CWG 2026 | తృటిలో చేజారిన స్వర్ణం.. కామన్వెల్త్‌లో మెరిసిన సిల్వర్‌తో మెరిసిన జ్ఞానేశ్వరి..
CWG 2026: | భారత మహిళా వెయిట్‌లిఫ్టర్ జ్ఞానేశ్వరి యాదవ్ కామన్వెల్త్ క్రీడల్లో అద్భుత ప్రదర్శన చేసింది. 53 కేజీల విభాగంలో తన సత్తాచాటుతూ సిల్వర్ మెడల్‌ను సొంతం చేసుకుంది. స్నాచ్, క్లీన్ అండ్ జెర్క్ విభాగాల్లో కలిపి 199 కేజీల బరువును ఎత్తిన జ్ఞానేశ్వరి రెండో స్థానంలో నిలిచింది.
CWG 2026: | భారత మహిళా వెయిట్‌లిఫ్టర్ జ్ఞానేశ్వరి యాదవ్ కామన్వెల్త్ క్రీడల్లో అద్భుత ప్రదర్శన చేసింది. 53 కేజీల విభాగంలో తన సత్తాచాటుతూ సిల్వర్ మెడల్‌ను సొంతం చేసుకుంది. స్నాచ్, క్లీన్ అండ్ జెర్క్ విభాగాల్లో కలిపి 199 కేజీల బరువును ఎత్తిన జ్ఞానేశ్వరి రెండో స్థానంలో నిలిచింది. నైజీరియాకు చెందిన ఒనోమ్ ఒమోలోలా డిడిహ్ 206 కేజీలు (93+113) ఎత్తి స్వర్ణ పతకం గెలిచింది. కెనడాకు చెందిన రెబెక్కా గ్రూల్స్ 178 కేజీలు (83+95) ఎత్తి కాంస్య పతకాన్ని అందుకుంది. జ్ఞానేశ్వరి స్నాచ్‌లోనే పతక పోరులో తొలి ప్రయత్నంలో 82 కేజీలు ఎత్తిన ఆమె.. రెండో ప్రయత్నంలో 85 కేజీలను విజయవంతంగా ఎత్తింది. చివరి ప్రయత్నంలో 88 కేజీలను ఎత్తి ఆకట్టుకుంది. స్నాచ్‌లో మూడు ప్రయత్నాల్లో సక్సెస్ అయ్యింది. ప్రతి ప్రయత్నంలోనూ బరువును పెంచుకుంటూ ముందుకు సాగింది.
ఆమె మూడో ప్రయత్నంలో ఎత్తిన 88 కేజీలు కామన్వెల్త్ రికార్డుగా నమోదైంది. అయితే, ఆ తర్వాత డిడిహ్ 93 కేజీలు ఎత్తి కొత్త రికార్డును నెలకొల్పింది. క్లీన్ అండ్ జెర్క్‌లోనూ జ్ఞానేశ్వరి పోరాటం కొనసాగించింది. తొలి ప్రయత్నంలో 103 కేజీలు, రెండో ప్రయత్నంలో 107 కేజీలు, చివరి ప్రయత్నంలో 111 కేజీలను ఎత్తి మూడు అవకాశాలను సద్వినియోగం చేసుకుంది. అయితే డిడిహ్ మూడు ప్రయత్నాల్లో 105, 110, 113 కేజీలు ఎత్తడంతో స్వర్ణం సాధించింది. స్వర్ణానికి కేవలం ఏడు కేజీల దూరంలో నిలిచిన జ్ఞానేశ్వరి రజతంతో మెరిసింది. ఈ పతకంతో గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో భారత్ ఖాతాలో ఇప్పటివరకు ఐదు పతకాలు చేరాయి. ఇందులో వెయిట్‌లిఫ్టింగ్ నుంచే నాలుగు పతకాలు రావడం విశేషం. భారత్ ఇప్పటివరకు ఒక స్వర్ణం, మూడు రజతాలు, ఒక కాంస్య పతకాన్ని సాధించింది. వెయిట్‌లిఫ్టింగ్‌లో మీరాబాయి చాను స్వర్ణం సాధించగా.. రిషికాంత్ సింగ్, రాజా, జ్ఞానేశ్వరి రజతాలు గెలిచారు. పారా పవర్‌లిఫ్టింగ్‌లో ఝండూ కుమార్ కాంస్య పతకాన్ని అందించాడు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Arrive Alive Campaign | హెల్మెట్ ఉంటేనే ఇంటికి.. ఎరైవ్ అలైవ్‌లో ట్రాఫిక్ పోలీసుల అవగాహన
జులై 27, 2026

HDFC | హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో కీలక పరిణామం.. సొంత ఉన్నతాధికారులకే జరిమానా..!
జులై 27, 2026

Vivek Venkataswamy | సింగరేణి కార్మికులకు రూ.10వేల పెన్షన్ ఇవ్వండి.. కేంద్రమంత్రిని కోరిన వివేక్..!
జులై 27, 2026
తాజావార్తలు
- ●Gosula Srinivas Yadav | హైడ్రా యాక్షన్‌పై హైకోర్టు సీరియస్: కాంగ్రెస్ సర్కార్‌కు చెంపపెట్టు.. రంగనాథ్‌పై యాక్షన్ పక్కానా?
- ●Tamil OTT | డైరెక్ట్‌గా ఓటీటీలోకి రొమాంటిక్ కామెడీ మూవీ - పెళ్లి కొడుకు కాపురానికి అత్తారింటికి వస్తే|
- ●Arrive Alive Campaign | హెల్మెట్ ఉంటేనే ఇంటికి.. ఎరైవ్ అలైవ్‌లో ట్రాఫిక్ పోలీసుల అవగాహన
- ●Rajeev Sagar | హైకోర్టు తీర్పు ప్రభుత్వ వైఫల్యానికి చెంపపెట్టు.. ఇండ్లు కూల్చడం పాలన అనిపించుకోదు
- ●Karur Stampede | కరూర్ బాధితుల ఉద్యోగాలపై హైకోర్టు వేటు.. సీఎం విజయ్ ప్రభుత్వానికి భారీ షాక్!
- ●KCR | నెక్స్ట్ ..సీఎంగా మీరే రావాలె

Gosula Srinivas Yadav | హైడ్రా యాక్షన్‌పై హైకోర్టు సీరియస్: కాంగ్రెస్ సర్కార్‌కు చెంపపెట్టు.. రంగనాథ్‌పై యాక్షన్ పక్కానా?

Tamil OTT | డైరెక్ట్‌గా ఓటీటీలోకి రొమాంటిక్ కామెడీ మూవీ - పెళ్లి కొడుకు కాపురానికి అత్తారింటికి వస్తే|

Arrive Alive Campaign | హెల్మెట్ ఉంటేనే ఇంటికి.. ఎరైవ్ అలైవ్‌లో ట్రాఫిక్ పోలీసుల అవగాహన

Rajeev Sagar | హైకోర్టు తీర్పు ప్రభుత్వ వైఫల్యానికి చెంపపెట్టు.. ఇండ్లు కూల్చడం పాలన అనిపించుకోదు



