త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Athletics Open | తైవాన్ ఓపెన్ అథ్లెటిక్స్‌లో భారత్‌కు స్వర్ణం

Athletics Open | తైవాన్ ఓపెన్ అథ్లెటిక్స్‌లో (Athletics Open) భార‌త మ‌హిళ‌ల రిలే జ‌ట్టు స‌త్తా చాటింది. న్యూ తైపీ సిటీ అథ్లెటిక్స్‌లో మ‌హిళ‌ల 4x100 మీటర్ల రిలే (women's 4x100m relay team) విభాగంలో బంగారు ప‌త‌కాన్ని సొంతం చేసుకుంది.

G

Sports | Published On Jun 7, 2026, 11.20 am IST

Athletics Open | తైవాన్ ఓపెన్ అథ్లెటిక్స్‌లో భారత్‌కు స్వర్ణం
Advertisement

Athletics Open | త్రినేత్ర‌.న్యూస్‌: తైవాన్ ఓపెన్ అథ్లెటిక్స్‌లో (Athletics Open) భార‌త మ‌హిళ‌ల రిలే జ‌ట్టు స‌త్తా చాటింది. న్యూ తైపీ సిటీ అథ్లెటిక్స్‌లో మ‌హిళ‌ల 4x100 మీటర్ల రిలే (women's 4x100m relay team) విభాగంలో బంగారు ప‌త‌కాన్ని సొంతం చేసుకోవ‌డంతోపాటు స‌రికొత్త రికార్డును నెల‌కొల్పింది. బాంకియావో స్టేడియంలో జరిగిన ఈ పోటీలో శ్రాబణి నంద, ఎస్.ఎస్. స్నేహ, సుదేష్ణ శివంకర్, తమన్నాతో కూడిన భార‌త జ‌ట్టు 44.07 సెకన్లలోనే గ‌మ్యాన్ని చేరుకొని అగ్రస్థానంలో నిలిచింది. దీంతో గత మీట్ రికార్డును భార‌త రిలే జ‌ట్టు బద్దలు కొట్టింది.

రిలే విజయంతో పాటు ఫీల్డ్ ఈవెంట్లలో కూడా భారత్ విజయం సాధించింది. మహిళల లాంగ్ జంప్‌లో శైలీ సింగ్ స్వర్ణ పతకాన్ని సాధించింది. 6.24 మీటర్ల అత్యుత్తమ ప్రదర్శన నమోదుచేసిన శైలీ.. ఈ మీట్‌లో భారత్ పతకాల ఖాతాలో మరో ప‌త‌కాన్ని చేర్చింది. మ‌రోవైపు పురుషుల 110 మీట‌ర్ల హార్డిల్స్‌లో తేజ‌స్ షిర్సే ర‌జ‌త ప‌త‌కాన్ని సాధించాడు. 13.58 సెకన్ల సమయంలో గ‌మ్యాన్ని చేరుకుని రెండో స్థానంలో నిలిచాడు. తేజస్ గతంలో జాతీయ చాంపియన్‌షిప్‌లలో 13.50 సెకన్లతో స్వర్ణం సాధించాడు.

Advertisement
Advertisement