IPL 2026 Points Table | ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ హవా..! పాయింట్ల పట్టికలో హైదరాబాద్ స్థానం ఎక్కడ..?
IPL 2026 Points Table | ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో పంజాబ్ కింగ్స్ హవా కొనసాగుతోంది. గురువారం ముంబయి వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ముంబయిపై ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో పంజాబ్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది.
IPL 2026 Points Table | ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో పంజాబ్ కింగ్స్ హవా కొనసాగుతోంది. గురువారం ముంబయి వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ముంబయిపై ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో పంజాబ్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది. ఐదు మ్యాచుల్లో తొమ్మిది పాయింట్లతో పంజాబ్ టాప్ ప్లేస్‌కి చేరుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబయి ఇండియన్స్ ఆరు వికెట్లకు 195 పరుగులు చేసింది.
క్వింటన్ డికాక్ 60 బంతుల్లో 112 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌తో జట్టుకు భారీ స్కోర్ అందించాడు. ఈ ఇన్నింగ్స్‌లో ఏడు సిక్సర్లు, ఎనిమిది ఫోర్లు ఉన్నాయి. ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పంజాబ్ కింగ్స్ సైతం దూకుడుగా బ్యాటింగ్ కొనసాగించింది. ప్రబ్‌సిమ్రన్ సింగ్ 39 బంతుల్లో 80 పరుగులు చేశాడు. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ సైతం 35 బంతుల్లో 66 పరుగులు చేసి చేయడంతో పంజాబ్ 16.3 ఓవర్లలోనే మూడు వికెట్లు నష్టపోయి 198 పరుగులు చేసి సునాయాస విజయాన్ని అందుకుంది. ఈ విజయంలో పాయింట్ల పట్టికలో మార్పులు చోటు చేసుకున్నాయి.
ఇప్పటివరకు జరిగిన మ్యాచుల ప్రకారం డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ జట్లు బలంగా కనిపిస్తున్నాయి. పంజాబ్ ఇప్పటివరకు ఓటమి ఎరుగకుండా కొనసాగుతోంది. ఐదు మ్యాచుల్లో తొమ్మిది పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నది. ఆర్సీబీ ఎనిమిది పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా, అదే పాయింట్లతో రాజస్థాన్ మూడో స్థానంలో ఉంది. ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు నాలుగేసి పాయింట్లతో సమానంగా ఉన్నాయి. అయితే, మెరుగైన నెట్ రన్‌రేట్ కారణంగా సన్‌రైజర్స్ నాలుగో స్థానంలో నిలిచింది.
ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్లు ఈ సీజన్‌లో కష్టాల్లో ఉన్నాయి. చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు వరుసగా ఎనిమిది, తొమ్మిది, పది స్థానాల్లో ఉన్నాయి. ఐదు మ్యాచ్‌లు ఆడినప్పటికీ కేకేఆర్ ఇప్పటివరకు ఖాతా కూడా తెరకపోవడం గమనార్హం. మరోవైపు ముంబయి జట్టు మొదటి మ్యాచ్ గెలిచినా.. ఆ తర్వాత నాలుగు మ్యాచుల్లో ఓటమిపాలైంది. చెన్నై జట్టు ఇటీవల రెండు మ్యాచ్‌లు గెలిచినా, ఆశించిన స్థాయిలో రాణించలేకపోతోంది.
ఇక ప్లేయర్స్ వ్యక్తిగత ప్రదర్శన విషయానికి వస్తే.. ఆరెంజ్ క్యాప్ విరాట్ వద్దే ఉంది. ఆర్‌సీబీ తరఫున ఆడుతున్న కోహ్లీ.. ఐదు మ్యాచుల్లో 228 పరుగులు చేశాడు. ఆ తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ హెన్రిచ్ క్లాసెన్ ఐదు మ్యాచుల్లో 224 పరుగులతో రెండోస్థానంలో ఉన్నాడు. ఇక పర్పుల్ క్యాప్‌ని ప్రసిద్ధ్ కృష్ణ నిలబెట్టుకున్నాడు. గుజరాత్ తరఫున ఆడుతున్న ప్రసిద్ధ్ కృష్ణ ఇప్పటి వరకు పది వికెట్లు పడగొట్టాడు. చెన్నైకి చెందిన అన్షుల్ కాంబోజ్ సైతం పది వికెట్లు తీసినా.. ఎకానమీ పరంగా మెరుగ్గా ఉండడంతో ప్రసిద్ధ్ కృష్ణ ముందంజలో ఉన్నాడు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు






