T20 World Cup Final | ఐసీసీ టోర్నీల్లో 15వ సారి భారత్.. ఈ సారి గెలిస్తే భారత్ రికార్డులే..!
T20 World Cup Final | అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో టీ20 వరల్డ్ కప్ ఫైనల్ జరుగనున్నది. తుదిపోరులో భారత్-న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. మ్యాచ్ సాయంత్రం 7 గంటలకు మొదలుకానుండగా.. టాస్ 6.30 గంటలకు వేయనున్నారు. సూర్యకుమార్ నేతృత్వంలోని టీమిండియా మరోసారి చరిత్ర సృష్టించే లక్ష్యంతో బరిలోకి దిగనున్నది.
T20 World Cup Final | అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో టీ20 వరల్డ్ కప్ ఫైనల్ జరుగనున్నది. తుదిపోరులో భారత్-న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. మ్యాచ్ సాయంత్రం 7 గంటలకు మొదలుకానుండగా.. టాస్ 6.30 గంటలకు వేయనున్నారు. సూర్యకుమార్ నేతృత్వంలోని టీమిండియా మరోసారి చరిత్ర సృష్టించే లక్ష్యంతో బరిలోకి దిగనున్నది. న్యూజిలాండ్ సైతం మరోసారి విజేతగా నిలిచేందుకు ఉవ్విళ్లూరుతోంది. క్రమశిక్షణతో పాటు దూకుడుగా ఆడుతున్న కివీస్‌ను తేలికగ్గా తీసుకోవడం కష్టమే. ఇదిలా ఉండగా.. భారత క్రికెట్ జట్టు చరిత్రలో 15వసారి ఐసీసీ టోర్నీ ఫైనల్‌కు చేరుకోవడం విశేషం. 1983లో కపిల్‌దేవ్ సారథ్యంలో భారత్ తొలి వరల్డ్‌కప్‌ను గెలుచుకోవడంతో మొదలైన ఈ ప్రయాణం మొదలైంది. అప్పటి నుంచి ప్రధాన ఐసీసీ టోర్నీల్లో భారత్ మొత్తం ఏడుసార్లు ట్రోఫీని సొంతం చేసుకుంది.
ఐసీసీ ఫైనల్స్‌లో భారత్ రికార్డు

ఐసీసీ టోర్నీల్లో ఆస్ట్రేలియా ఆధిపత్యం
ఐసీసీ టోర్నీల్లో ఆస్ట్రేలియా జట్టు ఆధిపత్యం కొనసాగింది. ఇప్పటివరకు ఆడిన 14 ఫైనల్స్‌లో కంగారూ జట్టు 10 సార్లు టైటిల్‌ని గెలిచింది. 2002 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ భారత్-శ్రీలంక మధ్య వర్షం కారణంగా రెండు రోజులైనా పూర్తికాకపోవడంతో రెండు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటించారు. భారత్ చివరిసారిగా 2025 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను ఓడించి ట్రోఫీని గెలుచుకుంది. టీమిండియాకు వరుసగా మూడు ఐసీసీ టైటిల్స్‌ను సాధించిన ఘనతకు చేరువైంది. భారత్ ఇప్పటికే 2024 టీ20 వరల్డ్‌కప్, 2025 చాంపియన్స్ ట్రోఫీని గెలిచింది. తాజాగా టీ20 వరల్డ్‌కప్ ఫైనల్‌లో విజయం సాధిస్తే వరుసగా మూడు ఐసీసీ ట్రోఫీలు గెలిచిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించే అవకాశం ఉన్నది.
అహ్మదాబాద్ స్టేడియం.. చేదు జ్ఞాపకాలు
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం భారత అభిమానులకు భావోద్వేగాలకు ప్రతీకగా పేర్కొంటారు. 2023 నవంబర్ 19న ఇదే మైదానంలో జరిగిన వన్డే వరల్డ్‌కప్ ఫైనల్‌లో భారత్ ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. ఆ మ్యాచ్ తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ తీవ్ర నిరాశతో డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిన దృశ్యాలు అభిమానుల మదిలో ఇంకా కదలాడుతూనే ఉన్నాయి. 2024లో టీ20 వరల్డ్‌కప్‌ను గెలుచుకోవడం ద్వారా భారత్ ఆ బాధను కొంత వరకు తీరినట్లయ్యింది. తాజాగా ఇదే మైదానం భారత్‌కు చరిత్ర సృష్టించే అవకాశాన్ని ఇచ్చింది.
సూర్యకుమార్ నాయకత్వంలో కొత్త అధ్యాయం
టీ20 ఫార్మాట్‌లో ప్రస్తుతం భారత జట్టును సూర్యకుమార్ యాదవ్ నడిపిస్తున్నాడు. దూకుడైన బ్యాటింగ్‌తో పాటు చురుకైన వ్యూహాలతో మంచి కెప్టెన్‌గా గుర్తింపు సాధించాడు. గత రెండు సంవత్సరాల్లో యువ ఆటగాళ్లలో విశ్వాసం పెంచుతూ జట్టును సమర్థంగా నడిపించాడు. ఈ ఫైనల్‌లో భారత్ విజయం సాధిస్తే సూర్యకుమార్ కెప్టెన్సీకి ప్రత్యేక గుర్తింపు లభించనుంది. 2023 వరల్డ్‌కప్ ఫైనల్‌లోని చేదు జ్ఞాపకాలు కూడా చాలా వరకు చెరిగిపోనున్నాయి. అయితే, న్యూజిలాండ్ జట్టుతో సూర్యకుమార్ నేతృత్వంలోని జట్టుకు ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంది. ఆ జట్టు అంచనాలకు మించి ప్రదర్శన చేయడం ఆ జట్టుకు అలవాటు. ఫిన్ అలెన్ వంటి దూకుడైన ఓపెనర్ పవర్‌ప్లేలోనే మ్యాచ్ దిశను మార్చగల సామర్థ్యం ఉంది. మిడిల్ ఆర్డర్‌లో గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్ వేగంగా పరుగులు చేసే సత్తా ఉంది. బౌలింగ్‌లో లాకీ ఫెర్గుసన్, మ్యాట్ హెన్రీ తదితర ఫాస్ట్ బౌలర్లు ప్రమాదకరం కాగా.. కెప్టెన్ మిచెల్ శాంటర్నర్ స్పిన్‌తోనూ మ్యాచ్‌ను మలుపు తిప్పే ఛాన్స్ ఉంది.
టీమిండియాకు బుమ్రానే ఆధారం
భారత జట్టుకు అతిపెద్ద బలం జస్‌ప్రీత్ బుమ్రా. యార్కర్లు, వేగాన్ని ఎదుర్కోవడం ఏ బ్యాట్స్‌మన్‌కైనా సవాలే. సెమీఫైనల్‌లో ఇంగ్లండ్‌పై అద్భుతంగా బౌలింగ్ చేసి పరుగుల వేగాన్ని పూర్తిగా తగ్గించాడు. ఫైనల్‌లో కూడా నాలుగు ఓవర్లు మ్యాచ్‌పై ప్రభావం చూపే అవకాశముంది. అర్ష్‌దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా వంటి బౌలర్లు కొత్త బంతితో రాణిస్తున్నా.. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటే ఒత్తిడిలో పడే అవకాశం ఉంటుంది. అందుకే ఎవరితో బౌలింగ్‌ను ప్రారంభిస్తారనేది కీలకం కానుంది. ఇక ఈ టోర్నీలో భారత స్పిన్ విభాగం ఆశించిన ప్రదర్శన చేయలేదు. వరుణ్‌పై భారీ అంచనాలున్నాయి. స్థిరంగా వికెట్లు తీయలేకపోయాడు. దాంతో కుల్దీప్ యాదవ్‌కు అవకాశం ఇవ్వాలన్న చర్చ సాగుతోంది. ఓపెనర్ అభిషేక్ శర్మ ఈ టోర్నీలో ఆశించిన మేరకు రాణించలేకపోయాడు. టెక్నికల్ లోపాలను సద్వినియోగం చేసుకొని పెవిలియన్‌కు పంపుతున్నారు.
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు






