T20 World Cup | టీ20 ప్రపంచకప్ కప్‌లో సంచలనం.. ఆస్ట్రేలియాను మట్టికరిపించిన జింబాబ్వే..!
T20 World Cup | టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా ఘోర పరాజయం పాలైంది. మాజీ ప్రపంచ చాంపియన్‌ను జింబాబ్వే 23 పరుగుల తేడాతో మట్టి కరిపించింది. కొలంబో ఆర్ ప్రేమదాస స్టేడియంలో శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే రెండు వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది.
T20 World Cup | టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా ఘోర పరాజయం పాలైంది. మాజీ ప్రపంచ చాంపియన్‌ను జింబాబ్వే 23 పరుగుల తేడాతో మట్టి కరిపించింది. కొలంబో ఆర్ ప్రేమదాస స్టేడియంలో శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే రెండు వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా 19.3 ఓవర్లలో 146 పరుగులకే కుప్పకూలింది. ఆస్ట్రేలియాపై జింబాబ్వేకు ఇది రెండో టీ20 విజయం. 2007 టీ20 ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియాను ఐదు వికెట్ల తేడాతో ఓడించింది. ఈ రెండూ జట్లు ఇప్పటివరకు నాలుగు సార్లు తలపడగా.. ఆసిస్, జింబాబ్వే జట్టు రెండేసి సార్లు గెలిచాయి.
జింబాబ్వే ఇన్నింగ్స్ ఇలా..
తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే శుభారంభం చేసింది. ఎనిమిదో ఓవర్‌లో 61 పరుగుల వద్ద జింబాబ్వే తొలి ఎదురుదెబ్బ తగిలింది. మార్కస్ స్టోయినిస్ బౌలింగ్‌లో మరుమాణి 21 బంతుల్లో ఏడు ఫోర్లతో 35 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 16వ ఓవర్ చివరి బంతికి ర్యాన్ బర్ల్ అవుట్ అయ్యాడు. బర్ల్ 30 బంతుల్లో నాలుగు ఫోర్లతో 35 పరుగులు చేసి కామెరాన్ గ్రీన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ఇక బ్రియాన్ బెన్నెట్ 56 బంతుల్లో ఏడు ఫోర్లతో 64 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. కెప్టెన్ సికందర్ రాజా సైతం 13 బంతుల్లో రెండు ఫోర్లు, సిక్సర్‌తో అజేయంగా 25 పరుగులు చేశాడు. ఈ ఇద్దరూ నాల్గో వికెట్‌కు 24 బంతుల్లో అజేయంగా 38 పరుగులు జోడించారు. నిర్ణీత 20 ఓవర్లలో జింబాబ్వే మొత్తం 169 పరుగులు చేసింది.
ఎనిమిది పరుగుల వద్ద తొలి దెబ్బ..
ఇక 170 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన ఆస్ట్రేలియాకు ఎనిమిది పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. జోష్ ఇంగ్లిష్ ఎనిమిది పరుగులు చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు. ట్రావిస్ హెడ్ (17) పరుగులు చేసి అవుట్ కాగా.. కామెరూర్ గ్రీన్, టిమ్ డేవిడ్ డకౌట్‌గా వెనుదిరిగాడు. గ్లెన్ మ్యాక్స్‌వెల్ (31), మ్యాట్ రెన్‌షా (65) రాణించారు. ఇద్దరు కలిసి ఐదో వికెట్‌కు 77 పరుగులు జోడించారు. ఆ తర్వాత మార్కస్ స్టోయినిస్ నాలుగు బంతుల్లో ఆరు పరుగులు మాత్రమే చేయగలిగాడు. ద్వార్షుయిస్ ఆరు పరుగులు చేసి అవుట్ అయ్యాడు. నాథన్ ఎల్లిస్, ఆడమ్ జాంపా తక్కువ స్కోర్‌కే వెనుదిరిగారు. బ్లెస్సింగ్ ముజారబాని నాలుగు వికెట్లు, బ్రాడ్ ఇవాన్స్‌కు మూడు, మసకద్జాకి ఒకటి, రియాన్ బ్లర్‌కి ఒక వికెట్ దక్కింది. ఇదిలా ఉండగా.. ఈ మ్యాచ్‌కు మిచెల్ మార్ష్ దూరమయ్యాడు. అతని స్థానంలో ట్రావిస్ హెడ్ కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నాడు. ఆస్ట్రేలియా తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌ను 67 పరుగులు, జింబాబ్వే ఒమన్‌ను ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించడం విశేషం.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






