త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

T20 World Cup | వెస్టిండిస్‌పై గెలిస్తేనే సెమీస్‌కు.. రేప‌టి కీల‌క మ్యాచ్‌లో శాంస‌న్‌ను ఆడిస్తారా?

T20 World Cup | టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో భార‌త్‌-వెస్టిండిస్ మ‌ధ్య కీల‌క మ్యాచ్ జ‌రుగ‌నున్న‌ది. సెమీస్ చేరుకోవాలంటే క‌రేబియ‌న్ జ‌ట్టుపై భార‌త్ త‌ప్ప‌నిస‌రిగా గెలిచి తీరాల్సిందే. అదే స‌మ‌యంలో వెస్టిండీస్ సైతం ఈ మ్యాచులోనూ విజ‌యం సాధించాల్సిందే.

P

Sports | Published On Feb 28, 2026, 4.33 pm IST

T20 World Cup | వెస్టిండిస్‌పై గెలిస్తేనే సెమీస్‌కు.. రేప‌టి కీల‌క మ్యాచ్‌లో శాంస‌న్‌ను ఆడిస్తారా?
Advertisement

T20 World Cup | టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో భార‌త్‌-వెస్టిండిస్ మ‌ధ్య కీల‌క మ్యాచ్ జ‌రుగ‌నున్న‌ది. సెమీస్ చేరుకోవాలంటే క‌రేబియ‌న్ జ‌ట్టుపై భార‌త్ త‌ప్ప‌నిస‌రిగా గెలిచి తీరాల్సిందే. అదే స‌మ‌యంలో వెస్టిండీస్ సైతం ఈ మ్యాచులోనూ విజ‌యం సాధించాల్సిందే. భార‌త్ ద‌క్షిణాఫ్రికాపై దారుణ ప‌రాజ‌యం త‌ర్వాత పాఠాలు నేర్చుకొని.. జింబాబ్వే జ‌ట్టుపై గెలుపొందింది. అయితే, బ్యాట్స్‌మెన్ రాణించినా.. బౌలింగ్ దారుణంగా ఉంది. ఈ క్ర‌మంలో ఆదివారం జ‌రిగే మ్యాచ్‌లో తుది జ‌ట్టు కూర్పుపై ఆందోళ‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

గెలిస్తేనే సెమీస్‌కు..

భార‌త్‌-వెస్టిండీస్ మ‌ధ్య జ‌రిగే ఈ సూప‌ర్ ఎయిట్ మ్యాచ్ వర్చువ‌ల్ నాకౌట్ లాంటిదే. రెండు జట్లు సెమీఫైనల్‌కు చేరువ‌గా ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జ‌ట్టే సెమీస్‌కు అర్హ‌త సాధిస్తుంది. నెట్ ర‌న్‌రేట్ మెరుగ్గా ఉండ‌డంతో గ్రూప్‌-1 పాయింట్ల ప‌ట్టిక‌లో రెండోస్థానంలో ఉంది. వెస్టిండీస్‌ను రేప‌టి మ్యాచ్‌లో ఓడిస్తే నాలుగు పాయింట్ల‌తో రెండుస్థానంలో నిలిచి సెమీస్‌లో అడుగుపెడుతుంది.

టీమిండియాకు ఊర‌ట‌..

ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ ఫామ్‌లోకి రావ‌డం భార‌త్ జ‌ట్టుకు ఊర‌ట క‌లిగిస్తున్న‌ది. వ‌రుస‌గా నాలుగు మ్యాచుల్లో విఫ‌ల‌మైన అభిషేక్.. జింబాబ్వేతో జ‌రిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచ‌రీ చేసి మ‌ళ్లీ ట‌చ్‌లోకి వ‌చ్చాడు. వెస్టిండీస్‌పై రాణిస్తాడ‌ని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది. ఈ మ్యాచ్‌లో మ‌ళ్లీ ఎవ‌రిని ఓపెనింగ్స్‌కు పంపిస్తార‌న్న చ‌ర్చ సాగుతోంది. జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో సంజు శాంస‌న్‌, అభిషేక్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. సంజు 24 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు.

శాంస‌న్ ఆడ‌తాడా..?

అయితే, వేగంగా ప‌రుగులు చేయ‌డం ఇత‌ర బ్యాట్స్‌మెన్స్‌లో సానుకూల ప్ర‌భావం చూపింది. దాంతో అభిషేక్‌తో పాటు ఇత‌ర బ్యాట్స్‌మెన్స్‌లో మ‌నోధైర్యం పెంచింది. రింకు స్థానంలో బ్యాటింగ్‌కు వ‌చ్చిన శాంస‌న్‌కు అవ‌కాశం ద‌క్క‌గా.. రేప‌టి మ్యాచులోనూ కొన‌సాగిస్తారా? లేదా? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. శాంస‌న్‌ను ఆడిస్తే మాత్రం మ‌ళ్లీ ఇషాన్ కిష‌న్ మూడోస్థానంలోనే బ్యాటింగ్‌కు చేయాల్సి రానుంది. మ‌రోసారి శాంస‌న్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

మార్పుల‌కు నో ఛాన్స్‌..

అయితే, టీమిండియా రేప‌టి మ్యాచులో శాంస‌న్‌ను కొన‌సాగించి.. మ‌ళ్లీ రింకు సింగ్‌ను బెంచ్‌కే ప‌రిమితం చేసే అవ‌కాశం ఉంది. వెస్టిండిస్‌తో జ‌రిగే మ్యాచ్‌లో ప‌రుగుల వ‌ర‌ద పారించాల‌ని టీమిండియా భావిస్తోంది. భార‌త్ బ్యాటింగ్ లైన‌ప్‌ను కొన‌సాగించాల‌ని భావిస్తోంది. కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్‌, తిల‌క్ వ‌ర్మ‌, హార్దిక్ పాండ్యా, శివ‌మ్ దూబే సైతం బ్యాట్‌తో రాణించాల‌ని అభిమానులు భావిస్తున్నారు. అయితే, శుభమ్ దూబే ఫామ్పై ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతున్న‌ది. ఈ ఆల్‌రౌండ‌ర్ బ్యాటింగ్ మెరుగ్గానే ఉన్నా.. బౌలింగ్ మాత్రం దారుణంగా ఉంది. జింబాబ్వేతో మ్యాచ్‌లో రెండు ఓవ‌ర్లు వేసి 46 ప‌రుగులు ఇచ్చాడు. ఒకే ఓవ‌ర్‌లో ప‌ది బంతులు వేయాల్సి వ‌చ్చింది. వేసిన రెండు ఓవ‌ర్ల‌లో నాలుగు వైడ్లు, రెండు నోబాల్స్ ఉన్నాయి.

బౌలింగ్‌పై ఆందోళ‌న‌..

జింబాబ్వేపై ఎడ‌మ‌చేతి వాటం ఫాస్ట్ బౌల‌ర్ అర్ష్‌దీప్ సింగ్ ఆక‌ట్టుకున్నాడు. జ‌స్‌ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా సైతం ప‌ర్వాలేద‌నిపించారు. స్పిన్ బౌల‌ర్ వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి ఫామ్‌పై అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మిస్టీరియస్ స్పిన్నర్ లెంగ్త్‌ను నియంత్రించడంలో విఫ‌ల‌మ‌వుతున్నాడు. ప్రయోగాలు చేస్తున్నట్లు అనిపిస్తోంది. వ‌రుణ్ రాణించ‌క‌పోవ‌డంతో ద‌క్షిణాఫ్రికాపై భార‌త్ దారుణంగా దెబ్బతింది. ఆ మ్యాచ్‌లో నాలుగు ఓవ‌ర్లు వేసి 47 ప‌రుగులు ఇచ్చాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో వరుణ్ ఎక్కువగా షార్ట్ పిచ్ బంతులు వేసేందుకు ఆస‌క్తి చూపించాడు.

కుల్దీప్‌కు ఛాన్స్ ఇస్తారా?

జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో ఫుల్ లెంగ్త్ బంతులు వేయడానికి ప్ర‌య‌త్నించినా విజ‌య‌వంతం కాలేక‌పోయాడు. ఈ మ్యాచ్‌లో సికంత్ రాజా అత‌ని బౌలింగ్‌లో విరుచుకుప‌డ్డాడు. వ‌రుణ్ నాలుగు ఓవ‌ర్ల‌లో 35 ప‌రుగులు ఇచ్చాడు. కోల్‌క‌తాలో జ‌రిగే మ్యాచ్‌లో టీమ్ మేనేజ్‌మెంట్ వ‌రుణ్‌ని ప‌క్క‌న పెట్టి.. ఎడ‌మ‌చేతి వాటం స్పిన్న‌ర్ కుల్దీప్ యాద‌వ్‌ని తీసుకుంటుందా? అన్న‌ది వేచి చూడాల్సిందే. ఈ టోర్నీలో కుల్దీప్ ఒకే ఒక మ్యాచ్ ఆడాడు. వ‌రుణ్‌, కుల్దీప్ ఇద్ద‌రు ఐపీఎల్‌లో ఎక్కువ భాగంగా కోల్‌క‌లా నైట్ రైడ‌ర్స్ త‌ర‌ఫున ఈడెన్ గార్డెన్స్‌లోనే ఆడాడు. ఇక్క‌డి ప‌రిస్థితుల గురించి ఇద్ద‌రికీ మంచి అవ‌గాహ‌న ఉంది.

రేప‌టి మ్యాచ్‌కు తుది జ‌ట్లు..

టీమిండియా (అంచ‌నా) : అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, సంజు శాంస‌న్‌/రింకు సింగ్‌, హార్దిక్ పాండ్యా, శివ‌హ దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్‌ప్రీత్ బుమ్రా.

వెస్టిండీస్ (అంచ‌నా) : బ్రాండన్ కింగ్, షాయ్ హోప్ (కెప్టెన్-వికెట్ కీపర్), షిమ్రాన్ హెట్‌మైర్, రోవ్‌మన్ పావెల్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, రోస్టన్ ఛేజ్, రొమారియో షెపర్డ్, జాసన్ హోల్డర్, మాథ్యూ ఫోర్డ్, గుడకేష్ మోటీ, షమర్ జోసెఫ్.

Advertisement
Advertisement