త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

IND VS PAK | ఇషాన్‌ ధనాధన్‌ బ్యాటింగ్‌.. పాక్‌ టార్గెట్‌ 176 రన్స్‌..!

IND VS PAK | టీ20 ప్రపంచకప్‌లో భాగంగా పాక్‌కు టీమిండియా 176 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కొలంబో ఆర్‌ ప్రేమదాస స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ ఓడు వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన భారత్‌కు తొలి ఓవర్‌లోనే షాక్‌ తగిలింది.

P

Sports | Published On Feb 15, 2026, 8.48 pm IST

IND VS PAK | ఇషాన్‌ ధనాధన్‌ బ్యాటింగ్‌.. పాక్‌ టార్గెట్‌ 176 రన్స్‌..!
Advertisement

IND VS PAK | టీ20 ప్రపంచకప్‌లో భాగంగా పాక్‌కు టీమిండియా 176 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కొలంబో ఆర్‌ ప్రేమదాస స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ ఓడు వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన భారత్‌కు తొలి ఓవర్‌లోనే షాక్‌ తగిలింది. మొదటి ఓవర్‌ ఆఖరి బంతికి అభిషేక్‌ డకౌట్‌గా వెనుదిగాడు. పొట్టి ప్రపంచకప్‌లో వరుసగా రెండోసారి సున్నా స్కోర్‌కే వెనుదిరిగాడు. ఆ తర్వాత ఇషాన్‌ కిషన్‌ పాకిస్తాన్‌ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఫోర్లు, సిక్సర్లు బాదుతూ స్కోర్‌ బోర్డును పరుగులెత్తించాడు. ఇషాన్‌ 40 బంతుల్లో మూడు సిక్సర్లు, పది ఫోర్లతో 77 పరుగులు చేశాడు. రెండో వికెట్‌కు తిలక్‌ వర్మ (25)తో కలిసి 88 పరుగులు జోడించాడు. తొలి ఎనిమిది ఓవర్లలో వికెట్‌ నష్టానికి 82 పరుగులు చేసిన టీమిండియా.. ఇషాన్‌ కిషన్‌ అవుట్‌ అయ్యాక టీమిండియా బ్యాటింగ్‌ కాస్త నెమ్మదించింది. ఇక ఇన్నింగ్స్‌ 15వ ఓవర్‌ సమయంలో హైడ్రామా చోటు చేసుకుంది. 14.2 ఓవర్‌ సమయంలో సైమ్‌ అయూబ్‌ తిలక్‌ వర్మను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు.

ఆ తర్వాతి బంతికే (14.3) బాబర్‌కు క్యాచ్‌ అచ్చి హార్దిక్‌ పాండ్యా పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత శివం దూబే బ్యాటింగ్‌కు వచ్చాడు. ఎదుర్కొన్న తొలి బంతికే అవుట్‌ అయ్యే ప్రమాదం నుంచే దూబే బయటపడ్డాడు. అయూబ్‌ హ్యాట్రిక్‌ కోసం అప్పీల్‌ చేయగా.. రిఫరీ తిరస్కరించాడు. దాంతో పాక్‌ రివ్యూకు వెళ్లింది. రివ్యూలో నాటౌట్‌గా తేలింది. ఆ తర్వాత కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ శివం దూబేతో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించి..32 పరుగులు చేసి అవుట్‌ అయ్యాడు. ఇక చివరి ఓవర్‌లో శివం దూబే, రింకు సింగ్‌ ఫోర్లు, సిక్సర్‌లతో విరుచుకుపడ్డారు. 20వ ఓవర్‌ చివరి రెండు బంతులకు భారత్‌ రెండు వికెట్లు కోల్పోయింది. శివం దూబే (27) రనౌట్‌గా వెనుదిరుగగా.. ఆ తర్వాత బంతికి అక్సర్‌ పటేల్‌ క్యాచ్‌ అవుట్‌ అయ్యాడు. దాంతో భారత్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో భారత్‌ ఏడు వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. పాక్‌ బౌలర్లలో అయూబ్‌కు మూడు వికెట్లు తీయగా.. అల్మాన్‌ అఘా, షాహిన్‌ అఫ్రిది, ఉస్మాన్‌ తారిక్‌కు తలా ఒక వికెట్‌ దక్కింది.

కరచాలనం చేయని కెప్టెన్లు..

వాస్తవానికి భారత్‌, పాక్‌ మ్యాచ్‌ అంటే మైదానం వెలుపల సైతం ఉత్కంఠ ఉంటుంది. ఈ మ్యాచ్‌కు ముందు పలు కీలక పరిణామాలు జరిగిన విషయం తెలిసిందే. గత ఆసియా కప్‌ తరహా సీన్‌ మళ్లీ ఈ మ్యాచ్‌లోనూ కనిపించింది. ఈ సారి కూడా టాస్‌ సమయంలో సూర్యకుమార్‌ యాదవ్‌, సల్మాన్‌ అఘా కరచాలనం చేయలేదు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్‌ జట్టుతో భారత జట్టు షేక్‌ హ్యాండ్‌ ఇవ్వని విషయం తెలిసిందే. తాజాగా టీ20 ప్రపంచకప్‌లోనూ సేమ్‌ సీన్‌ కనిపించింది.

Advertisement
Advertisement