త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

IND vs IRE | వైభవ్ సూర్యవంశీ అరంగేట్రంపై ఉత్కంఠ.. గంభీర్ వ్యూహంపైనే అందరి దృష్టి..! సీతాన్షు కొటక్‌ ఏమన్నారంటే..?

IND vs IRE | భారత్-ఐర్లాండ్ మధ్య టీ20 సిరీస్‌కు ముందు అందరి దృష్టి ఒకే ఒక్క పేరుపై నిలిచింది. అది ఎవరో కాదు 15 ఏళ్ల యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీపై. ఐపీఎల్ 2026లో 776 పరుగులతో ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న ఈ యువ ఆటగాడు అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేస్తాడా? అన్నది ఇప్పుడు పెద్ద చర్చగా మారింది.

P

Sports | Published On Jun 26, 2026, 7.10 pm IST

IND vs IRE | వైభవ్ సూర్యవంశీ అరంగేట్రంపై ఉత్కంఠ.. గంభీర్ వ్యూహంపైనే అందరి దృష్టి..! సీతాన్షు కొటక్‌ ఏమన్నారంటే..?
Advertisement

IND vs IRE | భారత్-ఐర్లాండ్ మధ్య టీ20 సిరీస్‌కు ముందు అందరి దృష్టి ఒకే ఒక్క పేరుపై నిలిచింది. అది ఎవరో కాదు 15 ఏళ్ల యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీపై. ఐపీఎల్ 2026లో 776 పరుగులతో ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న ఈ యువ ఆటగాడు అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేస్తాడా? అన్నది ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. అవకాశం వస్తే, టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత పిన్న వయసులో అరంగేట్రం చేసిన భారత ఆటగాళ్లలో వైభవ్ నిలిచే అవకాశం ఉంది. అయితే, ఈ విషయంలో టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ఆలోచనా విధానం కీలకంగా మారనుంది. తొలి టీ20కి ముందు భారత బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ జట్టు ఎంపికపై స్పష్టత ఇచ్చారు. తుది జట్టును కెప్టెన్, హెడ్ కోచ్ కలిసి నిర్ణయిస్తారని తెలిపారు. ‘వైభవ్ ఆడితే చాలా సంతోషం. ఆడకపోయినా అతను భారత జట్టులో భాగమే. అతనికి తగిన అవకాశాలు తప్పకుండా వస్తాయని నమ్ముతున్నాను. అయితే, నిలకడగా పరుగులు చేస్తున్న ఆటగాడిని కేవలం ఒకరికి అవకాశం ఇవ్వడం కోసం తప్పించడం సరైన నిర్ణయం కాదు. అవకాశం ఇవ్వడం, మరో ఆటగాడికి అన్యాయం చేయడం మధ్య చాలా చిన్న తేడా ఉంటుంది’ అని కొటక్‌ పేర్కొన్నారు.

గంభీర్ ఆలోచన.. ‘టీమ్ ఫస్ట్’

గౌతమ్ గంభీర్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత జట్టు వ్యక్తిగత రికార్డుల కంటే జట్టు సమతుల్యతకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. సంజు శాంసన్, అభిషేక్ శర్మ, మరే ఇతర ఆటగాడు మంచి ఫామ్‌లో ఉంటే, కేవలం వైభవ్ కోసం వారిని తప్పించడం సరైన విధానం కాదని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది. జట్టులో ప్రతి ఆటగాడికి ఒక నమ్మకం ఉండాలని, మంచి ప్రదర్శన చేసే వారికి మాత్రమే అవకాశాలు వస్తాయనే భావన డ్రెస్సింగ్ రూమ్‌లో ఉండాలని మేనేజ్‌మెంట్ కోరుకుంటోంది. వైభవ్ సూర్యవంశీని భారత క్రికెట్ భవిష్యత్ తారగా చూస్తున్నారు. ఐపీఎల్‌లో ప్రపంచ స్థాయి బౌలర్లపై అతని ధైర్యమైన బ్యాటింగ్ అందరినీ ఆకట్టుకుంది. అయితే, అతని కెరీర్ ఇంకా చాలాకాలం ఉంటుందని జట్టు యాజమాన్యం భావిస్తోంది. ఇప్పుడే అంతర్జాతీయ స్థాయిలో ఒత్తిడికి గురిచేయకుండా.. భారత జట్టుతో కలిసి ఉండడం, సీనియర్ ఆటగాళ్ల నుంచి నేర్చుకోవడం, అంతర్జాతీయ క్రికెట్ వాతావరణాన్ని అర్థం చేసుకోవడం అతని ఎదుగుదలకు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.

సచిన్ రికార్డు కోసం ఎదురుచూపేనా?

ఇంత చిన్న వయసులో భారత జట్టుకు ఆడితే వైభవ్ సూర్యవంశీ, సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమిస్తాడా అన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. అయితే, ప్రస్తుత పరిస్థితులను చూస్తే టీమ్ మేనేజ్‌మెంట్ రికార్డుల కోసం తొందరపడే ఆలోచనలో లేదని తెలుస్తోంది. అతని అరంగేట్రం రికార్డు కోసం కాకుండా, సరైన సమయం, అర్హత ఆధారంగా ఉండాలని జట్టు భావిస్తోంది. ఐపీఎల్‌లో చూపిన ప్రదర్శనతో వైభవ్‌కు టీమిండియా జెర్సీ దూరం కాదని స్పష్టమే. అయితే, ఆ కల సాకారం అయ్యే సమయం మాత్రం జట్టు అవసరాలు, సరైన అవకాశంపై ఆధారపడి ఉండనున్నది.

Advertisement
Advertisement