త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ind VS Pak | ఈ నెల 15న పాక్‌తో హైవోల్టేజ్ మ్యాచ్‌.. భార‌త అభిమానుల‌కు బ్యాడ్‌న్యూస్‌..!

Ind VS Pak | టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో భాగంగా ఈ నెల 15న భార‌త్‌-పాకిస్తాన్ మ‌ధ్య హైవోల్టేజ్ మ్యాచ్ జ‌రుగ‌నున్న‌ది. ఈ మ్యాచ్‌కు ఇంకా రెండురోజులే మిగిలి ఉంది. గ‌తేడాది ఆసియా క‌ప్ ఫైన‌ల్ త‌ర్వాత భార‌త్‌-పాక్ త‌ల‌ప‌డ‌డం ఇదే తొలిసారిగా. కొలంబోలోని ఆర్ ప్రేమ‌దాస స్టేడియంలో మ్యాచ్ జ‌రుగ‌నున్న‌ది.

P

Sports | Published On Feb 13, 2026, 8.47 pm IST

Ind VS Pak | ఈ నెల 15న పాక్‌తో హైవోల్టేజ్ మ్యాచ్‌.. భార‌త అభిమానుల‌కు బ్యాడ్‌న్యూస్‌..!
Advertisement

Ind VS Pak | టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో భాగంగా ఈ నెల 15న భార‌త్‌-పాకిస్తాన్ మ‌ధ్య హైవోల్టేజ్ మ్యాచ్ జ‌రుగ‌నున్న‌ది. ఈ మ్యాచ్‌కు ఇంకా రెండురోజులే మిగిలి ఉంది. గ‌తేడాది ఆసియా క‌ప్ ఫైన‌ల్ త‌ర్వాత భార‌త్‌-పాక్ త‌ల‌ప‌డ‌డం ఇదే తొలిసారిగా. కొలంబోలోని ఆర్ ప్రేమ‌దాస స్టేడియంలో మ్యాచ్ జ‌రుగ‌నున్న‌ది. ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. దాయాదితో పోరుకు ముందు అభిమానుల‌కు షాక్ న్యూస్‌. ఈ మ్యాచ్ రోజున కొలంబోలో భారీ వ‌ర్షం కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ‌శాఖ హెచ్చ‌రించింది. దాంతో అభిమానులు ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు.

ఆదివారం మ్యాచ్ స‌మ‌యంలో వ‌ర్షం కురిసే అవ‌కాశం ఉంద‌ని శ్రీ‌లంక వాతావ‌ర‌ణ‌శాఖ అంచ‌నా వేసింది. బంగాళాఖాతంపై పీడ‌నం త‌గ్గుతోంద‌ని, ఫ‌లితంగా వాన ప‌డే సూచ‌న‌లున్నాయ‌ని తెలిపింది. ప్రేమదాస స్టేడియం ఉన్న కొలంబోలోని ఖెట్టరామ ప్రాంతంలో తేమ ఉంటుంద‌ని, ఉష్ణోగ్ర‌త‌లు 30 నుంచి 31 డిగ్రీల మ‌ధ్య న‌మోద‌య్యే అవ‌కాశాలున్నాయ‌ని తెలిపింది. మ‌ధ్యాహ్నం వ‌ర్షం, ఉరుములతో కూడిన వ‌ర్షాలు ప‌డేందుకు 50 నుంచి 70శాతం వ‌ర‌కు ఛాన్స్ ఉంద‌ని పేర్కొంది. షెడ్యూల్ ప్ర‌కారం భార‌త్‌-పాక్ మ్యాచ్ సాయంత్రం 7 గంట‌ల‌కు ప్రారంభమ‌వుతుంది. మ్యాచ్‌కు ముందు వాన‌ప‌డే సూచ‌న‌లున్నాయి. ఇదే జ‌రిగితే టాస్ ఆల‌స్య‌మ‌య్యే ఛాన్స్ ఉంది. అలాగే, ఓవ‌ర్ల‌ను కుదించే అవ‌కాశం ఉంది. వ‌ర్షం కురిసినా రాత్రి 8 గంట‌ల త‌ర్వాత వాతావ‌ర‌ణం ప్ర‌శాంతంగా ఉంటుంద‌ని అంచ‌నా వేసింది. ప‌లుచోట్ల తేలిక‌పాటి జ‌ల్లులుప‌డుతాయ‌ని చెప్పింది.

మ్యాచ్ జ‌రిగే ప్రేమదాస స్టేడియం డ్రైనేజీ వ్య‌వ‌స్థ అద్భుతంగా ఉంటుంది. ఇది అభిమానుల‌కు ఊర‌ట క‌లిగించే అవ‌కాశం. వ‌ర్షం కురిసినా మైదానాన్ని గ్రౌండ్స్‌మెన్ వేగంగా సిద్ధం చేసేందుకు వీలుంటుంది. ప్రేమదాస స్టేడియంలో పిచ్‌ను మాత్రమే కాకుండా మొత్తం మైదానాన్ని కవర్లతో కప్పే వ్యవస్థ సైతం అందుబాటులో ఉంది. మ్యాచ్ రోజుతో పాటు శనివారం కొలంబోలో వర్షం పడే అవకాశం ఉన్నాయి. దాంతో భార‌త్ ప్రాక్టీస్ సెష‌న్ ప్ర‌భావిత‌మ‌య్యే అవ‌కాశం ఉంటుంది. ఇదిలా ఉండ‌గా.. టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కి ముందు పాకిస్తాన్ హైడ్రామాకు తెర‌లేపిన విష‌యం తెలిసిందే. బంగ్లాదేశ్‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించిన పీసీబీ బోర్డు.. భార‌త్‌తో మ్యాచ్ ఆడ‌బోమ‌ని పాక్ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. అయితే, ఆ త‌ర్వాత ప‌లు దేశాల బోర్డులు పీసీబీపై ఒత్తిడి తెచ్చాయి. ఐసీసీ సైతం నిధుల్లో భారీ కోత విధించ‌నున్న‌ట్లు హెచ్చ‌రించింది. దాంతో పాక్ బోర్డు దిగి వ‌చ్చింది. ఆ త‌ర్వాత భార‌త్‌తో మ్యాచ్ ఆడుతామ‌ని ప్ర‌క‌టించింది.

Advertisement
Advertisement