త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

రెండో టీ20: దక్షిణాఫ్రికా చేతిలో భారత్​ ఘోర పరాజయం

క్వింటన్ డీ కాక్ పరుగుల వరద పారించడంతో దక్షిణాఫ్రికా రెండో టీ20లో భారత్‌పై 51 పరుగుల తేడాతో గెలిచి సిరీస్‌ను 1–1తో సమం చేసింది. మ్యాచ్‌లోని కీలక ఘట్టాలు, భారత్ బ్యాటింగ్ పతనం — పూర్తి వివరాలు.

a

Sports | Published On Dec 11, 2025, 11.27 pm IST

రెండో టీ20: దక్షిణాఫ్రికా చేతిలో భారత్​ ఘోర పరాజయం
Advertisement

De Kock’s 90 Helps South Africa Beat India by 51 Runs; Series Level 1–1

త్రినేత్ర స్పోర్ట్స్​ బ్యూరో:

India vs South Africa T20 ‌‌– న్యూ చండీఘర్​లో జరిగిన రెండో టి20 మ్యాచ్​లో భారత్​ దక్షిణాఫ్రికా చేతిలో 51 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. టాస్​ ఓడి తొలుత బ్యాటింగ్​ చేసిన ప్రోటీస్​ క్వింటన్​ డీకాక్​ ధాటికి నిర్ణీత 20 ఓవర్లలో 213 పరుగుల భారీ స్కోరు సాధించింది. ప్రతిగా భారత్​ 19.1 ఓవర్లలో 162 పరుగులకు ఆలౌట్​ అయింది.

దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పరిస్థితుల్లో దక్షిణాఫ్రికా అద్భుత ప్రదర్శన చేసింది. ఓపెనర్ క్వింటన్ డీ కాక్ దూకుడుగా ఆడుతూ భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఫోర్లు, సిక్సర్లతో వీరవిహారం చేసాడు. పవర్‌ప్లే ముగిసేసరికి సౌతీస్​ 53/1 వద్ద నిలిచింది. డీ కాక్ కేవలం 26 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసినా, అదే వేగాన్ని కొనసాగించాడు. మార్క్రమ్ కూడా కొద్ది సేపు దూకుడుగా ఆడడంతో పరుగులు దారాళంగా వచ్చాయి. దానికి తోడు బ్యాటర్ల ధాటికి బౌలర్ల పట్టుతప్పడంతో ఎక్స్​ట్రాల రూపంతో 22 పరుగులు ఇచ్చుకోవాల్సివచ్చింది. డీ కాక్ చివరికి 90 పరుగులు చేసి ఔటయ్యాడు. అప్పటికే భారీ స్కోరు దిశగా పయనించిన దక్షిణాఫ్రికా , ఇన్నింగ్స్ ముగిసేసరికి 213/4 స్కోరు నమోదు చేసింది.

దిలోనే గాడితప్పిన భారత చేధన

214 లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆరంభంలోనే పెద్ద దెబ్బ తగిలింది. తొలి బంతికే శుభ్​మన్ గిల్ గోల్డెన్ డక్​గా వెనుదిరగగా, తర్వాత అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ కూడా తొందరగానే ఔటవడంతో భారత్ గొంతుదాకా ఒత్తిడిలో మునిగింది. పవర్‌ప్లేలో భారత్ మూడు వికెట్లు కోల్పోయి 51 పరుగులు మాత్రమే చేయగలిగింది. అక్షర్ కూడా ఎక్కువసేపు నిలవకపోవడంతో 10 ఓవర్లు పూర్తయ్యేసరికి స్కోరు కాస్తా 81/4 అయ్యింది. ఈ సమయంలో తిలక్ వర్మ()ధైర్యంగా ఒంటరిపోరాటం కొనసాగించాడు. కానీ, మరోపక్క వికెట్లు పడుతూండటంతో లక్ష్యం కొండలా పెరిగిపోయింది. ఫస్ట్​ మ్యాచ్​ హీరో హార్థిక్​ పాండ్యా() కూడా ఎక్కువసేపు నిలబడలేదు. షాట్లు ఆడాల్సిన తొందరలో వికెట్​ సమర్పించుకున్నాడు. జితేష్ శర్మ() కొంత ప్రతిఘటించినా వెంటనే ఔటవడంతో భారత్ పరిస్థితి ఘోరంగా తయారైంది. చివరికి 19.1 ఓవర్లలో 162 పరుగులకు ఇండియా కథ ముగిసింది. చివరి ఓవర్లలో దక్షిణాఫ్రికా పేసర్ బార్ట్‌మాన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. Yorker‌లు, హార్డ్ లెన్త్‌లతో ఇండియన్ బ్యాటర్లను కట్టడి చేసి వరుసగా వికెట్లు తీశాడు. ఈ గెలుపుతో సౌతాఫ్రికా సిరీస్‌ను 1–1తో సమం చేసింది.

కాగా, 5 మ్యాచ్​లో సిరీస్​లో మూడో టి20 ఆదివారం, డిసెంబర్​ 14న ధర్మశాలలో జరుగనుంది.

కాగా, కెప్టెన్​ సూర్యకుమార్​ యాదవ్​, వైస్​కెప్టెన్​ శుభమన్​ గిల్​ల వైఫల్యం విజయవంతంగా కొనసాగుతునేఉంది. తొలుత గిల్​ స్థానంలో సంజూ సాంసన్​ను తీసుకుంటారని వార్తలు వచ్చినా, గిల్​ మైదానంలో కనబడటంతో సందిగ్ధం తొలిగిపోయింది.

Advertisement

తాజావార్తలు

Advertisement