JEE Advanced Results | జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదల.. 56 వేల మంది ఉత్తీర్ణత
JEE Advanced Results | దేశంలోని 23 ఐఐటీల్లో బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిందుకు నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష ఫలితాలు (JEE Advanced Results) విడుదలయ్యాయి. మే 17న నిర్వహించిన ఈ పరీక్ష ఫలితాలను ఐఐటీ రూర్కీ విడుదల చేసింది.
JEE Advanced Results | త్రినేత్ర.న్యూస్: దేశంలోని 23 ఐఐటీల్లో బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిందుకు నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష ఫలితాలు (JEE Advanced Results) విడుదలయ్యాయి. మే 17న నిర్వహించిన ఈ పరీక్ష ఫలితాలను ఐఐటీ రూర్కీ విడుదల చేసింది. ఐఐటీ ఢిల్లీ జోన్‌కు చెందిన శుభమ్ కుమార్ (Shubham Kumar) టాపర్‌గా నిలివగా, 56 వేల మందికిపైగా విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. షెడ్యూల్ ప్రకారం సోమవారం (జూన్ 1న) ఉదయం 10 గంటలకు విడుదల చేయాల్సి ఉన్నప్పటికీ, ఆదివారం అర్ధరాత్రే ప్రకటించింది. అధికారిక వెబ్‌సైట్ https://cdata.jeeadv.ac.in/result2026/లో ఫలితాలను చూసుకోవచ్చు.

330 మార్కులతో టాప్ స్కోరర్‌గా..
గతంలో జేఈఈ మెయిన్స్‌లో 300కి మూడు వందల మార్కులు సాధించి 1000 పర్సంటైల్ స్కోరుతో అందరి దృష్టిని ఆకర్షించిన ఢిల్లీ జోన్‌కు చెందిన శుభమ్ కుమార్ జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షలో సత్తా చాటారు. మొత్తం 360 మార్కులకుగాను 330 మార్కులతో ఆల్ ఇండియా ర్యాంక్ (AIR)-1 సాధించి టాపర్‌గా నిలిచారు. అదే జోన్‌కు చెందిన కబీర్ చిల్లర్ కేవలం ఒక్క మార్కు తేడాతో అగ్ర స్థానాన్ని చేజార్చుకుని ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించారు. అలాగే 319 మార్కులతో జతిన్ చాహర్ ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్‌ను తన సొంతం చేసుకున్నారు. ఇక మహిళా అభ్యర్థుల విషయానికి వస్తే.. ఐఐటీ ఢిల్లీ జోన్‌కు చెందిన ఆరోహి దేశ్‌పాండే దేశంలోనే అత్యధిక ర్యాంకు సాధించిన మహిళగా నిలిచారు. ఆమె 360 మార్కులకు గాను 280 మార్కులు సాధించి, AIR-77వ ర్యాంక్ కైవసం చేసుకున్నారు.
మహిళా అభ్యర్థులు 10 వేల మంది
జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు దేశవ్యాప్తంగా 1,87,389 మంది అభ్యర్థులు నమోదు చేసుకున్నారు. మే 17న నిర్వహించిన పేపర్ 1, పేపర్ 2 పరీక్షలకు 1,79,694 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీలు, ఇతర ఉన్నత విద్యాసంస్థలలో ప్రవేశానికి మొత్తం 56,880 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. వీరిలో 10,107 మంది మహిళా అభ్యర్థులు ఉండటం విశేషం.

జూన్ 2 నుంచి జోసా..
జూన్ 2 నుంచి ఐఐటీలతోపాటు ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీలు, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్(స్పా), కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే సాంకేతిక విద్యాసంస్థల్లో సీట్ల భర్తీకి జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ(జోసా) కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా సుమారు 1.90 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు. ఈ పరీక్షలో కనీస మార్కులు సాధించినవారు మాత్రమే ఐఐటీల్లో సీట్లకు పోటీ పడాల్సి ఉంటుంది. జేఈఈ మెయిన్ ర్యాంకులతో ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీ, స్పాట్ తదితర విద్యాసంస్థల్లో చేరవచ్చు.
టాప్-10 ర్యాంకర్లు వీరే..
1. శుభమ్ కుమార్ (ఐఐటీ ఢిల్లీ జోన్)- 330 మార్కులు
2. కబీర్ చిల్లర్ (ఐఐటీ ఢిల్లీ జోన్)- 329 మార్కులు
3. జతిన్ చాహర్ (ఐఐటీ ఢిల్లీ జోన్)- 319 మార్కులు
4. మోహిత్ శేఖర్ శుక్లా (ఐఐటీ మద్రాస్ జోన్)- 319 మార్కులు
5. కుచి సందీప్ (ఐఐటీ మద్రాస్ జోన్)- 318 మార్కులు
6. బి. జయకృష్ణ శ్రీనివాస్ (ఐఐటీ బాంబే జోన్)- 314 మార్కులు
7. అర్ణవ్ గౌతమ్ (ఐఐటీ ఢిల్లీ జోన్)- 314 మార్కులు
8. కనిష్క్ జైన్ (ఐఐటీ బాంబే జోన్)- 313 మార్కులు
9. మేడిసెట్టి నాగ సహర్ష (ఐఐటీ మద్రాస్ జోన్)- 312 మార్కులు
10. దర్శ్ సిక్కా (ఐఐటీ ఢిల్లీ జోన్)- 311 మార్కులు

సంబంధిత వార్తలు

IIT Roorkee | చికున్‌గున్యాకు గోమూత్రంతో విజయవంతంగా చికిత్స.. వెల్లడించిన ఐఐటీ రూర్కీ..
జూన్ 24, 2026

IIT Roorkee | క్లౌడ్ స్టోరేజ్ కాంపోనెంట్లో సమస్య వాస్తవమే.. కానీ,.. డేటా లీక్ ఆరోపణలపై ఐఐటీ రూర్కీ క్లారిటీ
జూన్ 5, 2026

Dasoju Sravan | స్టూడెంట్స్ డేటానే ఈజీగా లీక్ చేశారు.. రేపు క్వశ్చన్ పేపర్లు భద్రంగా ఉంటాయన్న గ్యారెంటి ఏంటి?: దాసోజు శ్రావణ్
జూన్ 5, 2026
తాజావార్తలు
- ●CM Vijay | ఏడాదికి 3 సిలిండర్లు.. ఉచిత బస్సు ప్రయాణం.. సీఎం వరాల జల్లు
- ●IPO | ఐపీఓల సందడి.. ఈ వారం రూ.3,300 కోట్లకు పైగా ఇష్యూలు..
- ●Newborns Died | అమరావతి హాస్పిటల్లో పేలిన వెంటిలేటర్.. ముగ్గురు నవజాత శిశువులు సజీవదహనం
- ●Stock Markets | స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. తగ్గిన ముడి చమురు ధరలు..
- ●Sarampally Malla Reddy | రైతు సంఘం నేత సారంపల్లి మల్లారెడ్డి కన్నుమూత..
- ●Heavy Rain Alert | నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ

CM Vijay | ఏడాదికి 3 సిలిండర్లు.. ఉచిత బస్సు ప్రయాణం.. సీఎం వరాల జల్లు

IPO | ఐపీఓల సందడి.. ఈ వారం రూ.3,300 కోట్లకు పైగా ఇష్యూలు..

Newborns Died | అమరావతి హాస్పిటల్లో పేలిన వెంటిలేటర్.. ముగ్గురు నవజాత శిశువులు సజీవదహనం

Stock Markets | స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. తగ్గిన ముడి చమురు ధరలు..



