త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

ICC Player of the Month Award | ఐసీసీ ప్లేయ‌ర్ ఆఫ్ ది మంత్ అవార్డు.. టీమిండియా నుంచి అరుంధ‌తిరెడ్డి నామినేట్‌..!

P

Sports | Published On Mar 16, 2026, 7.30 pm IST

ICC Player of the Month Award | ఐసీసీ ప్లేయ‌ర్ ఆఫ్ ది మంత్ అవార్డు.. టీమిండియా నుంచి అరుంధ‌తిరెడ్డి నామినేట్‌..!
Advertisement

ICC Player of the Month Award | అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ఫిబ్రవరి 2026 నెలలో ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు కోసం మెన్స్‌, వుమెన్స్ విభాగాల్లో నామినేషన్స్ ప్రకటించింది. పురుషుల విభాగంలో సాహిబ్జాదా ఫర్హాన్ (పాక్‌), విల్ జాక్స్ (ఇంగ్లండ్‌), షాడ్లీ వాన్ షాల్క్వీక్ (యూఎస్‌) నామినేట్ అయ్యారు. మహిళల విభాగంలో హర్షిత సమర విక్ర‌మ (శ్రీ‌లంక‌), ఫాతిమా స‌నా (పాక్‌), అరుంధ‌తిరెడ్డి (భార‌త్‌)ని ఐసీసీ నామినేట్ చేసింది. ఈ క్రికెట‌ర్లు అంతా ఇటీవల జ‌రిగిన అంతర్జాతీయ మ్యాచుల్లో అద్భుత ప్రదర్శనతో తమ జట్ల విజయంలో కీలక పాత్ర పోషించార‌ని ఐసీసీ పేర్కొంది. అయితే, మెన్స్ టీమ్‌లో భార‌త జ‌ట్టు ఆట‌గాళ్లు ఎవ‌రూ నామినేష‌న్స్‌లో లేక‌పోవ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది.

మెన్స్ కేట‌గిరిలో నామినేష‌న్స్‌..

  • ఫర్హాన్ ఫిబ్రవరిలో పాక్ త‌ర‌ఫున అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026లో అత్యధిక ర‌న్స్ చేసిన ప్లేయ‌ర్ల‌లో ఒక‌డిగా నిలిచాడు. ఒక్క ఎడిషన్‌లో అత్యధిక ప‌రుగులు చేసిన (383) ప్లేయ‌ర్‌గా నిలిచాడు. గ‌తంలో ఈ రికార్డు కోహ్లీ పేరిట ఉంది. విరాట్ 2014లో 319 రన్స్ చేయ‌గా.. పాక్ బ్యాట‌ర్ ఈ రికార్డును అధిగ‌మించాడు. ఇందులో రెండు శ‌త‌కాలున్నాయి. ఫర్హాన్ ప్రదర్శనలు ఆ జ‌ట్టు సూప‌ర్ 8 వ‌ర‌కు దూసుకెళ్లింది. అయితే, సెమీఫైన‌ల్స్‌కు మాత్రం అర్హ‌త సాధించ‌లేక‌పోయింది.
  • విల్ జాక్స్ ఇంగ్లండ్ సెమీ ఫైనల్ వ‌ర‌కు చేరడంలో విల్ జాక్స్ కీలక పాత్ర పోషించారు. ఈ ఆల్ రౌండర్ బాల్‌తో పాటు బ్యాట్‌తో రాణించాడు. 194 రన్స్ స్కోర్ చేసి, 11 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఒక్కో మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును నాలుగుసార్లు గెలిచిన తొలి ప్లేయ‌ర్‌గా చరిత్ర సృష్టించాడు.
  • అమెరికా ఫాస్ట్ బౌలర్ షాడ్లీ వాన్ షాల్క్వీక్ 2026 టీ20 వరల్డ్ కప్‌లో 13 వికెట్లు తీసి టోర్నమెంట్‌లో టాప్ వికెట్ టేకర్స్‌లో ఒకరిగా నిలిచాడు. భారత్‌తో జ‌రిగిన తొలి మ్యాచ్‌లో నాలుగు వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఆ త‌ర్వాత పాకిస్తాన్‌పై 25 ప‌రుగులు ఇచ్చి మ‌రోసారి నాలుగు వికెట్లు కూల్చాడు. పొదుపుగా బౌలింగ్ చేయ‌గా.. 7.76 ఎకానమీ రేట్ న‌మోదైంది.

వుమెన్స్ కేట‌గిరిలో నామినేష‌న్స్‌..

  • క‌రేబియ‌న్ టూర్‌లో వెస్టిండీస్‌పై శ్రీ‌లంక 2-1 తేడాతో గెలిచింది. ఇందులో హ‌ర్షిత కీల‌క‌పాత్ర పోషించింది. మూడు మ్యాచుల్లో క‌లిపి 171 ప‌రుగులు చేసింది. సిరీస్‌లో అత్య‌ధిక ర‌న్స్ చేయ‌గా.. మూడు ఇన్నింగ్స్‌లో వ‌రుస‌గా 66, 35, 70 ప‌రుగుల‌తో రాణించింది.
  • ఫాతిమా స‌న దక్షిణాఫ్రికా టూర్‌లో బ్యాట్, బంతితోనూ రాణించింది. టీ20 సిరీస్‌లో 146 రన్స్ చేయ‌డంతో పాటు 12 ప‌రుగుల‌కే రెండు వికెట్లు తీసుకొని ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సైతం అందుకుంది. ఇక వ‌న్డే సిరీస్‌లో 52 చేయ‌డంతో పాటు నాలుగు వికెట్లు తీసింది.
  • భార‌త జ‌ట్టు క్రికెట‌ర్ అరుంధ‌తి రెడ్డి ఆస్ట్రేలియాతో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 8 వికెట్లు తీసి భారత జట్టు 2-1తో సిరీస్ గెలువ‌డంతో కీల‌క‌పాత్ర పోషించింది. ప్రతి మ్యాచ్‌లో లైన్ లెన్త్‌తో బంతులు విసిరి ఆస్ట్రేలియన్ బ్యాట్ వుమెన్స్‌పై ఒత్తిడి పెంచింది.
Advertisement
Advertisement