Arrive Alive Campaign | హెల్మెట్ ఉంటేనే ఇంటికి.. ఎరైవ్ అలైవ్‌లో ట్రాఫిక్ పోలీసుల అవగాహన
Arrive Alive Campaign | రహదారి భద్రతపై అవగాహన పెంచేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన ‘ఎరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ జంక్షన్‌లో హెల్మెట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. జూబ్లీహిల్స్ జోన్ ట్రాఫిక్ పోలీసులు, తారక్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ద్విచక్ర వాహనదారులు, పిలియన్ రైడర్లకు 200 ఐఎస్‌ఐ ముద్ర కలిగిన హెల్మెట్లను అందజేశారు. జూబ్లీహిల్స్ ట్రాఫిక్ ఏసీపీ కే హరి ప్రసాద్, బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ కే సునీల్ పాల్గొని వాహనదారులకు హెల్మెట్ ప్రాధాన్యాన్ని వివరించారు. ప్రమాదాల సమయంలో తలకు తీవ్ర గాయాలు కాకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించడం తప్పనిసరి అని సూచించారు.
ఈ సందర్భంగా పోలీసులు వాహనదారులతో మాట్లాడి ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. రాంగ్ సైడ్ డ్రైవింగ్, వాహనం నడుపుతూ మొబైల్ ఫోన్ వినియోగించడం, మైనర్లకు వాహనాలు ఇవ్వడం వంటి నిర్లక్ష్యపు చర్యలు ప్రమాదాలకు కారణమవుతున్నాయని తెలిపారు. డ్రైవింగ్ సమయంలో అప్రమత్తంగా ఉండాలని, నిబంధనలు పాటించాలని కోరారు. రహదారి భద్రతపై ప్రజల్లో మార్పు తీసుకురావడమే లక్ష్యంగా ‘ఎరైవ్ అలైవ్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. హెల్మెట్ల పంపిణీ కార్యక్రమానికి వాహనదారుల నుంచి మంచి స్పందన లభించింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

CWG 2026 | తృటిలో చేజారిన స్వర్ణం.. కామన్వెల్త్లో మెరిసిన సిల్వర్‌తో మెరిసిన జ్ఞానేశ్వరి..
జులై 27, 2026

HDFC | హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో కీలక పరిణామం.. సొంత ఉన్నతాధికారులకే జరిమానా..!
జులై 27, 2026

Vivek Venkataswamy | సింగరేణి కార్మికులకు రూ.10వేల పెన్షన్ ఇవ్వండి.. కేంద్రమంత్రిని కోరిన వివేక్..!
జులై 27, 2026
తాజావార్తలు
- ●Gosula Srinivas Yadav | హైడ్రా యాక్షన్‌పై హైకోర్టు సీరియస్: కాంగ్రెస్ సర్కార్‌కు చెంపపెట్టు.. రంగనాథ్‌పై యాక్షన్ పక్కానా?
- ●Tamil OTT | డైరెక్ట్‌గా ఓటీటీలోకి రొమాంటిక్ కామెడీ మూవీ - పెళ్లి కొడుకు కాపురానికి అత్తారింటికి వస్తే|
- ●Rajeev Sagar | హైకోర్టు తీర్పు ప్రభుత్వ వైఫల్యానికి చెంపపెట్టు.. ఇండ్లు కూల్చడం పాలన అనిపించుకోదు
- ●Karur Stampede | కరూర్ బాధితుల ఉద్యోగాలపై హైకోర్టు వేటు.. సీఎం విజయ్ ప్రభుత్వానికి భారీ షాక్!
- ●KCR | నెక్స్ట్ ..సీఎంగా మీరే రావాలె
- ●HDFC | హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో కీలక పరిణామం.. సొంత ఉన్నతాధికారులకే జరిమానా..!

Gosula Srinivas Yadav | హైడ్రా యాక్షన్‌పై హైకోర్టు సీరియస్: కాంగ్రెస్ సర్కార్‌కు చెంపపెట్టు.. రంగనాథ్‌పై యాక్షన్ పక్కానా?

Tamil OTT | డైరెక్ట్‌గా ఓటీటీలోకి రొమాంటిక్ కామెడీ మూవీ - పెళ్లి కొడుకు కాపురానికి అత్తారింటికి వస్తే|

Rajeev Sagar | హైకోర్టు తీర్పు ప్రభుత్వ వైఫల్యానికి చెంపపెట్టు.. ఇండ్లు కూల్చడం పాలన అనిపించుకోదు

Karur Stampede | కరూర్ బాధితుల ఉద్యోగాలపై హైకోర్టు వేటు.. సీఎం విజయ్ ప్రభుత్వానికి భారీ షాక్!



