IND Vs USA | యూఎస్ఏ టార్గెట్ 162 రన్స్.. ఒంటరి పోరాటం చేసిన కెప్టెన్ సూర్యకుమార్
IND Vs USA | టీ20 ప్రపంచకప్‌లో భాగంగా యూఎస్ఏతో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. పసికూనపై టీమిండియా బ్యాట్స్‌మెన్ విరుచుకుపడుతారని అంతా భావించగా ఉసూరుమనిపించారు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మినహా మిగతా ఎవరూ పెద్దగా రాణించలేకపోయారు. సూర్యకుమార్ 49 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 84 నాటౌట్‌గా నిలిచాడు. సూర్య ఒంటరి పోరాటం చేయడంతో ఆ మాత్రం స్కోర్ చేయగలిగింది. టాస్ గెలిచిన యూఎస్ఏ.. భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. అభిషేక్ శర్మ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఆడిన తొలి బంతికే అవుట్ అయ్యాడు. ఇషాన్ కిషన్ (20), తిలక్ వర్మ (25) తక్కువ స్కోర్‌కే వెనుదిరిగారు.
తొలి వికెట్ కోల్పోగా భారత్‌ను ఇషాన్, తిలక్ కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలోనే బౌలింగ్ వచ్చిన పేసర్ వాన్ టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్‌ను కకావికలం చేశాడు. వరుసగా ఒకే ఓవర్‌లో మూడు వికెట్లు పడగొట్టాడు. ఆరో ఓవర్లో వరుసగా ఇషాన్, తిలక్ వర్మ, శివమ్ దూబె (0) పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత రింకు సింగ్ (6), హార్దిక్ పాండ్యా (5), అక్షర్ పటేల్ (14), అర్షదీప్ సింగ్ (4) సైతం ఆకట్టుకోలేకపోయారు. ఓ వైపు వికెట్లు పడుతున్నా.. మరో ఎండ్‌లో సూర్యకుమార్ యాదవ్ ఒంటరి పోరాటం చేయడంతో భారత్ ఆ మాత్రం స్కోర్ చేయగలిగింది. ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో 4, 6, 6, 4 బాదడంతో టీమిండియా ఆ మాత్రం స్కోర్ చేయగలిగింది. యూఎస్ఏ బౌలర్లలో వాన్‌కి నాలుగు వికెట్లు, హర్మిత్‌కి రెండు, అలీఖాన్, మోహ్సిన్‌కి తలా ఒక వికెట్ దక్కింది.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






