త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

T20 World Cup | టీ20 వరల్డ్‌ కప్‌లో భారత్‌ శుభారంభం.. యూఎస్‌ఏపై 29 పరుగుల తేడాతో ఘన విజయం..

T20 World Cup | టీ20 వరల్డ్‌ కప్‌లో భారత జట్టు శుభారంభం చేసింది. ముంబయి వేదికగా యూఎస్‌ఏతో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత జట్టు 29 పరుగుల తేడాతో విజయం విజయం సాధించింది. భారత్‌ నిర్దేశించిన 162 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో అమెరికా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో కేవలం ఎనిమిది వికెట్ల నష్టానికి 132 పరుగులు మాత్రమే చేయగలిగింది.

P

Sports | Published On Feb 7, 2026, 10.57 pm IST

T20 World Cup | టీ20 వరల్డ్‌ కప్‌లో భారత్‌ శుభారంభం.. యూఎస్‌ఏపై 29 పరుగుల తేడాతో ఘన విజయం..
Advertisement

T20 World Cup | టీ20 వరల్డ్‌ కప్‌లో భారత జట్టు శుభారంభం చేసింది. ముంబయి వేదికగా యూఎస్‌ఏతో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత జట్టు 29 పరుగుల తేడాతో విజయం విజయం సాధించింది. భారత్‌ నిర్దేశించిన 162 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో అమెరికా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో కేవలం ఎనిమిది వికెట్ల నష్టానికి 132 పరుగులు మాత్రమే చేయగలిగింది. అమెరికా బ్యాట్స్‌మెన్‌లలో మలింద్‌ కుమార్‌, సంజయ్‌ కృష్ణమూర్తి, శుభం రంజనే మాత్రమే రాణించారు. మిగతా బ్యాట్స్‌మెన్‌ ఎవరూ పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు. మిలింద్‌ (34), సంజయ్‌ (37), శుభం (37) పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లలో మహ్మద్‌ సిరాజ్‌ మూడు వికెట్ల పడగొట్టగా.. అర్ష్‌దీప్‌, అక్షర్‌ పటేల్‌కు తలా రెండు వికెట్లు దక్కగా.. వరుణ్‌ చక్రవర్తి ఒక వికెట్‌ తీశాడు.

మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన యూఎస్‌ఏ బౌలింగ్‌ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు వచ్చిన భారత్‌కు రెండో ఓవర్‌లోనే షాక్‌ తగిలింది. విధ్వంసకర బ్యాటర్ అభిషేక్ శర్మ వికెట్‌ తొలి బంతికే ఖాతా తెరువకుండానే పెవిలియన్‌కు చేరుకున్నాడు. పవర్‌ ప్లే ముగిసే సరికి కీలక నాలుగు వికెట్లు కోల్పోయి టీమిండియా కష్టాల్లో పడింది. ముఖ్యంగా షెడ్లీ వాన్ షాల్క్‌విక్ తన బౌలింగ్‌ టీమిండియా బ్యాట్స్‌మెన్స్‌కు చుక్కలు చూపించాడు. సంజు శాంసన్‌ స్థానంలో చోటు దక్కించుకున్న ఇషాన్‌ కిషన్‌ ఈ మ్యాచ్‌లో పెద్దగా రాణించలేకపోయాడు. కేవలం 20 పరుగులు చేసి అవుట్‌ అయ్యాడు. తిలక్‌ వర్మ సైతం 25 పరుగులకే అవుట్‌ కాగా.. శివమ్‌ దూబే డకౌట్‌ కాగా.. రింకూ సింగ్‌ (6), పాండ్యా (5), అక్షర్‌ పటేల్‌ (14), అర్ష్‌దీప్‌ సింగ్‌ (4) తక్కువ స్కోర్‌కే వెనుదిరిగారు. 2024 టీ20 వరల్డ్ కప్ తర్వాత స్వదేశంలో జరిగిన టీ20 మ్యాచ్‌లో పవర్‌ప్లేలో భారత జట్టు నమోదు చేసి అత్యల్ప మూడో స్కోర్‌ ఇదే కావడం విశేషం.

సూర్యకుమార్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌..

పసికూనపై మ్యాచ్‌లో కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ బ్యాట్‌తో అలరించాడు. ఓ వైపు వికెట్లు కుప్పకూలుతున్నా మరో ఎండ్‌లో బ్యాధతాయుతంగా ఆడుతూ స్కోర్‌ను పరుగులెత్తించాడు. ఒక దశలో 25 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయిన కిష్ట పరిస్థితుల్లో ఉన్న భారత్‌ను తన బ్యాటింగ్‌తో ఆదుకున్నాడు. 49 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లతో అజేయంగా 84 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. యునైటెడ్ స్టేట్స్‌కు 162 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించడంలో కీలకపాత్ర పోషించాడు. చివరి ఐదు ఓవర్లలో సూర్యకుమార్ గేర్ మార్చి.. ఆఖరి 30 బంతుల్లో భారత్ 67 పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలో సూర్యకుమార్ కెప్టెన్‌గా టీ20ల్లో వెయ్యి రన్స్‌ పూర్తి చేశాడు. ముఖ్యంగా సౌరవ్ నేత్రవల్కర్ వేసిన చివరి ఓవర్‌లో సూర్యకుమార్ 21 పరుగులు రాబట్టి, భారత్ 160 పరుగుల మార్కును దాటించాడు. అమెరికా బౌలర్లలో షాడ్లీ వాన్ షాల్క్‌విక్ 25 పరుగులిచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టి భారత పతనాన్ని శాసించాడు. హర్మీత్ సింగ్ రెండు వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్‌లో బ్యాట్‌తో రాణించిన సూర్యకుమార్‌ యాదవ్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ దక్కింది.

Advertisement
Advertisement