త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MS Dhoni | ఐపీఎల్‌లో ధోనీకి ఇదే ఆఖరి సీజనా..? టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ ఏమన్నాడంటే..?

P

Sports | Published On Mar 13, 2026, 5.19 pm IST

MS Dhoni | ఐపీఎల్‌లో ధోనీకి ఇదే ఆఖరి సీజనా..? టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ ఏమన్నాడంటే..?
Advertisement

MS Dhoni | ఐపీఎల్‌ 2026 సీజన్‌ ప్రారంభానికి రంగం సిద్ధమైంది. ఇప్పటికే బీసీసీఐ షెడ్యూల్‌ను ప్రకటించింది. అయితే, ఈ సారి కూడా భారత జట్టు మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ ఐపీఎల్‌లో కనిపించనున్నాడు. ప్రతిసారిలాగే ఈ సారి కూడా అభిమానుల్లో ఒకటే ప్రశ్న తలెత్తుతోంది. అది ధోనికి ఇదే చివరి సీజనా?. ఈ విషయంపై మాజీ ఆల్‌రౌండ్‌ ఇర్ఫాన్ పఠాన్‌ తన అభిప్రాయం వ్యక్తం చేశాడు. చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే) జట్టును ధోనీ లేకుండా ఊహించుకోవడం కష్టమని తెలిపాడు. ఇదే ధోనీకి చివరి ఐపీఎల్‌ సీజన్‌ కావచ్చని అభిప్రాయం వ్యక్తం చేశాడు. జట్టులో అందరినీ ఒకటిగా కలిపి ఉంచే బాధ్యతను ధోనీ తీసుకుంటాడని తెలిపాడు. భవిష్యత్తు కోసం సంజూ శాంసన్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌లను తయారుచేయడంలో ధోనీ కీలక పాత్ర పోషించనున్నాడని పేర్కొన్నాడు. ధోనీ ఎన్ని మ్యాచ్‌లు ఆడతారో తనకు ఖచ్చితంగా తెలియదని, కానీ డ్రెస్సింగ్‌రూమ్‌లో ధోనీ ఉనికి జట్టుకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పాడు. సంజూ శాంసన్‌ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, రుతురాజ్‌ గైక్వాడ్‌ ఇప్పటికే నాయకత్వ లక్షణాలు ఉన్న ఆటగాడని, భవిష్యత్తు కోసం ఇద్దరు, ముగ్గురు ఆటగాళ్లను సిద్ధం చేస్తున్నట్లుగా వివరించాడు.

ధోనీ ఫిట్‌నెస్‌, ఆయన బ్యాటింగ్‌ స్థానం, అన్ని మ్యాచ్‌లు ఆడతారా? అన్న ప్రశ్నలు కొనసాగుతూనే ఉంటాయని.. ఈ విషయాలకు సమాధానం సీఎస్‌కే మేనేజ్‌మెంట్‌ మాత్రమే ఇవ్వగలదని స్పష్టం చేశాడు. ఐపీఎల్‌లో ఆరవ టైటిల్‌ గెలిచి ధోనీకి ఘన వీడ్కోలు ఇవ్వాలని జట్టు ప్రయత్నిస్తుందని కూడా అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఇటీవల ధోనీ పాత్ర, ఆయన ఆడే మ్యాచ్‌ల సంఖ్యపై సీఎస్‌కే ఫ్రాంచైజీ సీఈఓ కాశీ విశ్వనాథ్‌ సైతం స్పందించిన విషయం తెలిసిందే. ధోనీ అన్ని మ్యాచ్‌లు ఆడతారని, అయితే ఆయన పాత్రను జట్టు మేనేజ్‌మెంట్‌ నిర్ణయిస్తుందని చెప్పారు. ఐపీఎల్‌ ప్రారంభం నుంచే ధోనీ ఈ లీగ్‌లో కీలక పాత్ర పోషిస్తున్నారు. సీఎస్‌కే ఎల్లో జెర్సీకి కేరాఫ్ అడ్రస్‌ఆ నిలిచారు. . ఇది ఆయనకు 19వ ఐపీఎల్‌ సీజన్‌. ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన వికెట్‌కీపర్‌ బ్యాట్స్‌మన్‌, కెప్టెన్‌గా ధోనీ గుర్తింపు పొదాడు. ఎంఎస్‌డీ నాయకత్వంలో సీఎస్‌కే ఐదు సార్లు ఐపీఎల్‌ ట్రోఫీని గెలుచుకుంది. బ్యాట్స్‌మన్‌గా ధోనీ ఇప్పటివరకు 278 మ్యాచ్‌లు ఆడి 5,439 పరుగులు చేయగా.. వికెట్‌కీపర్‌గా 158 క్యాచ్‌లు పట్టడమే కాకుండా 47 స్టంపింగ్స్‌ కూడా చేశాడు.

Advertisement
Advertisement