Women’s T20 World Cup | మేం క్రికెట్ ఆడేందుకు వచ్చాం.. హ్యాండ్‌షేక్ వివాదంపై హర్మన్‌ప్రీత్ కామెంట్స్..!
Women's T20 World Cup | మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్–పాకిస్థాన్ మధ్య ఆదివారం కీలకపోరు జరుగనున్నది. ఈ మ్యాచ్‌కు ముందు జరిగిన ప్రెస్‌మీట్‌లో షేక్‌హ్యాండ్ వివాదంపై టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ స్పందించేందుకు నిరాకరించింది. జట్టు దృష్టి కేవలం మ్యాచ్‌పైనే క్రికెట్‌పైనే ఉందని, ఇతర విషయాల గురించి ఆలోచించడం లేదని స్పష్టం చేసింది.
Women's T20 World Cup | మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్–పాకిస్థాన్ మధ్య ఆదివారం కీలకపోరు జరుగనున్నది. ఈ మ్యాచ్‌కు ముందు జరిగిన ప్రెస్‌మీట్‌లో షేక్‌హ్యాండ్ వివాదంపై టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ స్పందించేందుకు నిరాకరించింది. జట్టు దృష్టి కేవలం మ్యాచ్‌పైనే క్రికెట్‌పైనే ఉందని, ఇతర విషయాల గురించి ఆలోచించడం లేదని స్పష్టం చేసింది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత.. భారత్-పాకిస్తాన్ జట్లు మ్యాచ్ సమయంలో కరచాలనం చేయడం లేదు. గతేడాది ఆసియా కప్ నుంచి మొదలైన నో హ్యాండ్‌షేక్ విధానం.. ఆ తర్వాతి నుంచి కొనసాగుతూ వచ్చింది. గత వుమెన్స్ వరల్డ్ కప్ సమయంలోనూ హర్మన్‌ప్రీత్ కౌర్, పాక్ కెప్టెన్ ఫాతిమా సనాతో కరచాలనం చేయలేదు. మ్యాచ్‌కు ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ అంశంపై ప్రశ్నలు ఎదురవగా.. టీమిండియా కెప్టెన్ సమాధానం ఇస్తూ.. “మేం ఇక్కడికి క్రికెట్ ఆడటానికే వచ్చాం. ఇతర విషయాల గురించి చర్చించం. మా దృష్టి పూర్తిగా ఆటపైనే ఉంది” అంటూ స్పష్టం చేసింది.
మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో పాకిస్థాన్‌పై భారత్‌కు అద్భుతమైన రికార్డు ఉంది. ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు జరిగిన 16 మ్యాచ్‌ల్లో భారత్ 13 విజయాలు సాధించగా, పాకిస్థాన్ కేవలం మూడు సార్లు మాత్రమే గెలిచింది. మహిళల టీ20 ప్రపంచకప్ చరిత్రలోనూ భారత్ 6-2 ఆధిక్యంలో ఉంది. గణాంకాలు ఎలా ఉన్నా.. పాకిస్థాన్‌తో మ్యాచ్ అంటే ప్రత్యేకమైన ఒత్తిడి ఉంటుందని హర్మన్‌ప్రీత్ అభిప్రాయం వ్యక్తం చేసింది. “అభిమానిగా క్రికెట్ చూడడడం ప్రారంభించినప్పటి నుంచే ఈ మ్యాచ్‌కు ఉన్న ప్రాధాన్యత, ఒత్తిడి ఉందని.. ప్రస్తుతం ప్లేయర్‌గా బాధ్యతలు పెరిగాయని తెలిపింది. ఇలాంటి మ్యాచ్‌లను ఆస్వాదించాలని జట్టులో ఎప్పుడూ చెప్పుకుంటామని, చివరికి ఇది కూడా ఒక క్రికెట్ మ్యాచ్ అని తెలిపింది.
ఏ ప్రధాన టోర్నమెంట్‌లోనైనా తొలి మ్యాచ్ కీలకమని హర్మన్ పేర్కొంది. తొలి పోరు ఫలితమే టోర్నమెంట్‌లో జట్టు ప్రయాణానికి దిశానిర్దేశం చేస్తుందని తెలిపింది. గత మహిళల వన్డే ప్రపంచకప్‌లో మాదిరిగానే ఈసారి కూడా సానుకూలంగా టోర్నీని ప్రారంభించాలనుకుంటున్నట్లు ఆశాభావం వ్యక్తం చేసింది. ప్రస్తుతం పాకిస్థాన్‌పై భారత మహిళల జట్టు వరుసగా మూడు టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఇదే ట్రెండ్‌ను కొనసాగించాలన్న లక్ష్యంతో భారత్ బరిలోకి దిగుతుండగా.. ఈ మ్యాచ్‌లో గెలవాలని పాక్ తహతహలాడుతోంది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Bollywood | బాలీవుడ్లో విషాదం - ఛావా మూవీ నటి ఆత్మహత్య - సోషల్ మీడియాలో యాక్టివ్...అంతలోనే విషాదం!
- ●Noida Airport | నోయిడా ఎయిర్‌పోర్టులో కార్యకలాపాలు మొదలు.. తొలి విమానంలో ప్రయాణించిన భూములిచ్చిన రైతులు
- ●Cucumber | చేదుగా ఉండే కీరదోసను తింటే ప్రమాదమా? ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త!
- ●PM Modi | అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందాన్ని స్వాగతించిన ప్రధాని మోదీ
- ●Cow fell into the well | 200 అడుగుల లోతైన బావిలో పడిన ఆవు.. తర్వాత ఏం జరిగిందంటే!
- ●E20 Petrol | వాహనదారులకు ఈ20 పెట్రోల్ షాక్.. ఇన్సూరెన్స్ క్లెయిమ్ రాదట..

Bollywood | బాలీవుడ్లో విషాదం - ఛావా మూవీ నటి ఆత్మహత్య - సోషల్ మీడియాలో యాక్టివ్...అంతలోనే విషాదం!

Noida Airport | నోయిడా ఎయిర్‌పోర్టులో కార్యకలాపాలు మొదలు.. తొలి విమానంలో ప్రయాణించిన భూములిచ్చిన రైతులు

Cucumber | చేదుగా ఉండే కీరదోసను తింటే ప్రమాదమా? ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త!

PM Modi | అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందాన్ని స్వాగతించిన ప్రధాని మోదీ






