త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

IPL 2026 | ఐపీఎల్ హిస్టరీలో టాప్ స్కోర్లు SRHవే..! ఈసారి 300 మార్క్ దాటుతుందా?

IPL 2026 | ఐపీఎల్ ఈ నెల 28న అట్ట‌హాసంగా మొద‌లుకానుంది. టోర‌నీ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియ‌న్ రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టు హైద‌రాబాద్ స‌న్‌రైజ‌ర్స్‌తో త‌ల‌ప‌డ‌నుంది. ఐపీఎల్‌లో సాధారణంగా బ్యాట‌ర్ల ఆధిప‌త్యం కొన‌సాగుతూ వ‌స్తోంది.

P

Sports | Published On Mar 15, 2026, 3.35 pm IST

IPL 2026 | ఐపీఎల్ హిస్టరీలో టాప్ స్కోర్లు SRHవే..! ఈసారి 300 మార్క్ దాటుతుందా?
Advertisement

IPL 2026 | ఐపీఎల్ ఈ నెల 28న అట్ట‌హాసంగా మొద‌లుకానుంది. టోర‌నీ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియ‌న్ రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టు హైద‌రాబాద్ స‌న్‌రైజ‌ర్స్‌తో త‌ల‌ప‌డ‌నుంది. ఐపీఎల్‌లో సాధారణంగా బ్యాట‌ర్ల ఆధిప‌త్యం కొన‌సాగుతూ వ‌స్తోంది. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిసే ఈ లీగ్‌లో ఇప్పటివరకు ఏ జట్టు కూడా 300 పరుగుల మార్క్‌ను దాటలేకపోయింది. అయితే, హైదరాబాద్ జట్టు రెండు సార్లు 300 పరుగులకు చేరువలోకి వచ్చి ఆ ఘనతను అందుకోలేకపోయింది. గత కొన్నేళ్లుగా హైదరాబాద్ జట్టు దూకుడైన బ్యాటింగ్‌తో ఐపీఎల్‌లో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపును సాధించుకుంది. ఐపీఎల్ హిస్ట‌రీలో అత్య‌ధిక నాలుగు స్కోర్ల‌లో తొలి నాలుగు స్థానాల్లోనే ఎస్ఆర్‌హెచ్ నిలువ‌డం విశేషం.

ఐపీఎల్‌లో అత్యధిక స్కోర్లు

ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోరు నమోదు చేసిన జట్టుగా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ నిలిచింది. 2024 ఏప్రిల్ 15న రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుతో జ‌రిగిన మ్యాచ్‌లో ఈ జ‌ట్టు 20 ఓవ‌ర్ల‌లో మూడు వికెట్ల న‌ష్టానికి 287 ప‌రుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో ట్రావిస్ హెడ్ 41 బంతుల్లోనే 102 ర‌న్స్‌తో విధ్వంసక‌ర ఇన్నింగ్స్ ఆడాడు. అలాగే, హెన్రిచ్ క్లాసెన్ 31 బంతుల్లో 67 ప‌రుగులు చేసి జ‌ట్టుకు భారీ స్కోర్‌ను అందించాడు. ఐపీఎల్ హిస్ట‌రీలో ఇదే అత్య‌ధిక స్కోర్‌గా నిలిచింది. ఆ త‌ర్వాత హైద‌రాబాద్ గ‌తేడాది మార్చి 23న రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో హైద‌రాబాద్ బ్యాట‌ర్లు ఫోర్లు, సిక్స‌ర్ల‌తో చెల‌రేగారు. దాంతో నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఆరు వికెట్ల న‌ష్టానికి 286 ప‌రుగులు చేసింది. ఈ మ్యాచులో ఇషాన్ కిష‌న్ 47 బంతుల్లో 106 ప‌రుగులు చేశాడు. ట్రావిస్ హెడ్ 67 ప‌రుగులు చేశాడు.

ప‌రుగుల వ‌ర‌ద పారించిన బ్యాట్స్‌మెన్స్‌..

2025 మే 25న కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లోనూ హైద‌రాబాద్ బ్యాట‌ర్లు మ‌రోసారి విరుచుకుప‌డ్డారు. ఈ మ్యాచ్‌లో హైద‌రాబాద్ జ‌ట్టు మూడు వికెట్ల న‌ష్టానికి 278 ర‌న్స్ చేసింది. మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన హెన్రిచ్ క్లాసెన్ చెల‌రేగాడు. కేవ‌లం 39 బంతుల్లో 105 పరుగులు చేశాడు. ట్రావిస్ హెడ్ 40 బంతుల్లో 76 పరుగులు చేశాడు. ఐపీఎల్ చరిత్రలో నాలుగో అత్యధిక స్కోరు కూడా హైదరాబాద్ జ‌ట్టుదే. 2024 మార్చి 27న ముంబ‌యి ఇండియ‌న్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో హైద‌రాబాదీ జ‌ట్టు మూడు వికెట్ల న‌ష్టానికి 277 ప‌రుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో క్లాసెన్ 34 బంతుల్లో 80 ప‌రుగులు చేశాడు. ట్రావిస్ హెడ్ 24 బంతుల్లో 62 ప‌రుగుల‌తో విరుచుకుప‌డ్డారు.

ఐదోస్థానంలో కోల్‌క‌తా..

ఐపీఎల్ చరిత్రలో ఐదో అత్యధిక స్కోరు కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ పేరిట ఉన్న‌ది. 2024 ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో కేకేఆర్ జ‌ట్టు ఏడు వికెట్ల న‌ష్టానికి 272 ప‌రుగులు చేసింది. ఈ మ్యాచులో సునీల్ న‌రైన్ 39 బంతుల్లో 85 పరుగులతో మెరిశాడు. ర‌ఘువంశీ 27 బంతుల్లో 54 ప‌రుగులు చేశాడు. ఇదిలా ఉండ‌గా.. ఈ సారి ఐపీఎల్‌లోనూ విధ్వంస‌క బ్యాట్స్‌మెన్ హైద‌రాబాద్ జ‌ట్టులో ఉన్నారు. అభిషేక్ శ‌ర్మ‌, ట్రావిస్‌హెడ్‌, క్లాసెన్‌, ఇషాన్ కిష‌న్‌, క‌మిందు మెండిస్‌, లియామ్ లివింగ్ స్టోన్ ఉండ‌డంతో మ‌రోసారి హైద‌రాబాద్ జ‌ట్టు ప‌రుగుల వ‌ర‌ద పారిస్తుంద‌ని అభిమానులు భావిస్తున్నారు.

Advertisement
Advertisement