త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Arshdeep Singh | అర్ష్‌దీప్ సింగ్‌పై ఐసీసీ క‌ఠిన చ‌ర్య‌లు.. మ్యాచ్ ఫీజులో 15శాతం కోత‌..!

Arshdeep Singh | భారత యువ ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్‌పై ఐసీసీ చర్యలు తీసుకుంది. న్యూజిలాండ్ ఆటగాడు డారిల్ మిచెల్ వైపు బంతి విసిరిన వ్య‌వ‌హారంలో మ్యాచ్ ఫీజులో 15శాతం జ‌రిమానా విధించింది.

P

Sports | Published On Mar 10, 2026, 7.45 pm IST

Arshdeep Singh | అర్ష్‌దీప్ సింగ్‌పై ఐసీసీ క‌ఠిన చ‌ర్య‌లు.. మ్యాచ్ ఫీజులో 15శాతం కోత‌..!
Advertisement

Arshdeep Singh | భారత యువ ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్‌పై ఐసీసీ చర్యలు తీసుకుంది. న్యూజిలాండ్ ఆటగాడు డారిల్ మిచెల్ వైపు బంతి విసిరిన వ్య‌వ‌హారంలో మ్యాచ్ ఫీజులో 15శాతం జ‌రిమానా విధించింది. టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో భాగంగా ఆదివారం న‌రేంద్ర మోదీ స్టేడియంలో న్యూజిలాండ్‌తో మ్యాచ్ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత్ అద్భుత ప్రదర్శనతో విజయం సాధించి టైటిల్‌ను కైవసం చేసుకుంది. అయితే మ్యాచ్ మధ్యలో ఒక్క‌సారిగా ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్న విష‌యం తెలిసిందే. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 11వ ఓవర్ బౌలింగ్ చేయడానికి అర్ష్‌దీప్ వ‌చ్చాడు.

అత‌ను వేసిన ఓవ‌ర్‌లోని ఐదో బంతిని మిచెల్ డిఫెన్స్ ఆడాడు. బంతి అర్ష్‌దీప్ చేతుల్లో ప‌డింది. బంతిని వికెట్ల వైపుగా విసిరే ప్ర‌య‌త్నంలో మిచెల్ తొడ‌కు తాకింది. దీంతో కొద్ది సేపు మైదానంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మిచెల్ అసహనం వ్యక్తం చేస్తూ అర్ష్‌దీప్ వైపు దూసుకువెళ్లేందుకు ప్ర‌య‌త్నం చేస్తూ అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. అయితే, పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారేకంటే ముందు కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్ క‌ల్పించుకొని మిచెల్‌ను శాంత‌ప‌రిచాడు. అంపైర్ సైతం అర్ష్‌దీప్‌తో మాట్లాడి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

ఈ ఘ‌ట‌న‌ను తీవ్రంగా ప‌రిగ‌ణించిన ఐసీసీ అర్ష్‌దీప్ మ్యాచ్ ఫీజులో 15శాతం జ‌రిమానా విధించింది. ఐసీసీ ప్రవర్తనా నియమావళిలో లెవల్-1 ఉల్లంఘించినందుకు చ‌ర్య‌లు తీసుకున్న‌ట్లు పేర్కొంది. ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్‌లోని ఆర్టికల్ 2.9 ఉల్లంఘించిన‌ట్లుగా తేల‌డంతో జ‌రిమానా విధించ‌డంతో పాటు అర్ష్‌దీప్ డిసిప్లినరీ రికార్డులో ఒక డీమెరిట్ పాయింట్ నమోదు చేశారు. మ్యాచ్ అనంత‌రం ఈ వివాదంపై స్పందించిన అర్ష్‌దీప్ తన తప్పును ఒప్పుకున్నాడు. బంతి విసిరిన వెంటనే అది రివర్స్ స్వింగ్ అయి మిచెల్‌ను తాకింద‌ని, బ్యాట్స్‌మెన్ వ‌ద్ద‌కు వెళ్లి క్షమాపణ చెప్పిన‌ట్లుగా చెప్పుకొచ్చాడు.

Advertisement
Advertisement