త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

IPL 2027 | ఐపీఎల్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌ రూల్‌ తొలగించాలి: రహానే

IPL 2027 | ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL)లో అమలవుతున్న ఇంపాక్ట్‌ ప్లేయర్‌ నిబంధనపై భారత మాజీ క్రికెటర్‌ అజింక్య రహానే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ నిబంధనను తొలగించాలని డిమాండ్‌ చేశాడు. ఇంపాక్ట్‌ ప్లేయర్‌ రూల్ కార‌ణంగా భారత క్రికెట్‌లో ఆల్‌రౌండర్లపై ప్ర‌భావం ప‌డుతోంద‌ని అభిప్రాయ‌ప‌డ్డాడు. ఈ నిబంధనతో ఎలాంటి ప్రయోజనం లేదని స్పష్టం చేశాడు.

P

Sports | Published On Oct 10, 2026, 4.22 pm IST

IPL 2027 | ఐపీఎల్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌ రూల్‌ తొలగించాలి: రహానే
Advertisement

IPL 2027 | ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL)లో అమలవుతున్న ఇంపాక్ట్‌ ప్లేయర్‌ నిబంధనపై భారత మాజీ క్రికెటర్‌ అజింక్య రహానే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ నిబంధనను తొలగించాలని డిమాండ్‌ చేశాడు. ఇంపాక్ట్‌ ప్లేయర్‌ రూల్ కార‌ణంగా భారత క్రికెట్‌లో ఆల్‌రౌండర్లపై ప్ర‌భావం ప‌డుతోంద‌ని అభిప్రాయ‌ప‌డ్డాడు. ఈ నిబంధనతో ఎలాంటి ప్రయోజనం లేదని స్పష్టం చేశాడు. గతేడాది ఐపీఎల్‌ కెప్టెన్ల సమావేశానికి ముందు కూడా చాలా మంది సారథులు ఇంపాక్ట్‌ ప్లేయర్‌ నిబంధనను వ్యతిరేకించారని రహానే గుర్తుచేశాడు. ‘ఇంపాక్ట్‌ ప్లేయర్‌ రూల్‌ను తొలగించాలని నేను భావిస్తున్నా. గతేడాది కెప్టెన్ల సమావేశానికి ముందు చాలా మంది కెప్టెన్లు ఈ నిబంధన వద్దని చెప్పారు. ఈ నిబంధన 2027 వరకు అమల్లో ఉన్నట్లు గుర్తు. ఈ ఏడాదే తొలగిస్తారా? లేక వచ్చే ఏడాది మెగా వేలం తర్వాత నిర్ణయం తీసుకుంటారా? అనేది తెలియదు. అయితే, ఈ నిబంధన వల్ల ఎలాంటి ప్రయోజనం లేదనేది నా అభిప్రాయం’ అని రహానే స్ప‌ష్టం చేశాడు.

ఆల్‌రౌండర్లకు అవకాశాలు తగ్గుతున్న‌య్‌

ఇంపాక్ట్‌ ప్లేయర్‌ నిబంధన కారణంగా జట్లు తమ అవసరాలకు అనుగుణంగా బ్యాటర్ల స్థానంలో బౌలర్లను, బౌలర్ల స్థానంలో బ్యాటర్లను తీసుకుంటున్నాయని రహానే తెలిపాడు. దీంతో ఆల్‌రౌండర్ల అవసరం తగ్గిపోతోందని, వారి నైపుణ్యాలు మెరుగుపరుచుకునే అవకాశాలు లేకుండాపోతున్నాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. ‘ముఖ్యంగా ఐపీఎల్‌లో ఆల్‌రౌండర్లు ఆటకు దూరమవుతున్నారు. ఆల్‌రౌండర్లను త‌యారు చేయడం ఎంతో ముఖ్యం. భారత జట్టు అవసరాల దృష్ట్యా కీలక పాత్ర పోషిస్తారు. అందుకే ఇంపాక్ట్‌ ప్లేయర్‌ నిబంధనను తొలగించాలి’ అని రహానే సూచించాడు. ఇంపాక్ట్‌ ప్లేయర్‌ రూల్‌ బ్యాటింగ్‌ జట్లకు అదనపు ప్రయోజనం కల్పిస్తోందని రహానే అభిప్రాయపడ్డాడు. ‘గతేడాది కొన్ని జట్లు 90 పరుగులకే ఏడు వికెట్లు, లేదా 100 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయిన సందర్భాలున్నాయి. అయినప్పటికీ అదనపు బ్యాటర్‌ను బరిలోకి దించి 200 పరుగుల వరకు స్కోరు చేయగలిగాయి. అందుకే బౌలర్లకూ కొంత అనుకూలత ఉండాలి. ఆల్‌రౌండర్లు కూడా ఆటలో పూర్తిస్థాయిలో భాగస్వాములు కావాలి’ అని పేర్కొన్నాడు.

హార్దిక్‌ లాంటి ఆల్‌రౌండర్ల అవసరం..

భారత జట్టులో హార్దిక్‌ పాండ్యా వంటి నాణ్యమైన ఆల్‌రౌండర్‌ ప్రాధాన్యం తరచూ చర్చకు వస్తోంది. అతడి గైర్హాజరీలో ప్రత్యామ్నాయాల కోసం జట్టు అన్వేషించాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయి. శివమ్‌ దూబే, నితీశ్‌ కుమార్‌ రెడ్డి వంటి ఆటగాళ్లు ఆల్‌రౌండర్లుగా ఎదుగుతున్నప్పటికీ, హార్దిక్‌ స్థాయి సామర్థ్యాన్ని అందుకోవాల్సి ఉంది. ముఖ్యంగా వేగంగా బౌలింగ్‌ చేయగల ఆల్‌రౌండర్ల కొరత భారత క్రికెట్‌లో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆల్‌రౌండర్లను ప్రోత్సహించాలంటే ఇంపాక్ట్‌ ప్లేయర్‌ నిబంధనను తొలగించాలన్న రహానే అభిప్రాయం ప్రాధాన్యం సంతరించుకుంది.

Advertisement
Advertisement