IPL 2026 | చెన్నైకి మరో పరాజయం.. గుజరాత్ టైటాన్స్ విక్టరీ..!
IPL 2026 | చెపాక్ వేదికగా జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ చెన్నై సూపర్ కింగ్స్‌పై ఘన విజయం సాధించింది. 159 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ జట్టు 16.4 ఓవర్లలోనే రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి సులభంగా ఛేదించింది. సాయి సుదర్శన్ 87 పరుగులతో అద్భుత ప్రదర్శన కనబరిచి విజయానికి కీలక పాత్ర పోషించాడు. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఒంటరి పోరాటం చేస్తూ 74 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
అయితే, మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించలేకపోవడంతో జట్టు భారీ స్కోరు సాధించలేకపోయింది. ఆ తర్వాత గుజరాత్ ఓపెనర్లు శుభ్‌మన్ గిల్ (33), సాయి సుదర్శన్ కలిసి 58 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఆ తర్వాత సుదర్శన్ దూకుడు ప్రదర్శనతో చెన్నై బౌలర్లపై ఆధిపత్యం చెలాయించాడు. జోస్ బట్లర్ (39*) చివరి వరకు నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ విజయంతో గుజరాత్ టైటాన్స్ ఎనిమిది మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి చేరింది. చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం ఐదు పరాజయాలతో ఆరవ స్థానంలో కొనసాగుతోంది. తదుపరి మ్యాచ్‌లో గుజరాత్ అహ్మదాబాద్‌లో ఆర్సీబీతో తలపడనుండగా, చెన్నై ముంబయి ఇండియన్స్‌ను చెపాక్‌లో ఢీకొట్టనుంది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు






