Ind Vs Pak | టీ20 ప్రపంచకప్‌లో భారత్ ఘన విజయం.. 61 పరుగుల తేడాతో పాక్‌ను చిత్తు చేసిన టీమిండియా..!
Ind Vs Pak | టీ20 ప్రపంచకప్‌లో దాయాది పాకిస్తాన్‌తో జరిగిన హైవోల్టేజ్ మ్యాచ్‌లో మరోసారి భారత్ జయకేతనం ఎగుర వేసింది. దాయాది దేశాన్ని మరోసారి భారత్ 61 పరుగుల తేడాతో చిత్తుచేసింది. ఐసీసీ టోర్నీలో మరోసారి పాకిస్తాన్‌పై తిరుగులేని రికార్డును కొనసాగించింది. ఈ టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసి గ్రూప్-ఎలో నుంచి సూపర్-8లోకి ప్రవేశించింది.
Ind Vs Pak | టీ20 ప్రపంచకప్‌లో దాయాది పాకిస్తాన్‌తో జరిగిన హైవోల్టేజ్ మ్యాచ్‌లో మరోసారి భారత్ జయకేతనం ఎగుర వేసింది. దాయాది దేశాన్ని మరోసారి భారత్ 61 పరుగుల తేడాతో చిత్తుచేసింది. ఐసీసీ టోర్నీలో మరోసారి పాకిస్తాన్‌పై తిరుగులేని రికార్డును కొనసాగించింది. ఈ టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసి గ్రూప్-ఎలో నుంచి సూపర్-8లోకి ప్రవేశించింది. భారత్ విధించిన 176 పరుగుల లక్ష్యంతో.. బ్యాటింగ్ ప్రారంభించిన పాక్‌కు తొలి రెండు ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయింది. తొలి ఓవర్ వేసిన హార్దిక్ పాండ్యా పాకిస్తాన్‌కు షాక్ ఇచ్చాడు. నాలుగో బంతికే సాహిబ్జాదా ఫర్హాన్ పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో తొలి బంతికి సిక్సర్ కొట్టిన సైమ్ అయూబ్ (6) ఆ తర్వాత బంతికే వికెట్ల ముందు దొరికిపోయాడు. అదే ఓవర్ చివరి బంతికి కెప్టెన్ సల్మాన్ అఘా (4) రింకు సింగ్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
సత్తా చాటిన టీమిండియా బౌలర్లు..

నాలుగు ఓవర్లు ముగిసిన తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అక్షర్ పటేల్‌ను బౌలింగ్‌కు దింపాడు. అక్షర్ పటేల్ తొలి ఓవర్‌లోనే వికెట్ పడగొట్టాడు. అక్షర్ తాను వేసిన మొదటి ఓవర్ నాలుగో బంతికే బాబర్ అజామ్ (5)ని క్లీన్ బౌల్డ్ చేశాడు. టీమిండియా బౌలర్ల ధాటికి పాక్ పవర్ ప్లేలో కేవలం నాలుగు వికెట్ల నష్టానికి 38 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ తర్వాత షాదాబ్ ఖాన్‌తో కలిసి ఉస్మాన్ ఖాన్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. ఐదో వికెట్‌కు 39 పరుగులు జోడించారు. అక్షర్ తన చివరి ఓవర్‌లో ఉస్మాన్ (44) పెవిలియన్‌కు పంపాడు. అక్షర్ వేసిన బంతిని ఆడేందుకు ఉస్మాన్ ముందుకు రాగా.. బంతి వెల్లి ఇషాన్ చేతుల్లో పడింది. దాంతో క్షణాల్లోనే స్టంప్ అవుట్ చేశాడు. మరుసటి ఓవర్‌లో కుల్దీప్ బౌలింగ్‌లో మహ్మద్ నవాజ్ (4) శివం దూబేకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

అనంతరం కెప్టెన్ తిలక్ వర్మను బౌలింగ్‌కు దింపాడు. తిలక్ తొలి ఓవర్ తొలి బంతికే షాదాబ్ ఖాన్ పెవిలియన్ బాట పట్టాడు. 13 ఓవర్లు ముగిసే సరికి ఏడు వికెట్ల నష్టానికి 78 పరుగులు చేసింది. విజయానికి 98 పరుగుల దూరంలో నిలిచింది. చివరిలో ఫహీం అష్రఫ్ (10), అబ్రార్ (0)లను వరుణ్ చక్రవర్తి పెవిలియన్ పంపాడు. ఇద్దరిని వరుస బంతుల్లో అవుట్ చేసి వరుణ్.. తృటిలో హ్యాట్రిక్ మిస్సయ్యాడు. 16 ఓవర్‌లో మూడు, నాలుగు బంతుల్లో ఇద్దరిని అవుట్ చేసి వరుణ్.. ఐదో బంతిని ఉస్మాన్ తారిక్‌కు వేయగా.. ఆడలేకపోయాడు. టీమిండియా ఎల్‌బీ కోసం అప్పీల్ చేసింది. అంపైర్ ధర్మసేన తిరస్కరించాడు. టీమిండియా రివ్యూకు వెళ్లినా నాటౌట్‌గా తేలింది. ఇక చివరగా 18 ఓవర్ చివరి బంతికి తారిక్‌ను పాండ్యా క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో పాక్ 114 పరుగులకే కుప్పకూలింది. టీమిండియా బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, హార్దిక్ పాండ్యా తలా రెండు వికెట్ల పడగొట్టగా.. కుల్దీప్ యాదవ్, తిలక్ వర్మకు ఒక్కో వికెట్ దక్కింది.

ఇషాన్‌దార్ బ్యాటింగ్..!
అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ఇటీవల ఫుల్ ఫామ్‌లోనూ ఉన్న ఇషాన్ మరోసారి హాఫ్ సెంచరీతో చెలరేగాడు. ఫోర్లు సిక్సర్లతో పాక్ బౌలర్లను ఉతికి ఆరేశాడు. సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, శివం దూబే రాణించడంతో భారీ లక్ష్యాన్ని పాక్ ఎదుట ఉంచింది. అయితే, భారత్‌కు మాత్రం ఆరంభం కలిసిరాలేదు. విధ్వంసక ఓపెనర్ అభిషేక్ మరోసారి తీవ్రంగా నిరాశ పరిచాడు. సల్మాన్ అఘా వేసిన తొలి ఓవర్‌లోనే డకౌట్ అయ్యాడు. అనంతరం తిలక్ వర్మతో కలిసి ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. బ్యాటింగ్‌కు ప్రతీకూలంగా ఉన్నా.. దూకుడు ఆడుతూ పాక్ బౌలర్లపై ఒత్తిడి పెంచాడు. పవర్ ప్లేలో వికెట్ నష్టానికి భారత్ 52 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ 40 బంతుల్లో 77 పరుగులు చేశాడు. ఇషాన్‌తో పాటు సూర్యకుమార్ (32), శివమ్ దూబే (27), తిలక్ వర్మ (25) పర్వాలేదనిపించారు. ఓ దశలో భారత్ 200 పరుగులు చేసేలా కనిపించింది. కానీ, స్పిన్నర్లు ఉస్మాన్ తారిక్, సైమ్ అయూబ్ భారత బ్యాట్స్‌మెన్స్‌ని కట్టడి చేశారు. సైమ్ అయుబ్ మూడు వికెట్లు పడగొట్టాడు. ఉస్మాన్ తారిక్, సల్మాన్ అఘా, షాహిన్ షా అఫ్రిదిలకు చెరో ఒక వికెట్ దక్కింది.

పాక్‌పై ఎదురులేని భారత్..
ఐసీసీ ఈవెంట్లలో పాక్‌పై భారత్ తిరుగులేని రికార్డును కొనసాగిస్తూ వస్తోంది. టీ20 ప్రపంచకప్‌లలో ఇప్పటి వరకు దాయాదిని భారత్ ఎనిమిదో సారి మట్టి కరిపించింది. గత దశాబ్దకాలంగా రెండు జట్లు ద్వైపాక్షిక సిరీస్‌లో ఆడని విషయం తెలిసిందే. రెండు జట్లు కేవలం ఐసీసీ, ఆసియా టోర్నీల్లో మాత్రమే తలపడుతున్నాయి. భారత్-పాక్ మధ్య ఇప్పటి వరకు తొమ్మిది సార్లు పోటీపడ్డాయి. భారత్ ఎనిమిది సార్లు విజయం సాధించింది. 2021 టీ20 ప్రపంచకప్‌లో మాత్రమే పాకిస్తాన్ విజయం సాధించింది. 2007 టీ20 ప్రపంచకప్‌లో తొలిసారిగా పాకిస్తాన్‌ను ఓడించి ప్రపంచకప్‌ని నెగ్గింది. 2007లో గ్రూప్ దశలో, మళ్లీ ఫైనల్‌లో పాకిస్తాన్‌ను మట్టి కరిపించింది. ఆ సమయంలో ఫైనల్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 141 పరుగులు చేసింది. 142 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్‌కు దిగిన పాక్ సైతం ఏడు వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. దాంతో బౌల్డ్ అవుట్‌లో టీమిండియా విజయం సాధించింది మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలోని తొలిసారిగా టైటిల్‌ను గెలుచుకుంది. అప్పటి నుంచి 2021లో మినహా పాక్‌పై భారత్ ఆధిపత్యం కొనసాగిస్తూ వచ్చింది.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






