NZW Vs SAW | అదరగొట్టిన కివీస్ మహిళల జట్టు.. సౌతాఫ్రికాపై 2-1 తేడాతో వన్డే సిరీస్ కైవసం..
NZW Vs SAW | వెల్లింగ్టన్ వేదికగా సౌతాఫ్రికా మహిళల జట్టుతో ఆతిథ్య న్యూజిలాండ్ మహిళల జట్టు ఆడిన చివరిదైన మూడో వన్డేలో కివీస్ మహిళలు ఘన విజయం సాధించారు. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ప్రోటీస్ జట్టు తడబడింది.
NZW Vs SAW | వెల్లింగ్టన్ వేదికగా సౌతాఫ్రికా మహిళల జట్టుతో ఆతిథ్య న్యూజిలాండ్ మహిళల జట్టు ఆడిన చివరిదైన మూడో వన్డేలో కివీస్ మహిళలు ఘన విజయం సాధించారు. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ప్రోటీస్ జట్టు తడబడింది. కీలక సమయాల్లో వెంట వెంటనే ప్లేయర్లు ఔట్ అయి పెవిలియన్‌కు చేరడంతో సౌతాఫ్రికా ఆ లక్ష్యాన్ని ఛేజ్ చేయలేక ఆలౌట్ అయింది. కివీస్ జట్టులో మ్యాడీ గ్రీన్, బ్రూక్ హాలిడే బ్యాటింగ్‌లో రాణించగా, రోజ్‌మేరీ మెయిర్ బౌలింగ్ లో చెలరేగడంతో న్యూజిలాండ్ అలవోకగా విజయం సాధించింది. సౌతాఫ్రికాపై ఆ జట్టు 66 పరుగుల తేడాతో గెలుపొందింది. మూడు వన్డేల సిరీస్ సమంగా ఉన్న నేపథ్యంలో జరిగిన ఈ నిర్ణయాత్మక వన్డేలో కివీస్ గెలుపుతో ఆ జట్టు ఈ సిరీస్‌ను కైవసం చేసుకుంది.
రాణించిన కివీస్ బ్యాటర్లు..
మ్యాచ్ లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా ముందు ఫీల్డింగ్ ఎంచుకోగా, కివీస్ బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలోనే కివీస్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లను కోల్పోయి 306 పరుగులు చేయగా, మ్యాడీ గ్రీన్ (128 బంతుల్లో 141 నాటౌట్, 15 ఫోర్లు), బ్రూక్ హాలిడే (124 బంతుల్లో 98 పరుగులు, 13 ఫోర్లు) రాణించారు. సౌతాఫ్రికా ప్లేయర్లలో అయాండా లుబి, టుమి సెఖుఖునె చెరో 2 వికెట్లు తీయగా, నదీన్ డి క్లర్క్, మలాబా చెరొక వికెట్ తీశారు.
240 పరుగులకే సౌతాఫ్రికా ఆలౌట్..
307 పరుగుల భారీ లక్ష్యంతో తరువాత బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా 46.1 ఓవర్లలో 240 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. ఆ జట్టు ప్లేయర్లలో కెప్టెన్ లారా వోల్వార్ట్ (68 బంతుల్లో 69 పరుగులు, 9 ఫోర్లు), అనెరి డెరిక్‌సన్ (52 బంతుల్లో 47 పరుగులు, 5 ఫోర్లు, 1 సిక్సర్) మినహా అందరూ విఫలమయ్యారు. వీరు ఔట్ అవ్వగానే టాప్ ఆర్డర్, మిడిలార్డర్ కుప్పకూలింది. దీంతో కివీస్ సునాయాసంగా విజయం సాధించింది. కివీస్ ప్లేయర్లలో రోజ్‌మేరీ మెయిర్ 5 వికెట్లు పడగొట్టి సౌతాఫ్రికా పతనాన్ని శాసించగా, కెప్టెన్ అమెలియా కెర్ 2 వికెట్లు తీసింది. జెస్ కెర్, కైలీ నైట్, నెన్సి పటేల్ తలా 1 వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌లో విజయంతో కివీస్ జట్టు మూడు వన్డేల సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకోగా, అంతకు ముందు జరిగిన 5 మ్యాచ్ ల టీ20 సిరీస్‌ను కూడా ఆతిథ్య జట్టు 4-1 తేడాతో సొంతం చేసుకుంది. కివీస్ ప్లేయర్లు అద్భుతమైన పోరాట పటిమతో రెండు సిరీస్‌లను చేజిక్కించుకున్నారు.
సంబంధిత వార్తలు

NZW Vs SAW | చరిత్ర సృష్టించిన కివీస్ మహిళల జట్టు.. వన్డేల్లో రికార్డు స్థాయి లక్ష్య ఛేధన..
ఏప్రిల్ 1, 2026

Vaibhav Suryavanshi | టెన్త్ క్లాస్ పరీక్షలు రాయబోతున్న చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ.. ఎక్కడంటే..?
ఫిబ్రవరి 14, 2026

Under-19 World Cup | అండర్ 19 వరల్డ్ కప్.. సెమీస్‌కు దూసుకెళ్లిన భారత్.. పాక్‌పై ఘన విజయం..
ఫిబ్రవరి 1, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



