ICC T20 World Cup | టీ20 ప్రపంచకప్‌కి సర్వం సిద్ధం.. టోర్నీ ఫుల్ షెడ్యూల్ ఇదే..!
ICC T20 World Cup | ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 కోసం రంగం సిద్ధమైంది. భారత్-శ్రీలంక సంయుక్తంగా నిర్వహించనున్న టోర్నీ కోసం అన్ని జట్లు సిద్ధమయ్యాయి. 2007లో మొదలైన ఐసీసీ టీ20 ప్రపంచకప్ ఇప్పటి వరకు తొమ్మిది ఎడిషన్స్ జరిగాయి. పదో ఎడిషన్ ఈ నెల 7 నుంచి మొదలుకానున్నది.
ICC T20 World Cup | ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 కోసం రంగం సిద్ధమైంది. భారత్-శ్రీలంక సంయుక్తంగా నిర్వహించనున్న టోర్నీ కోసం అన్ని జట్లు సిద్ధమయ్యాయి. 2007లో మొదలైన ఐసీసీ టీ20 ప్రపంచకప్ ఇప్పటి వరకు తొమ్మిది ఎడిషన్స్ జరిగాయి. పదో ఎడిషన్ ఈ నెల 7 నుంచి మొదలుకానున్నది. గతేడాది తరహాలో ఈ సారి టోర్నీ జరుగుతుంది. ఇందులో 20 జట్లు పాల్గొననుండగా.. నాలుగు గ్రూపులుగా విభజించారు. ప్రతి జట్టు గ్రూప్ దశలో నాలుగు మ్యాచులు ఆడుతుంది. గ్రూప్‌లో తొలి రెండుస్థానాల్లో నిలిచిన జట్లు సూపర్ ఎయిట్ దశకు చేరుతాయి. సూపర్ ఎయిట్‌లో ఎనిమిది జట్లను రెండు గ్రూపులుగా విభజిస్తారు. ఆ తర్వాత ఆయా గ్రూప్‌లలో అగ్రస్థానంలో నిలిచిన జట్లు సెమీఫైనల్స్ ఆడుతాయి. ఆ తర్వాత ఫైనల్ జరుగుతుంది.
పాక్ మ్యాచులన్నీ శ్రీలంకలోనే..
భారత్, శ్రీలంక సంయుక్తంగా ఈ ఐసీసీ టోర్నీని నిర్వహిస్తున్నాయి. బీసీసీఐ, పీసీబీ మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం.. పాకిస్తాన్ తన గ్రూప్, సూపర్ ఎయిట్ మ్యాచులన్నీ శ్రీలంకలోనే ఆడుతుంది. పాకిస్తాన్ ఫైనల్‌కు అర్హత సాధిస్తే ఆ మ్యాచ్ సైతం శ్రీలంకలోనే జరుగుతుంది. పాక్ ఫైనల్‌కు వెళ్లకపోతే అహ్మదాబాద్‌లో ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. కీలక టోర్నీకి ముందు పాకిస్తాన్ సరికొత్త నాటకానికి తెరలేపింది. మొన్నటి వరకు ప్రపంచకప్ నుంచి తప్పుకుంటామన్న పాకిస్తాన్ తాజాగా ప్రపంచకప్ టోర్నీలో పాల్గొంటామని.. భారత్‌తో తాము మ్యాచ్ ఆడబోమని పాకిస్తాన్ ప్రభుత్వం తెలిపింది.
డిఫెండింగ్ చాంపియన్‌గా భారత్..
ఆటోమేటిక్ క్వాలిఫికేషన్, ర్యాంకింగ్స్, గ్లోబల్ క్వాలిఫయర్స్ విధానంలో మొత్తం 20 జట్లు టోర్నీకి అర్హత సాధించాయి. ఆతిథ్య దేశాలుగా భారత్, శ్రీలంక ఎంట్రీ ఇవ్వగా.. ఐసీసీ ర్యాంకింగ్స్, క్వాలిఫయింగ్ మ్యాచుల్లో నెగ్గి మిగతా జట్లు టోర్నీలోకి అడుగుపెట్టాయి. బంగ్లాదేశ్ జట్టు భారత్‌లో పర్యటించేందుకు నిరాకరించడంతో ఆ జట్టు స్థానంలో ఐసీసీ ర్యాంకింగ్స్ ఆధారంగా స్కాట్లాండ్‌కు ఆడేందుకు అవకాశం కల్పించారు. ఇక ఇటలీ తొలిసారిగా టీ20 వరల్డ్ కప్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నది. టోర్నీకిలో భారత్ (ఆతిథ్య దేశం), పాకిస్తాన్, శ్రీలంక (ఆతిథ్య దేశం), స్కాట్లాండ్, ఆఫ్ఘనిస్తాన్,
యుఏఈ, ఒమన్, వెస్టిండీస్, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, నమీబియా, జింబాబ్వే, ఐర్లాండ్, ఇంగ్లాండ్, నెదర్లాండ్స్, ఇటలీ, నేపాల్ ప్రపంచకప్‌కి అర్హత సాధించాయి. ఈ టోర్నీలో టీమిండియా డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగబోతున్నది. గతేడాది జరిగిన పొట్టి ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాపై విజయం సాధించిన విషయం తెలిసిందే.
ఏ గ్రూప్‌లో ఎవరు..?
గ్రూప్ ఏ : భారత్, పాకిస్తాన్, నెదర్లాండ్స్, నమీబియా, యూఎస్‌ఏ
గ్రూప్ బీ : శ్రీలంక, ఆస్ట్రేలియా, జింబాబ్వే, ఐర్లాండ్, ఒమన్
గ్రూప్ సీ : ఇంగ్లాండ్, వెస్టిండీస్, స్కాట్లాండ్, నేపాల్, ఇటలీ
గ్రూప్ డీ : దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్, యుఏఈ, కెనడా

ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






