IND Vs MAL U-19 Asia Cup | అండర్ 19 ఆసియాకప్.. మలేషియాపై ఘన విజయం సాధించిన భారత్..
IND Vs MAL U-19 Asia Cup | దుబాయ్ వేదికగా అండర్ 19 ఆసియాకప్ టోర్నీలో భాగంగా జరిగిన వన్డే మ్యాచ్ లో మలేషియాపై భారత్ ఘన విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో మలేషియా జట్టు తడబడింది. దీంతో ఆ జట్టు చాలా స్వల్ప స్కోరుకే ఆలౌట్ అయింది. మలేషియాపై భారత్ ఏకంగా 315 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఇక ఈ మ్యాచ్‌లో గెలుపొందడంతో భారత్ సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. మ్యాచ్‌లో టాస్ గెలిచిన మలేషియా ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా భారత్ బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 408 పరుగుల భారీ స్కోరు చేసింది. భారత జట్టు వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ అభిజ్ఞాన్ కుందు డబుల్ సెంచరీతో రాణించాడు. 125 బంతులు ఆడిన కుందు 17 ఫోర్లు, 9 సిక్సర్లతో 209 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
మరో భారత ప్లేయర్ వేదాంత్ త్రివేది 106 బంతుల్లో 7 ఫోర్లతో 90 పరుగులు చేయగా, డైనమిక్ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ మరో అర్థ సెంచరీతో ఆకట్టుకున్నాడు. 26 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో వైభవ్ 50 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఇక మిగిలిన భారత బ్యాట్స్‌మెన్ ఎవరూ చెప్పుకోదగిన ప్రదర్శన చేయలేకపోయారు. కాగా మలేషియా బౌలర్లలో మహమ్మద్ అక్రమ్ 5 వికెట్లు పడగొట్టగా, నాగినేశ్వరన్ శత్నకుమరన్, జాశ్విన్ కృష్ణమూర్తిలకు చెరొక వికెట్ దక్కింది.
అనంతరం బ్యాటింగ్ చేసిన మలేషియా జట్టు ఆది నుంచి క్రమంగా వికెట్లను కోల్పోతూ వచ్చింది. దీంతో ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. ఈ క్రమంలో మలేషియా 32.1 ఓవర్లలో కేవలం 93 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ జట్టు బ్యాట్స్మెన్లలో హంజా పంగీ తప్ప ఎవరూ రాణించలేదు. 52 బంతులు ఆడిన హంజా 4 ఫోర్లతో 35 పరుగులు చేశాడు. మిగిలిన ఎవరూ రాణించలేదు. ఇక భారత బౌలర్లలో దీపేష్ దేవేంద్రన్ 5 వికెట్లు పడగొట్టగా, ఉధవ్ మోహన్ 2 వికెట్లు తీశాడు. కిషన్ సింగ్, ఖిలాన్ పటేల్, కనిష్క్ చౌహాన్‌లకు తలా 1 వికెట్ దక్కింది. కాగా ఈ టోర్నీలో భారత్ రెండోసారి 400 పైచిలుకు స్కోరును సాధించడం విశేషం.
సంబంధిత వార్తలు

NZW Vs SAW | అదరగొట్టిన కివీస్ మహిళల జట్టు.. సౌతాఫ్రికాపై 2-1 తేడాతో వన్డే సిరీస్ కైవసం..
ఏప్రిల్ 4, 2026

Vaibhav Suryavanshi | టెన్త్ క్లాస్ పరీక్షలు రాయబోతున్న చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ.. ఎక్కడంటే..?
ఫిబ్రవరి 14, 2026

Under-19 World Cup | అండర్ 19 వరల్డ్ కప్.. సెమీస్‌కు దూసుకెళ్లిన భారత్.. పాక్‌పై ఘన విజయం..
ఫిబ్రవరి 1, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



