త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

T20 World Cup | సూప‌ర్ ఎయిట్‌లో టీమిండియా త‌ల‌ప‌డేది ఈ జ‌ట్ల‌తోనేనా..?

T20 World Cup | టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా సూపర్-8 దశలోకి దూసుకెళ్లింది. ఆదివారం కొలంబోలో పాకిస్థాన్‌పై 61 పరుగుల భారీ విజయంతో గ్రూప్-ఏలో అగ్రస్థానానికి చేరింది. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ వరుస విజయాలు సాధించిన సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని జట్టు అజేయంగా దూసుకెళ్తోంది.

P

Sports | Published On Feb 17, 2026, 10.00 pm IST

T20 World Cup | సూప‌ర్ ఎయిట్‌లో టీమిండియా త‌ల‌ప‌డేది ఈ జ‌ట్ల‌తోనేనా..?
Advertisement

T20 World Cup | టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా సూపర్-8 దశలోకి దూసుకెళ్లింది. ఆదివారం కొలంబోలో పాకిస్థాన్‌పై 61 పరుగుల భారీ విజయంతో గ్రూప్-ఏలో అగ్రస్థానానికి చేరింది. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ వరుస విజయాలు సాధించిన సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని జట్టు అజేయంగా దూసుకెళ్తోంది. సూపర్-8 గ్రూప్‌లో భారత్‌తో ద‌క్షిణాఫ్రికా, వెస్టిండిస్‌, జింబాబ్వే జ‌ట్టు పోటీప‌డే అవ‌కాశం ఉంది. ఇక ఐర్లాండ్‌తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో జింబాబ్వేకు సూప‌ర్ ఎయిట్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. సూప‌ర్ ఎయిట్‌లో ప్ర‌తీ మ్యాచ్ కీల‌క కానుంది. వ‌రుస విజ‌యాలు సాధిస్తేనే సెమీ ఫైన‌ల్‌కు అర్హ‌త సాధించే అవ‌కాశం ఉంటుంది.

భార‌త్ సూప‌ర్ 8 మ్యాచులు..

ఫిబ్రవరి 22 (ఆదివారం): భారత్ vs దక్షిణాఫ్రికా (నరేంద్ర మోదీ స్టేడియం)
ఫిబ్రవరి 26 (గురువారం): భారత్ vs జింబాబ్వే – (ఎంఏ చిదంబరం స్టేడియం)
మార్చి 1 (ఆదివారం): భారత్ vs వెస్టిండీస్ – ఈడెన్ గార్డెన్స్

సాయంత్ర‌మే మ్యాచ్‌లు..

సూప‌ర్ ఎయిట్ మ్యాచ్‌లు కూడా భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతాయి. ముఖ్యంగా ఈ దశలోని అన్ని మ్యాచ్‌లు భారత్‌లోనే జరగడం జట్టుకు అదనపు బలం. గ్రూప్ దశలో చివరి మ్యాచ్‌ను ఫిబ్రవరి 18న నెదర్లాండ్స్‌తో అహ్మదాబాద్‌లో ఆడనుంది. అదే వేదికపై సూపర్-8 తొలి పోరు కూడా ఉండటంతో భారత జట్టుకు పరిస్థితులకు అలవాటు పడేందుకు మంచి అవకాశం దక్కనుంది. భారత్, శ్రీలంక సంయుక్త ఆతిథ్యంతో జరుగుతున్న ఈ టోర్నీలో సెమీఫైనల్స్ ముంబ‌యి, కొలంబోలో జ‌రుగ‌నున్నాయి. ఫైన‌ల్ అహ్మ‌దాబాద్‌లోని మోదీ స్టేడియంలో జ‌రుగుతుంది. పాక్ ఫైన‌ల్‌లోకి వెళ్తే కొలంబోలో నిర్వ‌హిస్తారు.

Advertisement
Advertisement