Esha Singh | షూట్‌ఆఫ్స్‌లో అదరగొట్టిన ఈషా.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో పతకం..
Esha Singh | ఆసియా క్రీడలు–2026లో భారత షూటర్ ఈషా సింగ్ సత్తాచాటింది. మహిళల 25 మీటర్ల పిస్టల్ వ్యక్తిగత విభాగంలో రజత పతకం సాధించింది. హోరాహోరీగా సాగిన ఫైనల్లో ఒక దశలో మూడో స్థానానికి పడిపోయిన ఈషా.. ఒత్తిడిని అధిగమిస్తూ పుంజుకుని పతకాన్ని ఖాయం చేసుకుంది.
Esha Singh | ఆసియా క్రీడలు–2026లో భారత షూటర్ ఈషా సింగ్ సత్తాచాటింది. మహిళల 25 మీటర్ల పిస్టల్ వ్యక్తిగత విభాగంలో రజత పతకం సాధించింది. హోరాహోరీగా సాగిన ఫైనల్లో ఒక దశలో మూడో స్థానానికి పడిపోయిన ఈషా.. ఒత్తిడిని అధిగమిస్తూ పుంజుకుని పతకాన్ని ఖాయం చేసుకుంది. చివరకు స్వర్ణం కోసం జరిగిన షూట్‌ఆఫ్‌లో చైనా షూటర్ జియారుయిక్సువాన్ జియావో చేతిలో ఓడి రజతంతో సరిపెట్టుకుంది. ఫైనల్‌లో తొలి 10 షాట్ల తర్వాత 9 పాయింట్లతో ఈషా అగ్రస్థానంలో ఉంది. 25 షాట్ల తర్వాత 20 పాయింట్లతో టాప్–3లో కొనసాగింది. 30 షాట్లకు 23 పాయింట్లతో మూడో స్థానానికి పడిపోయింది. 40 షాట్ల తర్వాత 31 పాయింట్లతోనూ మూడో స్థానంలోనే నిలిచింది. చివరి సిరీస్ అనంతరం 38 పాయింట్లతో జియావోతో సమంగా నిలిచి రజతం ఖాయం చేసుకుంది.
మూడుసార్లు షూట్‌ఆఫ్..
మూడో స్థానం కోసం ఉత్తర కొరియాకు చెందిన కిమ్ హ్యోన్ సుక్‌తో ఈషా తలపడింది. తొలి షూట్‌ఆఫ్‌లో ఇద్దరూ 5కి 3 చొప్పున టార్గెట్లను ఛేదించారు. రెండో షూట్‌ఆఫ్‌లోనూ అదే స్కోరు రావడంతో మరోసారి షూట్‌ఆఫ్ అనివార్యమైంది. మూడో ప్రయత్నంలో ఈషా 3/5, కిమ్ 2/5 స్కోర్ చేయడంతో ఈషా విజయం సాధించింది. దీంతో కనీసం రజతం ఖాయమవగా.. కిమ్‌కు కాంస్యం దక్కింది. రజతం ఖాయమైన తర్వాత స్వర్ణం కోసం చైనా షూటర్ జియారుయిక్సువాన్ జియావోతో ఈషా పోటీపడింది. ఇద్దరూ 38–38తో సమంగా నిలవడంతో షూట్‌ఆఫ్ నిర్వహించారు. తొలి షూట్‌ఆఫ్‌లో ఇద్దరూ 4/5 స్కోర్ చేశారు. రెండో షూట్‌ఆఫ్‌లో జియావో 3/5, ఈషా 2/5 సాధించింది. దీంతో జియావో స్వర్ణం గెలుచుకోగా.. ఈషా రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
ఫైనల్‌కు ఈషానే..
వ్యక్తిగత విభాగం క్వాలిఫికేషన్‌లో ఈషా 580 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించింది. ఇదే స్కోరుతో చైనీస్ తైపీ షూటర్ యెన్–చింగ్ చెంగ్ కూడా నిలిచినా.. ఈషా 22 ఇన్నర్–10లు కొట్టడంతో ఫైనల్ బెర్త్ దక్కింది. మను భాకర్ 11వ, రాహి సర్నోబత్ 30వ స్థానాల్లో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయారు. అంతకుముందు మహిళల టీమ్ ఈవెంట్‌లోనూ భారత్‌కు నిరాశ ఎదురైంది. మను భాకర్, ఈషా సింగ్, రాహి సర్నోబత్‌లతో కూడిన భారత జట్టు 1727-56x స్కోర్‌తో ఐదో స్థానంలో నిలిచింది. ఇదిలా ఉండగా.. ఈ ఏడాది మే 26న జర్మనీలోని మ్యూనిక్‌లో జరిగిన మహిళల 25 మీటర్ల పిస్టల్ వ్యక్తిగత ఫైనల్లో ఈషా 43 పాయింట్లు సాధించి ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఇప్పుడు ఆసియా క్రీడల్లో రజత పతకంతో మరో ఘనతను సాధించింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

TGPSC | టీజీపీఎస్సీ పరీక్షల షెడ్యూల్ విడుదల.. అక్టోబర్ 24 నుంచి నవంబర్ 13 వరకు నియామక పరీక్షలు
సెప్టెంబర్ 28, 2026

Asian Games | ఆసియా గేమ్స్‌లో దాయాదుల సమరం.. అక్టోబర్ 1న హైవోల్టేజ్ మ్యాచ్
సెప్టెంబర్ 28, 2026

Virat Kohli | కోహ్లీ మరో చరిత్ర.. వన్డేల్లో 15 వేల పరుగులు.. సచిన్ రికార్డుపైనే కన్ను..!
సెప్టెంబర్ 27, 2026
తాజావార్తలు
- ●TGPSC | టీజీపీఎస్సీ పరీక్షల షెడ్యూల్ విడుదల.. అక్టోబర్ 24 నుంచి నవంబర్ 13 వరకు నియామక పరీక్షలు
- ●Telangana Graduate MLC Voter Registration | గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు నమోదు షురూ: అర్హతలు ఇవే.. ఫోన్ నుంచే ఫారమ్-18 కు ఎలా దరఖాస్తు చేసుకోవాలి
- ●MLA Sanjay | ప్రమీల చాలా మంది పసిబిడ్డలను కాపాడారు
- ●Asian Games | ఆసియా గేమ్స్‌లో దాయాదుల సమరం.. అక్టోబర్ 1న హైవోల్టేజ్ మ్యాచ్
- ●Ashika Ranganath | ఏజ్ గ్యాప్‌పై ట్రోల్స్ - అజిత్ సినిమా నుంచి శ్రీలీల ఔట్ - కన్నడ బ్యూటీకి ఛాన్స్
- ●Supreme Court | టీఎంసీ పార్టీ గుర్తు, పేరుపై వివాదం.. ఎన్నికల సంఘానికి సుప్రీం కీలక ఆదేశాలు

TGPSC | టీజీపీఎస్సీ పరీక్షల షెడ్యూల్ విడుదల.. అక్టోబర్ 24 నుంచి నవంబర్ 13 వరకు నియామక పరీక్షలు

Telangana Graduate MLC Voter Registration | గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు నమోదు షురూ: అర్హతలు ఇవే.. ఫోన్ నుంచే ఫారమ్-18 కు ఎలా దరఖాస్తు చేసుకోవాలి

MLA Sanjay | ప్రమీల చాలా మంది పసిబిడ్డలను కాపాడారు

Asian Games | ఆసియా గేమ్స్‌లో దాయాదుల సమరం.. అక్టోబర్ 1న హైవోల్టేజ్ మ్యాచ్



