త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

India Women’s | టీ20 సిరీస్‌లో ఆస్ట్రేలియా చిత్తు..! చ‌రిత్ర సృష్టించిన వుమెన్స్ జ‌ట్టు..!

India Women's | అడిలైడ్ ఓవ‌ర్‌లో జ‌రిగిన నిర్ణ‌యాత్మ‌క మూడో టీ20లో ఆతిథ్య ఆస్ట్రేలియా జ‌ట్టును 17 ప‌రుగుల తేడాతో టీమిండియా వుమెన్స్ జ‌ట్టు ఓడించింది. ఆస్ట్రేలియాపై భార‌త్ సిరీస్‌లో విజ‌యం సాధించ‌డం ఇది రెండోసారి. ఇంత‌కు ముందు 2016లో మిథాలీ రాజ్ నేతృత్వంలోని జ‌ట్టు 2-1 తేడాతో ఓడించింది. తాజాగా మ‌రోసారి ఆ జ‌ట్టును సిరీస్‌ను కైవ‌సం చేసుకొని చ‌రిత్ర సృష్టించారు.

P

Sports | Published On Feb 21, 2026, 6.03 pm IST

India Women’s | టీ20 సిరీస్‌లో ఆస్ట్రేలియా చిత్తు..! చ‌రిత్ర సృష్టించిన వుమెన్స్ జ‌ట్టు..!
Advertisement

India Women's | అడిలైడ్ ఓవ‌ర్‌లో జ‌రిగిన నిర్ణ‌యాత్మ‌క మూడో టీ20లో ఆతిథ్య ఆస్ట్రేలియా జ‌ట్టును 17 ప‌రుగుల తేడాతో టీమిండియా వుమెన్స్ జ‌ట్టు ఓడించింది. ఆస్ట్రేలియాపై భార‌త్ సిరీస్‌లో విజ‌యం సాధించ‌డం ఇది రెండోసారి. ఇంత‌కు ముందు 2016లో మిథాలీ రాజ్ నేతృత్వంలోని జ‌ట్టు 2-1 తేడాతో ఓడించింది. తాజాగా మ‌రోసారి ఆ జ‌ట్టును సిరీస్‌ను కైవ‌సం చేసుకొని చ‌రిత్ర సృష్టించారు.

శ‌నివారం జ‌రిగిన మూడో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు 20 ఓవ‌ర్ల‌లో ఆరు వికెట్లు కోల్పోయి 176 ప‌రుగులు చేసింది. స్మృతి మంధాన (82), జెమిమా రొడ్రిగ్స్ (59) హాఫ్ సెంచ‌రీల‌తో అద‌ర‌గొట్టారు. ఆ త‌ర్వాత ఆస్ట్రేలియా 20 ఓవ‌ర్ల‌లో తొమ్మిది వికెట్లు కోల్పోయి 159 ప‌రుగులు మాత్ర‌మే చేయ‌గ‌లిగింది. భార‌త బౌల‌ర్లు శ్రేయాంక పాటిల్, శ్రీ‌చ‌రి మూడు వికెట్లు తీశారు. అరుంధ‌తి రెడ్డి రెండు వికెట్ల తీయ‌గా, రేణుకా సింగ్‌కు ఒక వికెట్ ద‌క్కింది.

టీమిండియా నిర్దేశించిన 177 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఆస్ట్రేలియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ త‌గిలింది. శ్రేయాంక పటిల్ బౌలింగ్‌లో జార్జియా వాల్ (10) అవుట్ అయ్యింది. అనంతరం రేణుకా సింగ్ బౌలింగ్‌లో బెత్ మూనీ (6) పెవిలియ‌న్‌కు చేరుకుంది. కీల‌క మ్యాచ్‌లో ఆష్లీ గార్డనర్ (57) హాఫ్ సెంచ‌రీ చేసింది. ఐదుగురు బ్యాట‌ర్లు డ‌బుల్ డిజిట్ స్కోర్ చేయ‌లేక‌పోయారు. ఎల్లిస్ పెర్రీ (1) గ్రేస్ హారిస్ (1), సోఫీ మోలినెక్స్ (6) ప‌రుగులు చేయ‌గా.. కిమ్ గార్త్ (7), డార్సీ బ్రౌన్ (8) ర‌న్స్ చేసి నాటౌట్‌గా నిలిచారు.

అంత‌కు ముందు బ్యాటింగ్ చేసిన భార‌త్‌కు ఓపెన‌ర్లు స్మృతి మంధాన‌, షెఫాలీ ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. ఏడు ప‌రుగులు చేసి షెఫాలీ పెవిలియ‌న్‌కు చేరింది. ఆ త‌ర్వాత జెమీమాతో క‌లిసి స్మృతి మ‌రో వికెట్ ప‌డ‌కుండా జాగ్ర‌త్త ప‌డుతూ స్కోర్ బోర్డును ప‌రుగులు పెట్టించింది. ఇద్ద‌రు రెండో వికెట్‌కు 121 ర‌న్స్ జోడించారు. స్మృతి 55 బంతుల్లో ఎనిమిది ఫోర్లు, మూడు సిక్సర్లతో 82 పరుగులు చేసి అత్యధిక స్కోరు నమోదు చేసింది.

జెమిమా 46 బంతుల్లో నాలుగు ఫోర్లతో 59 పరుగులు చేసి అవుట్ అయ్యింది. రిచా ఘోష్ ఏడు బంతుల్లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్ సహాయంతో 18 పరుగులు చేసింది. అమంజోత్ కౌర్ (1), దీప్తి శర్మ (1) త్వరగా త్వ‌ర‌గానే వికెట్లు కోల్పోయినా.. కెప్టెన్ హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ రెండు ప‌రుగుల‌తో నాటౌట్‌గా నిలిచింది. ఆస్ట్రేలియా తరఫున అన్నాబెల్ స‌ద‌ర్లాండ్ రెండు వికెట్లు తీయ‌గా.. కిమ్ గార్త్‌, మోలినెక్స్‌కి ఒక్కో వికెట్ ద‌క్కింది.

Advertisement
Advertisement