IPL 2026 | డగౌట్‌లో మొబైల్ వినియోగం.. రాజస్థాన్ మేనేజర్‌కు బీసీసీఐ నోటీసులు..!
IPL 2026 | ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా డగౌట్‌లో మొబైల్ ఫోన్‌ని ఉపయోగించడం వివాదానికి దారి తీసింది. ఈ వ్యవహారంపై బీసీసీఐకి చెందిన యాంటీ కరప్షన్ అండ్ సెక్యూరిటీ యూనిట్ (ACSU) రాజస్థాన్ రాయల్స్ జట్టు మేనేజర్ రోమీ భిందర్‌కు 24 గంటల్లో వివరణ ఇవ్వాలని నోటీసు జారీ చేసింది.
IPL 2026 | ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా డగౌట్‌లో మొబైల్ ఫోన్‌ని ఉపయోగించడం వివాదానికి దారి తీసింది. ఈ వ్యవహారంపై బీసీసీఐకి చెందిన యాంటీ కరప్షన్ అండ్ సెక్యూరిటీ యూనిట్ (ACSU) రాజస్థాన్ రాయల్స్ జట్టు మేనేజర్ రోమీ భిందర్‌కు 24 గంటల్లో వివరణ ఇవ్వాలని నోటీసు జారీ చేసింది.
అసలు ఏం జరిగిందంటే..?
గువాహటిలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ సందర్భంగా డగౌట్‌లో రోమీ భిందర్ యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశితో కలిసి స్మార్ట్‌ఫోన్ చూస్తున్న దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ విషయం యాంటీ కరప్షన్ అండ్ సెక్యూరిటీ యూనిట్ దృష్టికి వెళ్లింది. వాస్తవానికి.. ప్లేయర్స్ అండ్ మ్యాచ్ ఆఫిషియల్స్ ఏరియా (PMOA) నిబంధనల ప్రకారం జట్టు మేనేజర్లు మొబైల్ ఫోన్లు ఉపయోగించవచ్చు. అయితే, డగౌట్‌లో వినియోగంపై నిషేధం ఉంది. ఈ నేపథ్యంలో భిందర్ నిబంధనలు ఉల్లంఘించినట్లుగా భావిస్తున్నారు.
ఆరోగ్య కారణాలు..
ఐపీఎల్‌కు చెందిన ఓ సీనియర్ అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. కొన్ని నెలల క్రితం రోమీ భిందర్ వెంటిలేషన్ సపోర్ట్‌పై ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన వైద్య అవసరాల కోసం మొబైల్ ఉపయోగించి ఉండవచ్చని భావిస్తున్నారు. అయితే, బీసీసీఐలోని కొంతమంది ఈ వాదనను ఖండిస్తున్నారు. ఇది నిబంధనలకు విరుద్ధమేనని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వివాదం మధ్య సోమవారం ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్–రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ టాస్ సమయంలో భిందర్ హాజరయ్యాడు. జట్టులో కీలక పాత్ర పోషిస్తున్న వైభవ్ సూర్యవంశికి స్థానిక గార్డియన్‌గా ఆయనను భావిస్తున్నారు. జట్టు నిర్ణయాల్లో కూడా ఆయనకు ముఖ్యమైన పాత్ర ఉందని తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ఏసీఎస్‌యూ కోరిన వివరణ అనంతరం ఈ వ్యవహారంపై మరింత విచారణ జరిపి చర్యలు తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే భిందర్‌పై చర్యలు తప్పవనే సంకేతాలున్నాయి.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






