తారు. అడ్వాన్స్‌డ్ సీటింగ్ సిస్టమ్స్, హైటెక్ ఎంటర్‌టైన్‌మెంట్, మెరుగైన సస్పెన్షన్ వంటి సదుపాయాలు ఖర్చును పెంచుతాయి.
బ్రాండింగ్ కూడా కీలకం

ఐపీఎల్‌లో బ్రాండింగ్‌కు ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. టీమ్ బస్సులు కూడా అందుకు మినహాయింపు కాదు. జట్టు రంగులు, స్పాన్సర్ లోగోలు, ఆటగాళ్ల చిత్రాలతో బస్సులను తీర్చిదిద్దుతారు. దీంతో అవి కేవలం రవాణా సాధనంగా కాకుండా ఫ్రాంచైజీకి గుర్తింపుగా మారుతున్నాయి. ఐపీఎల్ టీమ్ బస్సులో అడుగుపెడితే లగ్జరీ లాంజ్‌లో ఉన్న అనుభూతి కలుగుతుంది. రీక్లైనింగ్ సీట్లు, భారీ లెగ్‌రూమ్, వ్యక్తిగత ఛార్జింగ్ పోర్టులు, కొన్నిసార్లు మసాజ్ సదుపాయం ఉన్న సీట్లు కూడా ఉంటాయి. హైస్పీడ్ వై-ఫై, ఎల్ఈడీ స్క్రీన్స్, ప్రీమియం సౌండ్ సిస్టమ్స్ ఏర్పాటు చేస్తారు. మినీ ఫ్రిజ్‌లలో డ్రింక్స్ సైతం స్టోర్ చేస్తారు. అన్ని వాతావరణ పరిస్థితులకు తగినట్లుగా అవసరమైన సౌకర్యం కలిగించేలా అంబియంట్ లైటింగ్, క్లైమేట్ కంట్రోల్ వ్యవస్థలు ఉంటాయి.
భద్రతకు ప్రాధాన్యం

ఈ బస్సుల ఖర్చు పెరగడానికి భద్రత కూడా ఒక ప్రధాన కారణం. మ్యాచ్ రోజుల్లో కఠిన భద్రతా చర్యల మధ్య బస్సులు ప్రయాణిస్తాయి. పోలీస్ ఎస్కార్ట్ కూడా ఉంటుంది. ట్రాఫిక్ సమస్యలు లేకుండా ముందుగానే మార్గాలను ప్రణాళిక చేస్తారు. చాలా ఫ్రాంచైజీలు ఒకటి కంటే ఎక్కువ బస్సులను ఉపయోగిస్తాయి. ఆటగాళ్ల కోసం ఒకటి, సపోర్ట్ స్టాఫ్ కోసం మరొకటి, సామగ్రి కోసం మరొకటి వాడుతాయి. ఇలా వేర్వేరు బస్సులు ఉండటంతో జట్టు ప్రయాణం మరింత క్రమబద్ధంగా సాగుతుంది.
డ్రెస్సింగ్ రూమ్‌కు..

కాలక్రమేణా ఈ బస్సులు కేవలం రవాణా సాధనంగా కాకుండా డ్రెస్సింగ్ రూమ్‌కు ఎక్స్‌టెన్షన్‌గా మారాయి. ఆటగాళ్లు మ్యాచ్ వ్యూహాలపై చర్చలు జరపడం, సంగీతం వినడం, కలిసి సమయం గడపడం వంటి కార్యకలాపాలు ఇక్కడే జరుగుతాయి. వేగంగా జరిగే ఐపీఎల్ షెడ్యూల్‌లో ఈ చిన్న ప్రయాణాలే జట్టు ఐక్యతను పెంచడంలో కీలకంగా మారుతున్నాయి. ఐపీఎల్ ఫ్రాంచైజీల విలువ, అభిమానుల నుంచి స్పందన పెరుగుతున్న నేపథ్యంలో ఈ లగ్జరీ బస్సులు కేవలం సౌకర్యం మాత్రమే కాదు.. జట్టు గుర్తింపు, బ్రాండ్ విలువ, ప్రదర్శనలో భాగంగా మారిపోయాయని నిపుణులు పేర్కొంటున్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు






