త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Leopard | శివంగులొచ్చాయ్‌..

Leopard | క‌ర్ణాట‌క‌(Karnataka) కు నాలుగు కొత్త చిరుత‌లొచ్చాయ్‌ (Four Leopards). ఇక్క‌డి ప్రముఖ ప్రకృతి పర్యాటక కేంద్ర‌మైన‌ బన్నేరుఘట్ట జాతీయ ఉద్యానవనంలో చిరుతలు కాలు మోపాయి. దక్షిణాఫ్రికా (South Africa) దేశం నుంచి కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి శుక్రవారం అర్ధరాత్రి వాటిని తీసుకొచ్చారు.

S

News | Published On Apr 19, 2026, 12.43 pm IST

Leopard | శివంగులొచ్చాయ్‌..
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: క‌ర్ణాట‌క‌(Karnataka) కు నాలుగు కొత్త చిరుత‌లొచ్చాయ్‌ (Four Leopards). ఇక్క‌డి ప్రముఖ ప్రకృతి పర్యాటక కేంద్ర‌మైన‌ బన్నేరుఘట్ట జాతీయ ఉద్యానవనంలో చిరుతలు కాలు మోపాయి. దక్షిణాఫ్రికా (South Africa) దేశం నుంచి కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి శుక్రవారం అర్ధరాత్రి వాటిని తీసుకొచ్చారు. ఈ సంద‌ర్భంగా నాలుగు శివంగి (చిరుత)లకు కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర ఖండ్రే స్వాగతం పలికారు.

ఈ సంద‌ర్భంగా ఈశ్వ‌ర ఖండ్రే మాట్లాడుతూ.. గ‌తంలో కర్ణాటక అడవుల్లో శివంగిగా పిలిచే చిరుతలు ఉండేవని చెప్పారు. ఇప్పుడు వాటి సంతతి అంతరించిపోయిందని పేర్కొన్నారు. వాటి సంత‌తి ఉండాల‌నే సంక‌ల్పంతో దక్షిణాఫ్రికా నుంచి వాటిని తెప్పించామని వివ‌రించారు. ఇక్కడి వాతావరణానికి అలవాటు పడేవరకు క్వారంటైన్‌లో ఉంచుతామని తెలియ‌జేశారు. ఆయ‌న వెంట క‌ర్ణాట‌క‌ అటవీశాఖ అధికారులు, సిబ్బంది ఉన్నారు.

Advertisement
Advertisement