త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

IPL Final | తుది అంకానికి చేరిన ఐపీఎల్‌.. మ‌రికొద్దిసేప‌ట్లో ఫైన‌ల్‌లో బెంగ‌ళూరు-గుజ‌రాత్ ఢీ..!

IPL Final | ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ తుది అంకానికి చేరుకుంది. అహ్మ‌దాబాద్ వేదిక‌గా రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, గుజ‌రాత్ టైటాన్స్ త‌ల‌ప‌డ‌నున్నాయి. ఏ జ‌ట్టు గెలిచినా రెండోసారి టైటిల్ సొంతం చేసుకున్న జ‌ట్టుగా నిలువ‌నున్నాయి. డిఫెండింగ్ చాంపియ‌న్‌గా బ‌రిలోకి దిగుతున్న ఆర్‌సీబీ వ‌రుస‌గా రెండోసారి టైటిల్‌ను సాధించాల‌న్న క‌సితో ఉన్న‌ది.

P

Sports | Published On May 31, 2026, 5.55 pm IST

IPL Final | తుది అంకానికి చేరిన ఐపీఎల్‌.. మ‌రికొద్దిసేప‌ట్లో ఫైన‌ల్‌లో బెంగ‌ళూరు-గుజ‌రాత్ ఢీ..!
Advertisement

IPL Final | ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ తుది అంకానికి చేరుకుంది. అహ్మ‌దాబాద్ వేదిక‌గా రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, గుజ‌రాత్ టైటాన్స్ త‌ల‌ప‌డ‌నున్నాయి. ఏ జ‌ట్టు గెలిచినా రెండోసారి టైటిల్ సొంతం చేసుకున్న జ‌ట్టుగా నిలువ‌నున్నాయి. డిఫెండింగ్ చాంపియ‌న్‌గా బ‌రిలోకి దిగుతున్న ఆర్‌సీబీ వ‌రుస‌గా రెండోసారి టైటిల్‌ను సాధించాల‌న్న క‌సితో ఉన్న‌ది. అదే స‌మ‌యంలో శుభ్‌మ‌న్ గిల్ నేతృత్వంలోని గుజ‌రాత్ టైటాన్స్ సైతం ఈ సారి టైటిల్‌ను గెల‌వాల‌న్న ఆకాంక్ష‌తో బ‌రిలోకి దిగుతోంది.

బ్యాట్స్‌మెన్ రాణిస్తేనే..

ఫైన‌ల్ మ్యాచ్‌లో గుజ‌రాత్ ప‌లు మార్పులు చేసే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌కు బ‌దులుగా రాహుల్ తెవాటియాను ప్లేయింగ్ ఎలెవ‌న్‌లోకి తీసుకునే అవ‌కాశాలున్నాయి. దాంతో అద‌నంగా బ్యాట్స్‌మెన్ అందుబాటులో ఉండ‌నున్నాడు. అలాగే, గుజ‌రాత్ బౌలింగ్ విభాగం రాణిస్తేనే చాంపియ‌న్స్‌గా నిలిచే అవ‌కాశం ఉంది. క‌సిగో ర‌బాడా, ప్ర‌సిద్ధ్ కృష్ణ‌, మ‌హ్మ‌ద్ సిరాజ్‌లు త‌మ స్థాయికి త‌గిన‌ట్లుగా రాణిస్తేనే గుజ‌రాత్‌కు విజ‌య అవ‌కాశాలున్నాయి. ఫైనల్‌లో గుజరాత్ ఈ ముగ్గురు బ్యాట్స్‌మెన్లు త్వ‌ర‌గా అవుట్ చేస్తే ఆర్‌సీబీ ఇబ్బందిక‌ర‌మ‌వుతుంది. గుజ‌రాత్ టైటాన్స్ నిల‌డ‌క‌గా ఆడే జ‌ట్టుగా పేరున్నా ఆర్‌సీబీ దూకుడును ఎదుర్కోవ‌డం స‌వాల్‌గా మారే అవ‌కాశం ఉంది. దాంతో ఫైన‌ల్ మ్యాచ్ ఉత్కంఠభ‌రిత పోరు జ‌రిగే అవ‌కాశం ఉంది.

క్వాలిఫ‌య‌ర్‌-1లో నిరాశ ప‌రిచిన బ్యాట్స్‌మెన్‌..

అయితే, ఆర్‌సీబీతో జ‌రిగిన క్వాలిఫ‌య‌ర్‌-1 మ్యాచ్‌లో గుజ‌రాత్ బ్యాటింగ్ పూర్తిగా నిరాశ‌పరిచింది. పవర్‌ప్లేలోనే జట్టు ఐదు వికెట్లు కోల్పోయింది. కానీ, రాజస్థాన్ రాయల్స్‌పై బలంగా బ్యాటింగ్ చేసింది. గుజరాత్ బలం దాని టాప్ ఆర్డర్. సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ జోడి అద్భుతంగా రాణించి, ప్లేఆఫ్స్‌లో ఏ వికెట్‌కైనా అత్యధిక భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. టీ20లలో గిల్-సుదర్శన్ ఓపెనింగ్ జోడి 11వ సారి సెంచ‌రీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి, అత్యధిక భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. ఇప్పటివరకు జట్టుకు పునాదిగా నిలిచిన టాప్ ఆర్డర్‌పై గుజరాత్ మరోసారి ఆధారపడనుంది. గిల్, సుదర్శన్‌లతో పాటు జోస్ బట్లర్ కూడా దూకుడుగా బ్యాటింగ్ చేసే స‌త్తా ఉంది.

ప్రైజ్‌మ‌నీ..

ఐపీఎల్‌లో గెలిచిన జ‌ట్టుకు బీసీసీ రూ.46.5కోట్ల ప్రైజ్‌మ‌నీ ఇవ్వ‌నుందిన స‌మాచారం. టోర్నీ విజేతగా నిలిచే జట్టుకు ట్రోఫీతో పాటు రూ.20 కోట్ల నగదు, రన్నరప్‌గా జట్టుకు రూ.13కోట్ల ప్రైజ్‌మ‌నీ ద‌క్కుతుంది. క్వాలిఫయర్ 2లో ఓడిన రాజస్థాన్ రాయల్స్‌కు రూ.7 కోట్లు, ఎలిమినేటర్‌లో పరాజయం పాలైన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు రూ.6.50 కోట్లు రానున్నాయి. ఐదు నుంచి పదో స్థానంలో ఉన్న జట్లకు ప్రైజ్‌మ‌నీ ఉండ‌దు. ఆటగాళ్లకూ వ్యక్తిగతంగా ప్రైజ్ మనీ ఇస్తారు. ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ హోల్డర్స్, అత్యంత విలువైన ఆటగాడికి రూ.10 లక్షల చొప్పున ఇవ్వ‌నున్నారు. అలాగే, ఎమర్జింగ్ ప్లేయర్‌కు రూ.20 లక్షలు అందుతుంది.

బెంగళూరులో కఠిన ఆంక్షలు

ఐపీఎల్ ఫైనల్ సందర్భంగా పోలీసులు బెంగ‌ళూరులో భద్రతను కట్టుదిట్టం చేశారు. గతేడాది జరిగిన తొక్కిసలాట జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ట్రాఫిక్ ఆంక్షలు అమ‌లులోకి తీసుకువ‌చ్చారు. బైక్ స్టంట్స్, హారన్స్‌ టపాసులు, రోడ్లపై గుమిగూడటం, అనుమతి లేని ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేయడంపై నిషేధం విధించారు. మాల్స్, పబ్స్‌లో పబ్లిక్ వ్యూయింగ్‌కూ అనుమతి ఇవ్వ‌లేదు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు.

Advertisement
Advertisement