ENG vs NEP | ఇంగ్లండ్‌కు ముచ్చెమటలు.. పోరాడి ఓడిన పసికూన నేపాల్..!
ENG vs NEP | ఇంగ్లండ్ జట్టుకు పసికూన నేపాల్ ముచ్చెమటలు పట్టించింది. చివరి బంతి వరకు ఆ జట్టుకు చుక్కలు చూపింది. చిరవ ఓవర్‌లో సామ్ కర్రన్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఇంగ్లిష్ జట్టు పసికూనపై కేవలం నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించింది.
ENG vs NEP | ఇంగ్లండ్ జట్టుకు పసికూన నేపాల్ ముచ్చెమటలు పట్టించింది. చివరి బంతి వరకు ఆ జట్టుకు చుక్కలు చూపింది. చిరవ ఓవర్‌లో సామ్ కర్రన్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఇంగ్లిష్ జట్టు పసికూనపై కేవలం నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించింది. టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా ఐదో మ్యాచ్ ఆదివారం వాంఖడేలో ఇంగ్లండ్-నేపాల్ మధ్య జరిగింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. నేపాల్ జట్టు 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసి తృటిలో విజయాన్ని చేజార్చుకుంది. అయితే, ఇంగ్లండ్ నిర్దేశించి భారీ టార్గెట్‌తో ఓ దశలో నేపాల్ మ్యాచ్ గెలుస్తుందని భావించారు. చివరి రెండు ఓవర్లు ఇంగ్లిష్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఆ జట్టు ఘోర పరాజయం నుంచి తప్పించుకుంది.
చివరి బంతి వరకు పోరాడిన నేపాల్
ఇంగ్లండ్ నిర్దేశించిన 185 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన నేపాల్‌కు శుభారంభం దక్కింది. 37 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. అసిఫ్ షైక్ (7) అవుట్ అయ్యాడు. కుషాల్ భూర్తెల్ (29), రోహిత్ పౌడెల్ (39), దీపేంద్ర సింగ్ ఐరీ (44) స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లారు. అయితే, చివరలో లోకేశ్ బామ్ ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 20 బంతుల్లోనే రెండు సిక్సర్లు, నాలుగు ఫోర్ల సహాయంతో 39 పరుగులు చేశాడు. కానీ, చివరలో ఇంగ్లండ్ బౌలర్ సామ్ కర్రన్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. నేపాల్ విజయానికి ఆఖరి ఓవర్‌లో ఆరు బంతులకు పది పరుగులు అవసరమైన సమయంలో.. బౌలింగ్‌కు వచ్చిన శామ్ కర్రన్ కట్టుదిట్టబంగా బంతులు విసిరాడు. దాంతో నేపాల్ కేవలం ఐదు పరుగులు మాత్రమే చేయగలిగింది. మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠగా కొనసాగింది. నేపాల్ తృటిలో ఓటమి పాలుకాగా.. ఇంగ్లండ్ పరువును కాపాడుకుంది. ఇంగ్లండ్ బౌలర్లలో లియామ్ డాసన్ రెండు వికెట్లు తీయగా.. ల్యూక్ వుడ్, ఆర్చర్, విల్ జాక్స్, సామ్ కర్రన్‌కు తలో వికెట్ దక్కింది.
ఇంగ్లండ్ బ్యాటింగ్ ఇలా..
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్‌కు ఆరంభంలో షాక్ తగిలింది. విధ్వంసక ఓపెనర్ ఫిల్ సాల్ట్ కేవలం ఒక పరుగుకే అవుట్ అయ్యాడు. టీ20 ప్రపంచ కప్ అరంగేట్రం చేసిన జాకబ్ బెథెల్‌తో కలిసి జోస్ బట్లర్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దేందుకు ప్రయత్నించారు. ఆ తర్వాత 26 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద పెవిలియన్‌కు చేరాడు. టామ్ బాటన్ సైతం తక్కువ స్కోర్‌కే వెనుదిరిగాడు. ఇక కెప్టెన్ హ్యారీ బ్రూక్ బెథెల్‌తో కలిసి స్కోర్ బోర్డును పరుగులెత్తించాడు. ఈ క్రమంలో 35 బంతుల్లో నాలుగు సిక్సర్లు, నాలుగు ఫోర్లతో అర్ధ సెంచరీ చేశాడు. కెప్టెన్ హ్యారీ బ్రూక్ కూడా నాలుగు సిక్సర్లు, మూడు ఫోర్లతో 32 బంతుల్లో 53 హాఫ్ సెంచరీని సాధించాడు. ఇద్దరు నాలుగో వికెట్‌కు 71 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇంగ్లండ్ చివరి మూడు ఓవర్లలో 45 పరుగులు రాబట్టింది. విల్ జాక్స్ నాలుగు సిక్సర్లు, ఒక ఫోర్ కొట్టి 18 బంతుల్లో 39 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. నేపాల్ బౌలింగ్, ఫీల్డింగ్‌లో అందరినీ ఆకర్షించింది. నేపాల్ బౌలర్లలో దీపేంద్ర సింగ్ ఐరీ (2/23), నందన్ యాదవ్ (2/25) చెరో రెండు వికెట్లు తీయగా, షేర్ మల్లా, సందీప్ లామిచానే తలా ఒక వికెట్ దక్కింది.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






