త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

IND vs NAM | టీమిండియాకు మ‌రో షాకింగ్ న్యూస్‌.. ప్రాక్టీస్ సెష‌న్‌లో గాయ‌ప‌డ్డ ఇషాన్ కిష‌న్‌..!

IND vs NAM | న‌మీబియాతో మ్యాచ్‌కు ముందు టీమిండియాకు మ‌రో షాక్ త‌గిలింది. స్టార్ బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిష‌న్ ప్రాక్టీస్ షెష‌న్‌లో గాయ‌ప‌డ్డాడు. బుమ్రా వేసిన యార్క‌ర్‌తో గాయ‌మైన‌ట్లు తెలుస్తోంది. ఇంత‌కు ముందు అభిషేక్ శ‌ర్మ క‌డుపులో ఇన్ఫెక్ష‌న్ కార‌ణంగా ఆసుప‌త్రి పాలైన విష‌యం తెలిసిందే.

P

Sports | Published On Feb 11, 2026, 10.33 pm IST

IND vs NAM | టీమిండియాకు మ‌రో షాకింగ్ న్యూస్‌.. ప్రాక్టీస్ సెష‌న్‌లో గాయ‌ప‌డ్డ ఇషాన్ కిష‌న్‌..!
Advertisement

IND vs NAM | న‌మీబియాతో మ్యాచ్‌కు ముందు టీమిండియాకు మ‌రో షాక్ త‌గిలింది. స్టార్ బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిష‌న్ ప్రాక్టీస్ షెష‌న్‌లో గాయ‌ప‌డ్డాడు. బుమ్రా వేసిన యార్క‌ర్‌తో గాయ‌మైన‌ట్లు తెలుస్తోంది. ఇంత‌కు ముందు అభిషేక్ శ‌ర్మ క‌డుపులో ఇన్ఫెక్ష‌న్ కార‌ణంగా ఆసుప‌త్రి పాలైన విష‌యం తెలిసిందే. అయితే, ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జి కావ‌డం ఊర‌ట క‌లిగించే విష‌యం. ఇటీవ‌ల ఇషాన్ కిష‌న్ అద్భుత‌మైన ఫామ్‌లో ఉన్న విష‌యం తెలిసిందే. అయితే, ప్రాక్టీస్ సెష‌న్‌లో బుమ్రా వేసిన పదునైన యార్కర్ ఆయన ఎడమ కాలుకు త‌గిలింది. దాంతో ఒక్క‌సారిగా విల‌విల‌లాడిపోయాడు. కొద్దిసేప‌టి మైదానంలోకి వ‌చ్చినా.. ఎక్కువ సేపు క్రీజులో నిలువ‌లేక‌పోయాడు. న‌మీబియాతో మ్యాచ్‌కు బుమ్రా అందుబాటులోకి రానున్నాడు. మ్యాచ్ కోసం పూర్తి వేగంతో బౌలింగ్ సాధ‌న చేస్తూ క‌నిపించాడు. ఇదే భార‌త జ‌ట్టుకు ఊర‌ట క‌లిగించే విష‌యం.

అమెరికాతో జరిగే టీ20 ప్రపంచ కప్‌లో తొలి మ్యాచులో ఆడలేకపోయాడు. తాజాగే నమీబియాతో జరిగే మ్యాచ్‌లో తిరిగి వ‌స్తాడ‌ని ఆశిస్తున్నారు. ఇది బుమ్రాకు పాక్‌తో మ్యాచ్‌కు ముందు స‌న్నాహ‌కంగా నిలువ‌నుంది. మ్యాచ్ కు ముందు తిలక్ వర్మ మాట్లాడుతూ బుమ్రా పూర్తిగా క్షేమంగా ఉన్నాడ‌ని.. కోలుకున్న‌ట్లు తెలిపాడు. మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడ‌ని విశ్వాసం వ్య‌క్తం చేశాడు. బౌలింగ్ త‌ర్వాత క్యాచ్ ప్రాక్టీస్ చేశాడు. అభిషేక్ శ‌ర్మ ఆరోగ్య ప‌రిస్థితి టీమిండియాకు ఇబ్బంది క‌రంగానే ఉంది. క‌డుపు ఇన్ఫెక్ష‌న్‌తో ఢిల్లీలో ఆసుప‌త్రిలో చేరాడు. బుధ‌వారం డిశ్చార్జి అయ్యాడు. ఫిట్‌గా లేక‌పోతే సంజు శాంస‌న్‌కు అవ‌కాశం ల‌భించే అవ‌కాశం ఉంది. అయితే, తిల‌క్ వ‌ర్మ సంజుకు ఛాన్స్ ఇచ్చే విష‌యంపై మాత్రం స్పందించ‌లేదు. ఒక రోజు అవ‌కాశం ఉంద‌ని.. ప‌రిస్థితి గురువారం మాత్ర‌మే స్ప‌ష్ట‌మ‌వుతుంద‌ని తెలిపాడు. అందుకు అనుగుణంగా నిర్ణ‌యం ఉంటుంద‌ని తెలిపాడు.

Advertisement
Advertisement