త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

IND Vs PAK | రేపే దాయాదుల స‌మ‌రం.. 2007 నుంచి వ‌ర‌ల్డ్ క‌ప్‌లో పాక్‌పై భార‌త్‌దే ఆధిప‌త్యం..!

IND Vs PAK | టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో భాగంగా భార‌త్‌-పాకిస్తాన్ మ‌ధ్య హైవోల్టేజ్ మ్యాచ్‌కు రంగం సిద్ధ‌మైంది. కొలంబోలోని ప్రేమ‌దాస స్టేడియం మ్యాచ్ జ‌రుగ‌నున్న‌ది. కీలక మ్యాచ్‌కు ముందు గ‌ణాంకాల‌ను ప‌రిశీలిస్తే.. అన్నీ టీమిండియాకు అనుకూలంగానే ఉన్నాయి.

P

Sports | Published On Feb 14, 2026, 3.14 pm IST

IND Vs PAK | రేపే దాయాదుల స‌మ‌రం.. 2007 నుంచి వ‌ర‌ల్డ్ క‌ప్‌లో పాక్‌పై భార‌త్‌దే ఆధిప‌త్యం..!
Advertisement

IND Vs PAK | టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో భాగంగా భార‌త్‌-పాకిస్తాన్ మ‌ధ్య హైవోల్టేజ్ మ్యాచ్‌కు రంగం సిద్ధ‌మైంది. కొలంబోలోని ప్రేమ‌దాస స్టేడియం మ్యాచ్ జ‌రుగ‌నున్న‌ది. కీలక మ్యాచ్‌కు ముందు గ‌ణాంకాల‌ను ప‌రిశీలిస్తే.. అన్నీ టీమిండియాకు అనుకూలంగానే ఉన్నాయి. ప్ర‌పంచ‌క‌ప్‌లో భార‌త్ ద‌రిదాపుల్లో పాక్ లేదు. గ‌త ద‌శాబ్ద‌కాలంగా రెండు జ‌ట్లు ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడ‌డం లేదు. కేవ‌లం ఐసీసీ, ఏసీసీ టోర్నీలో మాత్ర‌మే ఆడుతున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో హైవోల్టేజీ మ్యాచ్ కోసం అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

దాయాదుల స‌మ‌రం ఎనిమిదిసార్లు..

ఇప్ప‌టి వ‌ర‌కు భార‌త్‌-పాక్ టీ20 ప్రపంచ‌క‌ప్‌లో ఎనిమిదిసార్లు త‌ల‌ప‌డ్డాయి. టీమిండియా ఇందులో ఏడుసార్లు విజ‌యం సాధించింది. వ‌న్డే, టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో కేవ‌లం ఒక‌సారి మాత్ర‌మే భార‌త్ ఓడిపోయింది. ఇది 2021 టీ20 ప్ర‌పంచ‌క‌ప్ స‌మ‌యంలో పాక్ విజ‌యం సాధించింది. ఆ త‌ర్వాత భార‌త్ చేతిలో పాక్ ఘోర ప‌రాజ‌యం పాలైంది. గ‌తేడాది ఆసియా క‌ప్‌లో రెండు జ‌ట్లు మూడుసార్లు పోటీప‌డ్డాయి. ఆసియా క‌ప్ ఫైన‌ల్ స‌హా మూడు మ్యాచుల్లో దాయాదిని భార‌త్ మ‌ట్టిక‌రిపించింది. గ‌తంలో దాయాదులు ఎప్పుడు పోటీప‌డ్డాయి.. ఎవ‌రు విజ‌యం సాధించారో తెలుసుకుందాం..!

పాక్‌ను ఓడించి తొలి టీ20 టైటిల్ నెగ్గిన భార‌త్‌

2007లో తొలిసారిగా టీ20 ప్రపంచ‌క‌ప్‌లో పాకిస్తాన్‌ను భార‌త్ గ్రూప్ ద‌శ‌లోనే ఓడించింది. తొలి ప్రపంచ కప్ గ్రూప్ ద‌శ‌లో 10వ మ్యాచ్‌లో పోటీప‌డ్డాయి. పాకిస్తాన్ కెప్టెన్ షోయబ్ మాలిక్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. భార‌త్ మొద‌ట బ్యాంటింగ్ చేసింది. రాబిన్ ఉత‌ప్ప హాఫ్ సెంచ‌రీ చేశాడు. 20 ఓవ‌ర్ల‌లో తొమ్మిది వికెట్ల‌కు 141 ప‌రుగులు చేసింది. పాక్ 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 141 పరుగులు మాత్రమే చేయగలిగింది. మిస్బా-ఉల్-హక్ 53 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆ సమయంలో సూప‌ర్ ఓవ‌ర్ లేదు. బౌల్ అవుట్ ఆడాల్సి వ‌చ్చింది. ఈ మ్యాచ్‌లో రెండు జ‌ట్ల‌కు ఐదేసి బాల్స్ ఇస్తారు. బౌల‌ర్లు వికెట్ల‌కు బంతుల‌ను విస‌రాల్సి వ‌చ్చింది. భార‌త్ త‌ర‌ఫున వీరేంద్ర సెహ్వాగ్‌, రాబిన్ ఉత‌ప్ప‌, హ‌ర్భ‌న్ వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. పాక్ త‌ర‌ఫున బౌలింగ్ చేసిన ఉమర్ గుల్, యాసిర్ అరాఫత్, షాహిద్ అఫ్రిది వికెట్ల‌ను ప‌డ‌గొట్ట‌లేక‌పోవ‌డంతో భార‌త్ గెలిచింది.

ఐదు ర‌న్స్ తేడాతో గెలిచి చాంపియ‌న్‌గా నిలిచిన టీమిండియా

2007 టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో గ్రూప్ ద‌శ త‌ర్వాత రెండు జ‌ట్లు ఫైన‌ల్‌లో పోటీప‌డ్డాయి. టీమిండియా కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోనీ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. గౌత‌మ్ గంభీర్ 54 బంతుల్లో 75 పరుగులు, రోహిత్ శర్మ 16 బంతుల్లో 30 ప‌రుగుల‌తో నాటౌట్‌గా నిలువ‌డంతో భారత్ 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 157 పరుగులు చేసింది. ఆ త‌ర్వాత పాకిస్తాన్ బ్యాటింగ్ చేసింది. టాప‌ర్డ‌ర్ అంతా కుప్ప‌కూలింది. రుద్ర ప్రతాప్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్, జోగిందర్ శర్మ బ్యాటింగ్ ఆర్డ‌ర్‌ను కుప్ప‌కూల్చారు. పాక్ 141 పరుగులకే తొమ్మిది వికెట్లు కోల్పోయింది. అయితే, మిస్బా-ఉల్-హక్ క్రీజులో నిలిచాడు. చివ‌రి ఓవ‌ర్‌లో గెలిచేందుకు 13 పరుగులు అవసరం. ధోనీ మాస్ట‌ర్ ప్లాన్ వేసి చివ‌రి జోగింద‌ర్ శ‌ర్మ‌కు బంతిని అందించాడు. మిస్బా ఆ ఓవ‌ర్‌లో రెండో బంతిని సిక్స‌ర్ కొట్ట‌గా.. మూడో బంతికి ఫైన్ లెగ్ షాట్ ఆడేందుకు ప్ర‌య‌త్నించి శ్రీ‌శాంత్ చేతికి చిక్కాడు. భార‌త్ ఐదుప‌రుగుల తేడాతో మ్యాచ్‌ను విజ‌యం సాధించింది.

సూప‌ర్‌8లో ఎనిమిది వికెట్ల తేడాతో..

2012లో సూప‌ర్‌8 ద‌శ‌లో భార‌త్‌-పాక్ మ‌రోసారి త‌ల‌ప‌డ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 128 ప‌రుగుల‌కే ఆల్ అవుట్ అయ్యింది. అనంత‌రం బ్యాటింగ్ చేసిన భార‌త్ కేవ‌లం 17 ఓవ‌ర్‌లోనే విజ‌యాన్ని చేరుకుంది. విరాట్ కోహ్లీ 61 బంతుల్లో 78 ప‌రుగుల‌తో నాటౌట్‌గా నిలిచాడు. వీరేంద్ర సెహ్వాగ్ 29 ప‌రుగుల‌తో అజేయంగా నిలిచాడు. యువ‌రాజ్ సింగ్ 19 ప‌రుగులు చేశాడు.

2014లో గ్రూప్ స్టేజ్‌లోనే..

2014 టీ20 ప్రపంచ కప్‌లో భారత్ మళ్లీ పాకిస్తాన్‌ను ఎదుర్కొంది. టాస్ ఓడిన తర్వాత ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 20 ఓవర్లలో 130 పరుగులు చేసింది. భార‌త్ 18.3 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది. విరాట్ కోహ్లీ 36 పరుగులు చేయగా, సురేష్ రైనా 35 పరుగులు చేశాడు.

సూప‌ర్ 10లో ఆరు వికెట్ల తేడాతో..

2016లో సూపర్ 10 రౌండ్‌లో భార‌త్‌-పాక్ మ‌ధ్య మ్యాచ్ జ‌రిగింది. వర్షం కారణంగా మ్యాచ్‌ను 18 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 118 పరుగులు చేసింది. టీమ్ ఇండియా 23 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఆ త‌ర్వాత విరాట్ కోహ్లీ 37 బంతుల్లో 55 పరుగులు, యువరాజ్ సింగ్ 23 బంతుల్లో 24 పరుగులు చేసి ఆరు వికెట్ల తేడాతో మ్యాచ్‌ను గెలిపించారు.

2021లో సూప‌ర్ 12లో తొలిసారి భార‌త్‌ను ఓడించిన పాక్‌..

2021లో దాదాపు ఐదు సంవ‌త్స‌రాల త‌ర్వాత రెండుజ‌ట్లు మ‌ళ్లీ త‌ల‌ప‌డ్డాయి. పాకిస్తాన్ తొలిసారిగా భారత్‌పై పైచేయి సాధించింది. టాస్ ఓడిన భార‌త్ మొద‌ట బ్యాటింగ్ చేసింది. పవర్‌ప్లేలోనే మూడు కీలకమైన వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ కోహ్లీ అర్ధ సెంచరీతో భారత్ 151 పరుగులు చేసింది. సులభమైన లక్ష్యాన్ని ఛేదించిన పాకిస్తాన్ బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్ అద్భుతంగా ఆడారు. రిజ్వాన్ అజేయంగా 79 పరుగులు చేయగా, బాబర్ అజేయంగా 68 పరుగులు చేశాడు. పాకిస్తాన్ 10 వికెట్ల తేడాతో మ్యాచ్‌ను గెలిచింది.

2022లో సూప‌ర్‌-12లో నాలుగు వికెట్ల తేడాతో..

టీ20 ప్రపంచ కప్ సూపర్-12 మ్యాచ్‌లో భారత్ నాలుగు వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. మెల్‌బోర్న్‌లో జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 159 పరుగులు చేసింది. భారత్ 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 160 పరుగులు చేసి మ్యాచ్‌ను గెలుచుకుంది. విరాట్ కోహ్లీ 53 బంతుల్లో ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 82 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌కు ఎంపిక‌య్యాడు. రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ చాలా ఆద్యాంతం ఉత్కంఠ‌గా సాగింది.

2024లో గ్రూప్ స్టేజ్‌లోనే ఆరు ప‌రుగుల తేడాతో..

2024లోనూ పాక్‌పై భార‌త్ ఆధిప‌త్యం కొన‌సాగించింది. ఆ జ‌ట్టును ఆరు ప‌రుగుల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భార‌త జ‌ట్టు 19 ఓవ‌ర్ల‌లో 119 ప‌రుగులు చేసి అవుట్ అయ్యింది. పాక్ 14వ ఓవర్‌లో ఒక దశలో పాకిస్తాన్ స్కోరు మూడు వికెట్లకు 80 ప‌రుగులు చేసింది. ఆ త‌ర్వాత రిజ్వాన్, షాదాబ్ అవుట్ అయ్యారు. 19వ ఓవర్లో బౌలింగ్ వేసిన జ‌స్‌ప్రీత్ బుమ్రా కేవ‌లం మూడు ప‌రుగులు ఇచ్చి వికెట్ తీశాడు. 20 ఓవ‌ర్‌లో పాక్ గెలిచేందుకు 18 ప‌రుగులు అవ‌స‌ర‌మ‌య్యాయి. అర్ష్‌దీప్ కేవ‌లం 11 ప‌రుగులు ఇచ్చి ఇమాద్ వ‌సీం వికెట్ ప‌డ‌గొట్టాడు. బుమ్రా, అర్ష్‌దీప్‌, సిరాజ్‌, హార్దిక్ పాండ్యాల‌తో కూడిన భార‌త బౌలింగ్ మ్యాచ్‌ను మ‌లుపు త‌ప్పింది. పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 113 ప‌రుగుల‌కే అవుట్ అయ్యింది. మూడు వికెట్లు ప‌డ‌గొట్టిన బుమ్రాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ద‌క్కింది.

Advertisement
Advertisement