IPL 2026 | డగౌట్‌లో మొబైల్ వినియోగం.. రాయల్స్ జట్టు మేనేజర్‌కు రూ.లక్ష జరిమానా విధించిన బీసీసీఐ..!
IPL 2026 | ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు మేనేజర్ రోమీ భిందర్‌కు బీసీసీఐ చర్యలు చేపట్టింది. మ్యాచ్ సమయంలో డగౌట్‌లో మొబైల్ ఫోన్ ఉపయోగించినందుకు ఆయనకు రూ.లక్షల జరిమానా విధిస్తూ అధికారిక హెచ్చరికలు జారీ చేసింది.
IPL 2026 | ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు మేనేజర్ రోమీ భిందర్‌కు బీసీసీఐ చర్యలు చేపట్టింది. మ్యాచ్ సమయంలో డగౌట్‌లో మొబైల్ ఫోన్ ఉపయోగించినందుకు ఆయనకు రూ.లక్షల జరిమానా విధిస్తూ అధికారిక హెచ్చరికలు జారీ చేసింది. ఈ నెల 10న గౌహతి బర్సాపరా క్రికెట్ స్టేడియంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో రోమీ భిందర్ మొబైల్ వాడడం కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియోలో నెట్టింట వైరల్ అయ్యాయి. దాంతో బీసీసీఐకి చెందిన యాంటీ కరప్షన్ అండ్ సెక్యూరిటీ యూనిట్ (ACSU) రోమీ భిందర్‌కు షోకాజ్ నోటీసు జారీ చేసింది.
డగౌట్ ప్రాంతంలో మొబైల్ ఫోన్ ఉపయోగించిన విషయంపై 48 గంటల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. భిందర్ ఇచ్చిన వివరణను పరిశీలించింది. సంతృప్తికరంగా లేదని ఏసీఎస్‌యూ తేల్చినట్లు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా తెలిపారు. తొలిసారిగా నిబంధనలు ఉల్లంఘించినట్లుగా పరిగణలోకి తీసుకున్నా.. ఐపీఎల్ ప్రోటోకాల్స్‌ను అతిక్రమించినందుకు రూ.లక్ష జరిమానా విధించడంతో పాటు భవిష్యత్‌లో ఇలాంటి తప్పులు పునరావృతం చేయొద్దంటూ హెచ్చరించినట్లుగా సైకియా తెలిపారు.
పీఎంఓఏ (PMOA) నిబంధనల ప్రకారం.. టీమ్ మేనేజర్లు డ్రెస్సింగ్ రూమ్‌లో ఫోన్ ఉపయోగించవచ్చు. కానీ, డగౌట్‌లో ఉపయోగించకూడదని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. రోమీ భిందర్ 2008 నుంచి రాజస్థాన్ రాయల్స్ జట్టుతో అనుబంధం ఉంది. జట్టు 2016–17లో నిషేధానికి గురైన సమయంలో ఆయన రైజింగ్ పుణే సూపర్‌జెయింట్స్‌తో పనిచేశారు. 15 ఏళ్ల యువ ఆటగాడు సూర్యవంశీకి గార్డియన్‌గా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే, ఈ ఘటన ఐపీఎల్ నిబంధనలపై అందరికీ హెచ్చరికగా నిలుస్తుందని బీసీసీఐ స్పష్టం చేసింది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు






