IND Vs PAK | కొలంబో చేరుకున్న పీసీబీ చైర్మన్.. ఐసీసీ ఆహ్వానాన్ని తిరస్కరించిన బీసీబీ చైర్మన్..!
IND Vs PAK | టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్-పాకిస్తాన్ మధ్య జరుగనున్న హై వోల్టేజ్ మ్యాచ్ జరుగనున్నది. ఈ మ్యాచ్ కోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ శనివారం కొలంబోకు చేరారు.
IND Vs PAK | టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్-పాకిస్తాన్ మధ్య జరుగనున్న హై వోల్టేజ్ మ్యాచ్ జరుగనున్నది. ఈ మ్యాచ్ కోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ శనివారం కొలంబోకు చేరారు. నఖ్వీ పర్యటన ఉద్దేశం కేవలం మ్యాచ్ చూడడమే కాదని.. ఇటీవలి వివాదాల నేపథ్యంలో ఉద్రికత్తలను తగ్గించేందుకు ఐసీసీ అధ్యక్షుడు జై షాతో పాటు ఇతర అధికారులను కలువనున్నట్లు తెలుస్తోంది. భారత్‌లో పర్యటించేందుకు బంగ్లాదేశ్ నిరాకరించిన నేపథ్యంలో పాకిస్తాన్ తొలుత భారత్‌తో ఆడేందుకు నిరాకరించింది. ఆ తర్వాత పాకిస్తాన్, ఐసీసీ మధ్య పలు దశల్లో చర్చలు జరిగాయి. శ్రీలంక ఒత్తిడితో పీసీబీ దిగివచ్చి భారత్‌తో ఆడేందుకు అంగీకరించింది.
ఐసీసీ, ఇతర క్రికెట్ బోర్డులతో పాకిస్తాన్ సంబంధాలను చర్చించేందుకు నఖ్వీ ప్రధాని షాబాజ్ ఫరీఫ్‌ని కలిశారు. ఐసీసీ ఉపాధ్యక్షుడు ఇమ్రాన్ ఖవాజా, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) అధ్యక్షుడితో లాహోర్‌లో జరిగిన సమావేశం తర్వాత ప్రతిష్టంభన తొలగిపోయింది. ఇదిలా ఉండగా.. బీసీబీ అధ్యక్షుడు అమీనుల్ ఇస్లాం భారత్-పాకిస్తాన్ మ్యాచ్ చూసేందుకు రావాలని పంపిన ఆహ్వానాన్ని తిరస్కరించారు. బంగ్లాదేశ్ మీడియా డైలీ స్టార్‌తో మాట్లాడుతూ టీ20 ప్రపంచకప్‌లో తమ జట్టు పాల్గొనడం లేదని, దాంతో తాము అక్కడికి వెళ్లడం సముచితం కాదన్నారు. అమీనుల్ ప్రస్తుతం ఢాకాలో ఉన్నారు. ఐసీసీ నుంచి ప్రత్యేకంగా ఆహ్వానం అందినప్పటికీ ఆయన వెళ్లేందుకు నిరాకరించినట్లు స్పష్టం చేశారు. జాతీయ జట్టుకంటే తనకు ముఖ్యమైంది మరేమీ లేదన్నారు.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






