Gujarat Titans | బస్సులో మంటలు.. కమ్మేసిన పొగ.. గుజరాత్ టైటన్ ఆటగాళ్లకు తప్పిన ముప్పు
Gujarat Titans | త్రినేత్ర.న్యూస్: గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) ఆటగాళ్లకు పెను ప్రమాదం తప్పింది. అసలే ఐపీఎల్ ఫైనల్‌లో ఓటమి (IPL Final Defeat) బాధలో ఉన్నవారికి.. స్టేడియం నుంచి హోటల్‌కు వెళ్తుండగా మరో షాక్ తగిలింది.
Gujarat Titans | త్రినేత్ర.న్యూస్: గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) ఆటగాళ్లకు పెను ప్రమాదం తప్పింది. అసలే ఐపీఎల్ ఫైనల్‌లో ఓటమి (IPL Final Defeat) బాధలో ఉన్నవారికి.. స్టేడియం నుంచి హోటల్‌కు వెళ్తుండగా మరో షాక్ తగిలింది. వారు ప్రయాణిస్తున్న బస్సులో మంటలు (Fire in Bus) చెలరేగాయి. దీంతో ఒక్కసారిగా బస్సును పొగలు కమ్మేశాయి. వెంటనే అప్రమత్తమైన ఆటగాళ్లు, సహాయక సిబ్బంది బస్సులో నుంచి దిగిపోయారు.
షార్ట్ సర్క్యూట్ (Short Circuit) కారణంగా తొలుత పొగలు వచ్చాయి. బస్సు దిగిన తర్వాత మంటలు చెలరేగాయి. కాసేపు రోడ్డుపైనే వేచి ఉన్న ప్లేయర్లు మరో బస్సులో తాము బస చేసిన హోటల్‌కు వెళ్లిపోయారు.
అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్ ఫైనల్‌లో ఆర్సీబీ (RCB) చేతిలో 5 తేడాదో గుజరాత్ ఓడిపోయిన విషయం తెలిసిందే. క్వాలిఫయర్ 2 రాజస్థాన్‌పై పూర్తి అధిపత్యం చెలాయించిన జీటీ.. బెంగళూరుపై పూర్తిగా చతిగిలబడింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ 8 వికెట్లకు 155 పరుగులే చేయగలిగింది. ఆర్సీబీ బౌలర్ల ధాటికి వాషింగ్టన్ సుందర్ (50) మినహా మరే బ్యాట్స్‌మెన్ చెప్పుకోదగిన స్కోర్ చేయలేదు. పేసర్లు భువనేశ్వర్, హేజిల్‌వుడ్ సత్తా చాటడంతో ఆ జట్టు టాప్ఆర్డర్ కుప్పకూలింది. ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లో కెప్టెన్ గిల్ (10)ను హేజిల్‌వుడ్ ఔట్ చేశాడు. ఆ తర్వాతి ఓవర్‌లో భీకర ఫామ్‌లో ఉన్న సాయి సుదర్శన్ (12)ను భువనేశ్వర్ పెవీలియన్‌కు పంపాడు. దీంతో టైటాన్స్‌ను కష్టాలు వెంటాడాయి. సుందర్ మినహా వచ్చిన బ్యాట్స్‌మెన్ వచ్చినట్లే క్యూకట్టారు. దీంతో ఆ జట్టు 155 పరుగులకే పరిమితమైంది.
ఆ తర్వాత వెంకటేశ్ అయ్యర్‌తో కలిసి బ్యాటింగ్ ప్రారంభించిన కోహ్లీ (75) చివరి వరకు క్రీజులోనే ఉన్నాడు. అయ్యర్ (32) ఔటయినప్పటికీ జట్టును విజయం దిషగా నడిపించాడు. పడిక్కల్ (1), పాటీదార్ (15), కృనాల్ పాండ్యా (1) స్వల్ప స్కోర్‌కే వెనుతిరిగినప్పటికీ.. నెమ్మదిగా ఆడితూ టిమ్ డేవిడ్ (24)తో కలిసి మంచి భాగస్వామ్యం నెలకొల్పాడు. చివర్లో డేవిడ్ ఔటైనా.. జితేశ్‌తోకలిసి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. 18వ ఓవర్‌లో విన్నింగ్ షాట్ కొట్టి ఆర్సీబీకి ఐపీఎల్ రెండో కప్‌ను అందించాడు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

IPL | ఐపీఎల్ విజేత ఆర్సీబీ.. మొదటి కప్ గెలిచేందుకు 18 ఏండ్లు.. 12 నెలల్లోనే రెండోది..
జూన్ 1, 2026

IPL Final | తుది అంకానికి చేరిన ఐపీఎల్.. మరికొద్దిసేపట్లో ఫైనల్‌లో బెంగళూరు-గుజరాత్ ఢీ..!
మే 31, 2026

Passenger Train | మంటల్లో మరో రైలు.. షార్ట్ సర్క్యూట్‌తో పాట్నా ప్యాసింజర్‌లో అగ్నిప్రమాదం..
మే 18, 2026
తాజావార్తలు
- ●Bollywood | లైంగిక వేధింపుల ఆరోపణలు - కీర్తి సురేష్ హిందీ వెబ్ సిరీస్ నుంచి సినిమాటోగ్రాఫర్ ఔట్
- ●JEE Advanced Results | జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు విడుదల.. 56 వేల మంది ఉత్తీర్ణత
- ●Vaibhav Sooryavanshi | ఆరెంజ్ క్యాప్ సూర్యవంశీదే.. మరో నాలుగు అవార్డులు కూడా..
- ●IPL | ఐపీఎల్ విజేత ఆర్సీబీ.. మొదటి కప్ గెలిచేందుకు 18 ఏండ్లు.. 12 నెలల్లోనే రెండోది..
- ●LPG Cylinder Price | నెల మారింది.. సిలిండర్ ధర పెరిగింది..
- ●Horoscope | జూన్ 1 రాశిఫలాలు.. ఈ రాశివారు ఇతరులకు మార్గదర్శకంగా ఉంటారు!

Bollywood | లైంగిక వేధింపుల ఆరోపణలు - కీర్తి సురేష్ హిందీ వెబ్ సిరీస్ నుంచి సినిమాటోగ్రాఫర్ ఔట్

JEE Advanced Results | జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు విడుదల.. 56 వేల మంది ఉత్తీర్ణత

Vaibhav Sooryavanshi | ఆరెంజ్ క్యాప్ సూర్యవంశీదే.. మరో నాలుగు అవార్డులు కూడా..

IPL | ఐపీఎల్ విజేత ఆర్సీబీ.. మొదటి కప్ గెలిచేందుకు 18 ఏండ్లు.. 12 నెలల్లోనే రెండోది..



