BCCI | జులైలో టీమిండియా జింబాబ్వే టూర్.. యువ సంచలనం సూర్యవంశీ ఛాన్స్?
BCCI | భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) జింబాబ్వే పర్యటనకు సంబంధించి టీమ్ ఇండియా షెడ్యూల్‌ను ప్రకటించింది. జింబాబ్వేతో జులైలో మూడు మ్యాచుల టీ20 సిరీస్ ఆడనుంది. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ జాతీయ జట్టులో అరంగేట్రం చేసే అవకాశం ఉన్నది.
BCCI | భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) జింబాబ్వే పర్యటనకు సంబంధించి టీమ్ ఇండియా షెడ్యూల్‌ను ప్రకటించింది. జింబాబ్వేతో జులైలో మూడు మ్యాచుల టీ20 సిరీస్ ఆడనుంది. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ జాతీయ జట్టులో అరంగేట్రం చేసే అవకాశం ఉన్నది. ఈ సిరీస్‌లోని అన్ని మ్యాచ్‌లు హరారేలోనే జరగనున్నాయి. జూలై 23న హరారే స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో తొలి టీ20 మ్యాచ్ జరుగుతుంది. మిగతా రెండు మ్యాచ్‌లు జూలై 25, 26 తేదీల్లో జరుగనున్నాయి. వరుసగా రెండు రోజుల పాటు టీమ్ ఇండియా టీ20 మ్యాచులను ఆడనుంది.
చివరిసారిగా 2024లో టూర్..
టీమ్ ఇండియా చివరిసారిగా 2024లో జింబాబ్వే పర్యటనకు వెళ్లింది. అప్పట్లో ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్ జరిగింది. ఈసారి జరగనున్న సిరీస్ యువ ఆటగాళ్లకు మంచి అవకాశంగా భావిస్తున్నారు. 2028 టీ20 వరల్డ్ కప్, ఒలింపిక్స్ నేపథ్యంలో జట్టు కూర్పును పరీక్షించేందుకు ఈ టోర్నీ సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంది. అలాగే, రిజర్వ్ బెంచ్ స్ట్రెంత్‌ను అంచనా వేసేందుకు ఈ సిరీస్కూ ఉపయోగపడనుంది. ఇక ఐపీఎల్‌తో పాటు జూనియర్ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన చేస్తున్న వైభవ్ సూర్యవంశీకి ఈ సిరీస్‌లో అవకాశం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవలే 15 ఏళ్లు పూర్తి చేసుకున్న సూర్యవంశీ, ఐసీసీ నిబంధనల ప్రకారం ఇప్పుడు సీనియర్ జట్టులో ఆడేందుకు అర్హుడు. ఐపీఎల్‌లో సీనియర్ బౌలర్స్‌పై దూకుడుగా బ్యాటింగ్ చేస్తున్న అతన్ని బీసీసీఐ జట్టులోకి ఎంపిక చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఐపీఎల్ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ సిరీస్
ఐపీఎల్ తర్వాత భారత జట్టు తొలుత ఆఫ్ఘనిస్తాన్‌తో ఒక టెస్టు, మూడు వన్డేల సిరీస్‌లో ఆడనుంది. ఆఫ్ఘనిస్తాన్ జట్టు భారత్‌కు రానుంది. జూన్ 6న న్యూ చండీగఢ్‌లో టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. జూన్ 14న ధర్మశాలలో తొలి వన్డే, జూన్ 17న లక్నోలో రెండో వన్డే, జూన్ 20న చెన్నైలో మూడో వన్డే జరుగుతాయి. ఈ టోర్నీ ముగిసిన తర్వాత జూన్-జులైలో టీమిండియా ఐర్లాండ్, ఇంగ్లండ్‌లో పర్యటించనుంది. ఐర్లాండ్‌లో రెండు టీ20 మ్యాచ్‌లు జూన్ 26, 28 తేదీల్లో బెల్ఫాస్ట్‌లో జరుగనున్నాయి. అనంతరం ఇంగ్లండ్‌లో ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. జూలై 1న చెస్టర్ లీ స్ట్రీట్‌లో తొలి టీ20, జూలై 4న మాంచెస్టర్‌లో రెండో టీ20, జూలై 7న నాటింగ్‌హోంలో మూడో టీ20 జరుగనుంది. జూలై 9న బ్రిస్టల్‌లో నాలుగో టీ20, జూలై 11న సౌతాంప్టన్‌లో ఐదో టీ20 జరుగుతుంది. ఆ తర్వాత -ఇంగ్లండ్ వన్డే సిరీస్ జూలై 14న బర్మింగ్‌హామ్‌లో మొదలవుతుంది. జులై 16న కార్డిఫ్‌లో రెండో వన్డే, జూలై 19న లార్డ్స్‌లో మూడో వన్డే జరుగుతుంది. ఈలోగా టీ20 జట్టు జింబాబ్వేకు చేరుకుని, ఇంగ్లండ్ వన్డే సిరీస్ ముగిసిన తర్వాత జింబాబ్వేతో టీ20 సిరీస్ ఆడనుంది.
🚨 News 🚨
Presenting the schedule for #TeamIndia's (Senior Men) Tour of Zimbabwe for a 3️⃣-match T20I series in July 2026! 🗓️
More details 🔽 | #ZIMvINDhttps://t.co/KsJRRqe4l8 pic.twitter.com/Tf21abYmTb
— BCCI (@BCCI) April 1, 2026
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






